చెప్పులతో కొట్టడానికి ప్రజలు సిద్ధం: అంబటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చెప్పులతో కొట్టడానికి ప్రజలు సిద్ధం: అంబటి

చెప్పులతో కొట్టడానికి ప్రజలు సిద్ధం: అంబటి

Written By news on Thursday, April 12, 2012 | 4/12/2012

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి వల్ల ప్రయోజనాలు పొందిన వారు, పదవులు పొందిన వారు, ఆయన మోచేతి కింద నీళ్లు తాగిన వారే మహానేతను విమర్శించడం సిగ్గు చేటు అని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు విమర్శించారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మరణించిన వై.ఎస్‌పై కాంగ్రెస్ నాయకులు విమర్శించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వై.ఎస్ ప్రాపకంతో పైకి వచ్చి ఆయనపైనే విమర్శలు చేసే వారిని తెలుగు ప్రజలు, వైఎస్సార్ అభిమానులూ చెప్పులతో తరిమి కొడతారని ఆయన హెచ్చరించారు. ఈ నెల 15 నుంచి ప్రజాపథం రాష్ట్రంలో ప్రారంభం కానుందనీ అంతకుముందే పర్యటనలకు వెళ్లిన మంత్రులకు తీవ్ర నిరసనలు ఎదురయ్యాయనీ ఆయన అన్నారు. 

గంటా శ్రీనివాసరావుకు అనకాపల్లి నియోజకవర్గంలో ప్రజలు తరిమి తిట్ల పురాణాన్ని లంఘించుకున్నారనీ మరో చోట టి.జి.వెంకటేష్‌కు తీవ్ర నిరసన వ్యక్తం అయిందనీ పొన్నాల లక్ష్మయ్యపై చెప్పులతో దాడి చేసినంత పనైందనీ అంబటి విమర్శించారు. ఇక ప్రజాపథంలో ప్రజలు మంత్రులను ఎలా తరమబోతున్నారోఅనడానికి ఇదొక శాంపిల్ (నమూనా) మాత్రమేననీ మంత్రులు కూడా పరుగు పందానికి సిద్ధంగా ఉండాలనీ ఆయన ఎద్దేవా చేశారు. వై.ఎస్ మరణించాక ఆయనను దూషిస్తే ఇలాగే ఉంటుంది మరి, అని కూడా ఆయన హెచ్చరించారు. రాజశేఖరరెడ్డి మరణించాక అసలు రాష్ట్రంలో పరిస్థితులు ఎందుకిలా తయారయ్యాయో మంత్రులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన హితవు చెప్పారు. ‘వై.ఎస్‌ను విమర్శించాలనే విషయంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలున్నాయి. 

కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వై.ఎస్‌ను విమర్శించబోనని చెప్పారు...టీడీపీ నాయకుడు పాలకొండరాయుడు రాయచోటిలో తమ నాయకుడు ఎన్.చంద్రబాబునాయుడు సమక్షంలోనే వై.ఎస్‌ను విమర్శించబోనని తేల్చి చెప్పారు...వై.ఎస్‌తో కలిసి తాను ఎన్నోసార్లు భోజనం చేశాననీ కొంత కాలం పాటు సన్నిహితంగా మెలిగాననీ అందుకే తాను అలా చేయనని ఆయన ప్రకటించారు... ఎపుడో సన్నిహితంగా మెలిగినందుకు, ఆయనతో కలిసి భోజనం చేసినందుకే విమర్శించబోనని చెప్పిన పాలకొండ్రాయుడు చెప్పారంటే...మరి వై.ఎస్ ప్రాపకంతో పైకి వచ్చిన వారు విమర్శలకు దిగుతూ ఉంటే ఏం చెప్పాలి?’ అని ఆయన ప్రశ్నించారు. వై.ఎస్‌ను కాంగ్రెస్ వారు తమ వాడేనని అనుకున్నా లేక పోయినా ఫర్వాలేదనీ ఒక చనిపోయిన నాయకుడిని విమర్శిస్తే మాత్రం ప్రజలు జీర్ణించుకోలేరనీ ఇదే విధానాన్ని కొనసాగిస్తే ఆ పార్టీని దేవుడు కూడా కాపాడలేడని అంబటి పేర్కొన్నారు. 

జగన్ శవరాజకీయాలు చేశారని, ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు పెట్టించారనీ చంద్రబాబు చేసిన ఆరోపణలపై ఆయన నిప్పులు చెరిగారు.‘ అసలు శవాలతో రాజకీయం చేసింది చంద్రబాబే...ఎన్టీఆర్‌ను శవంగా మార్చి ఆ శవంపై కాలు పెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ రోజు చెబుతున్న మాటలు చూసి పరిశీలకులకూ రాజకీయ విశ్లేషకులకూ నవ్వాలో, ఏడవాల్లో తెలియని పరిస్థితి ఏర్పడింది’ అని అంబటి అన్నారు. కలిసి భోజనం చేసినందుకే వై.ఎస్‌ను విమర్శించబోనని టీడీపీ నాయకుడు చెప్పినపుడు అదే వై.ఎస్ దగ్గర పాకెట్ మనీ (రోజు వారీ ఖర్చులు) తీసుకుని రాజకీయాలు చేసిన చంద్రబాబు మరణించిన వై.ఎస్‌పై విమర్శలు చేయడం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు గురించి ఆయనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆరే ‘చంద్రబాబు ఒక రాజకీయ తార్పుడుగాడు’ అని చెప్పిన విషయం మరిచారా అని ఆయన ప్రశ్నించారు.

వై.ఎస్‌తో జగన్‌ను విడదీసి చూడలేమని కాంగ్రెస్, టీడీపీ నాయకులు చెబుతున్న మాటలను తామూ అంగీకరిస్తున్నామనీ ప్రజలు కూడా వై.ఎస్‌నూ, జగన్‌నూ వేర్వేరుగా చూడటం లేదనీ ఆయన అన్నారు. జగన్‌లో ప్రజలు వై.ఎస్‌ను చూసుకుంటున్నారనీ ఆయనైతేనే వై.ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు అవుతాయనే నమ్మకంతో వారున్నారనీ అంబటి అన్నారు. మంత్రివర్గంలో జరిగిన నిర్ణయాలకు తాము బాధ్యత వహిస్తామనీ తెరవెనుక జరిగిన వాటితో తమకు సంబంధం లేదనీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చాలా అతితెలివిగా మాట్లాడుతున్నారనీ ఆయన ముందుగా ప్రభుత్వం నుంచి జారీ అయిన 26 జీవోలు చట్టబద్ధమో కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. జీవోలు సక్రమమైనవే అయితే ఇక తెరవెనుక జరిగేది ఏముంటుందని ఆయన సూటిగా ప్రశ్నించారు.
Share this article :

0 comments: