తాతా.. వేటెలా సాగుతోంది.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తాతా.. వేటెలా సాగుతోంది..

తాతా.. వేటెలా సాగుతోంది..

Written By news on Thursday, April 26, 2012 | 4/26/2012

 ‘‘తాతా.. వేట ఎలా సాగుతోంది.. చేపలు పడుతున్నాయా.. ఆదాయం ఎంత వస్తుంది’’ అంటూ ఒక మత్స్యకారుడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆప్యాయంగా పలకరిం చారు. జననేత పలకరింపుతో ఆ మత్స్యకారుడు పులకించిపోయాడు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన వద్దకు వచ్చి పలకరించడంతో ఆ మత్స్యకారుడు ఎంతో సంబరపడ్డాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నరసాపురం మండలం మత్స్యకార గ్రామమైన వేములదీవి తూర్పులో రోడ్‌షో నిర్వహించారు. ఆ గ్రామంలో ఓ డ్రెయిన్‌లో వలవేసి చేపలు పడుతున్న ఒడుగు నాగేశ్వరరావును జగన్‌మోహన్‌రెడ్డి పలకరించారు. ఆయన తన వాహనం నిలిపి ఆ వృద్ధ మత్స్యకారుడి వద్దకు వెళ్లి అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ‘‘చేపల్ని ఎలా పడతారు..వల ఎలా వేయాలి’’ అంటూ ఆరా తీశారు. 

ఆ వృద్ధుడి చేతిలో నుంచి వల తీసుకుని, ఆయనే డ్రెయిన్‌లోకి విసిరారు. ఆ వలలో రెండు చిన్న చిన్న చేపలు పడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలోని మత్స్యకారులు, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎంతో సంబరపడ్డారు. మత్స్యకారులు తమ సమస్యలను జగన్‌మోహన్‌రెడ్డికి వెళ్లబోసుకున్నారు. స్వర్ణయు గం రానుందని, అందరి కష్టాలు తీరనున్నాయని వారికి జననేత ధైర్యం చెప్పారు. మత్స్యకారుల అభ్యున్నతికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మ త్స్యకార కుటుంబానికి చెందిన పిల్లలు ఆ డ్రెయిన్‌లో అటువైపు ఒడ్డున దిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలు చేతపట్టుకుని జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మత్స్యకారుల పిల్లలను జగన్‌మోహన్‌రెడ్డి ఆప్యాయంగా పలకరించి బాగా చదువుతున్నారా? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌వెంట మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మత్స్యకార నాయకులు ఉన్నారు.
Share this article :

0 comments: