ప్రచారానికి వైఎస్సార్ సీపీ సాంస్కృతిక దళాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రచారానికి వైఎస్సార్ సీపీ సాంస్కృతిక దళాలు

ప్రచారానికి వైఎస్సార్ సీపీ సాంస్కృతిక దళాలు

Written By news on Saturday, April 21, 2012 | 4/21/2012

త్వరలో 18 శాసనసభ, 1 లోక్‌సభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విసృ్తతంగా ప్రచారం చేయడానికి 20 సాంస్కృతిక దళాలను సిద్ధం చేసినట్లు ఆ విభాగం కన్వీనర్ వంగపండు ఉష తెలిపారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయా జిల్లాల కన్వీనర్లు, కళాకారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఆమె వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ విధానాలను ప్రజల్లో ప్రచారం చేసేందుకు వీలుగా రూపొందించిన కొత్త పాటల క్యాసెట్లు, ఇతర సరంజామాను సిద్ధం చేసుకున్నామని వివరించారు. ఈ సమావేశంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు, పార్టీ ఎస్సీ విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్ పాల్గొన్నారు.
Share this article :

0 comments: