ధ్యాసంతా జగన్‌పైనేనా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ధ్యాసంతా జగన్‌పైనేనా!

ధ్యాసంతా జగన్‌పైనేనా!

Written By news on Saturday, April 28, 2012 | 4/28/2012

ప్రభుత్వం పడకే సిందని గవర్నర్ 
నివేదిక ఇచ్చినా పట్టించుకోరేం?
ప్రతిపక్ష నేతగా సర్కారుకు నిలదీయరేం?
ఈ అరాచకపు పాలనలో మీకూ భాగస్వామ్యం ఉందా?
అందుకే ప్రభుత్వంపై విమర్శలు చేయడంలేదా?


హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా పడకేసిందని సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్ కేంద్రానికి నివేదిక ఇచ్చినా ప్రతిపక్ష నాయకుడు ఎన్.చంద్రబాబు నాయుడు మాత్రం అదేమీ పట్టనట్లు జగ న్‌మోహన్‌రెడ్డిపైన నిందలేస్తూ తిరుగుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఆమె శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికొదిలేశారని తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి ఇంతకాలంగా చెబుతూ వచ్చిన విషయాన్నే గవర్నర్ కేంద్రానికీ, కాంగ్రెస్ అధిష్టాన వర్గంలోని పెద్దలకూ ఇచ్చిన నివేదికలో కూడా పేర్కొన్నారని చెప్పారు. 

పరిపాలన పడకేయడంతో రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు... ఇలా ఒక్కరేమిటి అందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. రైతులు పండించిన మిరప, ప్రత్తి పంటలకు గిట్టుబాటు ధరలు లేక, నిల్వ చేసుకునే సౌకర్యం లేక అలమటిస్తున్నారనీ... మార్కెట్లో దళారులు మిర్చి ధర ఉదయం 3,000 రూపాయలుంటే మధ్యాహ్నానికి 1,800 రూపాయలకు తగ్గించేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవీ విరమణ సమయం సమీపిస్తున్న ఉద్యోగులు తమ ప్రమోషన్ తాలూకు ఫైళ్లపై సంతకాలు కాలేదని ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఇంటర్‌బోర్డు గందరగోళ విధానాల వల్ల ఫిజిక్స్ పరీక్షలో లక్ష మంది ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఫెయిల్ అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 6,000 ఫైళ్లు సంతకాలకు నోచుకోకుండా ఉన్నాయంటే రాష్ట్రంలో పరిస్థితి పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణసంకటం అన్న విధంగా ఉందని వాసిరెడ్డి వ్యాఖ్యానించారు. 

బాబూ... నిద్రపోతున్నారా? 

రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉంటే ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నిద్రపోతున్నారా? అని వాసిరెడ్డి పద్మ నిలదీశారు. రాష్ట్రానికి ఆరు లక్షల కోట్ల రూపాయలతో పరిశ్రమలు, లక్షలాది ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొంతకాలం కిందట చెప్పారనీ ఇప్పటివరకూ వాటి ఆనవాళ్లు కూడా లేవనీ చెప్పారు. ఆ పరిశ్రమలెక్కడ? ఆ ఉద్యోగాలెక్కడ? అని ప్రభుత్వాన్ని చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదు? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని పట్టుకుని అడగాల్సిన ప్రతిపక్ష నేత... మరో ప్రతిపక్ష పార్టీ నాయకుడైన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంటే ఈ అరాచకపు పాలనలో చంద్రబాబుకు కూడా భాగస్వామ్యం ఉందనుకోవాలా? అందుకే ప్రభుత్వాన్ని విమర్శించడం లేదనుకోవాలా? అని వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. 
Share this article :

0 comments: