రేణుకకు నిర్మలాకుమారి సవాల్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేణుకకు నిర్మలాకుమారి సవాల్

రేణుకకు నిర్మలాకుమారి సవాల్

Written By news on Wednesday, April 25, 2012 | 4/25/2012


రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, ఆమె కుటుంబ సభ్యులు ఢిల్లీలో చేస్తున్నదేమిటో, వారి బాగోతం ఏమిటో ప్రజలకు బహిరంగంగా చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి డిమాండ్ చేశారు. రేణుక ఏ విధంగా రాజ్యసభ సీటు సంపాదించుకున్నారో, ఆమె కుటుంబ సభ్యులు ఏం చేశారో అనే విషయం ఢిల్లీలో జర్నలిస్టులకూ సామాన్య ప్రజలకందరికీ తెలుసని ఆమె విమర్శించారు. జగన్ ను జైల్లో పెడతారని రేణుక చేసిన వ్యాఖ్యలపై నిర్మల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అరెస్టు చేస్తామని సోనియా ఏమైనా రేణుకకు చెప్పారా? లేక కాంగ్రెస్ పార్టీలో రూపొందించిన పథకం ప్రకారమే సీబీఐ వ్యవహరిస్తోందా?’’ అని ఆమె ప్రశ్నించారు. రేణుకకు దమ్ముంటే నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి సోనియా బొమ్మపై పోటీ చేసి గెలవాలని.. లేదా 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని సవాల్ విసిరారు. ‘‘వైఎస్‌ను దళిత వ్యతిరేకి అని విమర్శిస్తున్న జె.డి.శీలం, హర్షకుమార్ వంటి నాయకులు ఆయన జీవించి ఉన్నపుడు నిద్రపోయారా?’’ అని ఆమె నిలదీశారు. వీరు విమర్శలు మానుకోక పోతే అందరి జాతకాలను బజారులో పెడతామని నిర్మల హెచ్చరించారు.
Share this article :

0 comments: