ఈజీ మనీ కోసం యువకులు జగన్ సభలకు వస్తున్నారనడం రాష్ట్ర ప్రజలను అవమానించడమే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈజీ మనీ కోసం యువకులు జగన్ సభలకు వస్తున్నారనడం రాష్ట్ర ప్రజలను అవమానించడమే

ఈజీ మనీ కోసం యువకులు జగన్ సభలకు వస్తున్నారనడం రాష్ట్ర ప్రజలను అవమానించడమే

Written By news on Thursday, April 26, 2012 | 4/26/2012

ఈజీ మనీ కోసం యువకులు జగన్ సభలకు వస్తున్నారనడం 
రాష్ట్ర ప్రజలను అవమానించడమే
బిర్యానీ ప్యాకెట్లు, మద్యం బాటిళ్లు పంచేది టీడీపీ వారే
కోవూరులో ఓటుకు రూ. 500 పంచడానికి డబ్బెక్కడిది బాబూ?
రెండెకరాలనుంచి వేలాది కోట్లు ఎలా సంపాదించారు?
ఊరూరా హెరిటేజ్ స్థాపించడానికి సొమ్ములెక్కడివి?
మామనే వెన్నుపోటు పొడిచి మరణానికి కారకుడైన నీచుడివి
బావమరిది ఆస్పత్రిలో ఉన్నా పట్టించుకోని ఘనుడివి
హైదరాబాద్, న్యూస్‌లైన్: అధికారం కోసం అలమటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడుతున్న తీరు గమనిస్తే ఆయన మానసిక ప్రవర్తనపై అనుమానాలు కలుగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. 2004 తర్వాత ఏ ఎన్నికల్లోనూ టీడీపీని ప్రజలు ఆదరించకపోయేసరికి తీవ్ర నిరాశా నిస్పృహలకులోనై మతి చలించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

రాజకీయ పార్టీలనే కాకుండా ఏకంగా రాష్ట్ర ప్రజలపైనే ఆక్రోశం వెళ్లగక్కుతున్నారంటే చంద్రబాబు మానసిక ప్రవర్తన గురించి ఇంతకన్నా ఏమనుకోవాలని ప్రశ్నించారు. ఈజీ మనీ కోసం యువకులు జగన్ సభలకు వస్తున్నారని చంద్రబాబు అంటున్నారంటే ఆయన స్థాయి ఎంతకు దిగజారిందో అర్థమవుతోందని విమర్శించారు. మద్యం కోసం, బిర్యానీ ప్యాకెట్ల కోసం జగన్ సభలకు జనం వస్తున్నారని మాట్లాడటం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని దుయ్యబట్టారు. 

చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడిన తీరుపై ఆమె బుధవారం ఒక ప్రకటనలో తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే వంద ఎలుకలు ఆరగించిన పిల్లి పుణ్యం కోసం కాశీయాత్రకు వెళ్లినట్లుగా ఉందని విమర్శించారు. తన హయాంలో రాష్ట్రంలో మద్యం బెల్ట్ షాపులను ప్రారంభించి, ఊరూరా మద్యాన్ని పారించిన చంద్రబాబు ఇతరులను విమర్శించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ‘సభలకు అద్దె మనుషులను తెచ్చుకునే చరిత్ర, ఘనత మీదే! మీ పార్టీలో ఎవరినడిగినా ఆ విషయం చెబుతారు. మీ సభల్లోనే తెలుగు తమ్ముళ్లు బిర్యానీ ప్యాకెట్లు, మద్యం బాటిళ్లు భారీగా పందేరం చేసిన దృశ్యాలు టీవీల్లోనూ, పత్రికల్లోనూ వచ్చిన విషయాలు మరిచారా?’ అని ప్రశ్నించారు. 

తాను తిరిగి అధికారంలోకి వస్తే సరసమైన ధరలకు మద్యం అందుబాటులోకి తెస్తానని ప్రకటించినా తన సభలకు జనం రావడం లేదన్న అక్కసుతోనే చంద్రబాబు ఇలాంటి చవకబారు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలుపన్నది అన్నింటికీ సమాధానం కాదని చంద్రబాబు అంటున్నారంటే... జనం ఈ ఎన్నికల్లోనూ తనకు గట్టిగా బుద్ధి చెప్తారని అర్థమయ్యే ప్రజలపై దుమ్మెత్తిపోస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో పోటీచేయడం ప్రజాతీర్పు కోరడానికేనన్న ఇంగితజ్ఞానం లేకుండా తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు మానసిక వైద్యులను సంప్రదిస్తే మంచిదని సలహా ఇచ్చారు. 

నీ ఆస్తులెక్కడివి బాబూ...?
ఒంటి నిండా అవినీతి బురదను పులుముకున్న చంద్రబాబు ఇతరుల నడవడిక గురించి వ్యాఖ్యానించడం వింతగా ఉందని పద్మ ఎద్దేవా చేశారు. ‘మిమ్మల్ని నిరంతరం భుజానికెత్తుకుని మోసే ఎల్లో మీడియానే కోవూరు (నెల్లూరు) ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఓటుకు వెయ్యి, మీరు ఓటుకు 500 రూపాయలు పంచారని రాశాయి. అదే ఎల్లోమీడియా జగన్ డబ్బులు పంచలేదని కూడా రాశాయి. అసలు ఓటుకు 500 ఇవ్వడానికి మీకు అంత డబ్బెక్కడిది? ఎంత అవినీతి చేస్తే ఇంత డబ్బు సంపాదించారు?’ అని ఆమె ప్రశ్నించారు. 

‘అసలు నీ స్థాయి ఏమిటి? రెండెకరాల భూమి నుంచి వేలాది కోట్ల రూపాయలకు ఎలా పడగలెత్తారు? దేశమంతా ఊరూరా హెరిటేజ్ షాపులు తెరవడానికి డబ్బులెక్కడి నుంచి వచ్చాయి? మీరెప్పుడైనా సమాధానం చెప్పారా? ఎమ్మార్ వ్యవహారంలో సంస్థ యజమానులకు ఎకరా నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే భూమిని రూ. 29 లక్షలకే ఎలా కట్టబెట్టారు? అది కూడా అత్యంత ధనికులు ఆడుకోవడానికి గోల్ఫ్ కోర్టు కోసం ఎందుకు కేటాయించారు? ఈ కోణంలో సీబీఐ మీ మీద ఎందుకు విచారించదు? మీరు కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయినందుకే కదా... సీబీఐ మీ వ్యవహారం బాహాటంగా తెలిసినా పట్టించుకోనిది?’ అని ఆమె ప్రశ్నాస్త్రాలు సంధించారు. 

వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే నైతికత ఉందా?
మంగలి కృష్ణతో జగన్‌కు సంబంధం ఉందని చెబుతూ దివంగత నేత వైఎస్ వ్యక్తిత్వంపైనా, జగన్ వ్యక్తిత్వంపైనా బురద జల్లే సాహసం చేస్తున్న చంద్రబాబుకు అసలు వారి గురించి మాట్లాడే నైతికత ఉందా? అని పద్మ ప్రశ్నించారు. ‘వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన తండ్రి వై.ఎస్.రాజారెడ్డిని చంపిన వారికి ఎలాంటి హాని జరక్కుండా, వారితో రాజకీయంగా మాత్రమే పోరాటం చేసిన వ్యక్తి వైఎస్. తాను ఐదేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా ఉన్నా వారిపై ఈగ వాలకుండా చూసిన నేతను మీరు విమర్శించడమా!’ అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైఎస్ తండ్రిని చంపిన వారికి మీరు ఆశ్రయం ఇచ్చి ఇంకా ఎదుటి వారిని ఫ్యాక్షనిస్టులని ఏ నోటితో విమర్శిస్తారని ఆమె నిలదీశారు.

పిల్ల నిచ్చిన సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి... ఆయన పీఠాన్ని లాక్కుని... ఆయనను మానసిక క్షోభకు గురిచేసి... ఆయన మరణానికి కారకుడవైన మీరా వైఎస్, ఆయన కుటుంబీకుల వ్యక్తిత్వం గురించి మాట్లాడేది? అని ఆమె నిలదీశారు. దివంగత ఎన్టీఆర్ మీ గురించి ఏం మాట్లాడారో మరిచారా? నీ అంతటి నీచుడు, నికృష్టుడు రాజకీయాల్లో మరెవరూ లేదని చెప్పలేదా? అని ఆమె గుర్తు చేశారు. సొంత బావమరిది బాలకృష్ణ ఆస్పత్రిలో ఉంటే పరామర్శించడానికే మీన మేషాలు లెక్కించిన మీకు మానవ సంబంధాల గురించి ఏం తెలుసు? కేసులో ఉన్న నందమూరి బాలకృష్ణ నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఉంటే మీ ఇతర బంధువులందరూ వెళ్లి పరామర్శించినా టీడీపీ పొలిట్‌బ్యూరోలో చర్చకు పెట్టినట్లు డ్రామాలాడి మూడు రోజుల తరువాత గానీ ఆయన్ను చూడటానికి వెళ్లిన మాట నిజంకాదా? అని కూడా ఆమె ప్రశ్నించారు.
Share this article :

0 comments: