ఆర్తజన బాంధవుడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆర్తజన బాంధవుడు

ఆర్తజన బాంధవుడు

Written By news on Saturday, April 21, 2012 | 4/21/2012

వరదతో ఉప్పొంగే నది సాగర ఘోషతో గొంతు కలుపుతుంది. దారిపొడవునా ఎదురవుతున్న అవరోధాలు తొలగే తెరువేదని పరితపిస్తూ ప్రశ్నిస్తుంది. వేదనతో వెల్లువయ్యే ప్రతి ఒక్కరి మదీ ఆపద్బాంధవుడితో మమేకమవుతోంది. బతుకు అడుగడుగునా అడ్డు తగులుతున్న బాధల గాథలను ఆర్తితో వినిపిస్తోంది. తల్లడిల్లుతున్న ప్రతి పల్లే జననేత చెంతకు తరలివచ్చి ఆవేదనతో ఆక్రోశిస్తోంది. కష్టకాలం కడతేరేదెప్పుడని అడుగుతోంది. పావలా వడ్డీల పీడనతో విసిగి వేసారి పోతున్న పేద మహిళ...

ప్రభుత కరుణించక, పింఛను కానరాక విలవిలలాడుతున్న వృద్ధుడు... కరెంటు కరువై, ఎరువు బరువై అలమటిస్తున్న అన్నదాత... కూలి గిట్టుబాటు కాక, ‘ఉపాధి’తో గట్టెక్కలేక శాపగ్రస్తుడైన శ్రామికుడు... ఉద్యోగం లేని యువకుడు... పైవారు కన్నెర్ర చేస్తే కష్టాలకు ఎదురీదుతున్న చిరుద్యోగీ... వారూ వీరన్న తేడా లేకుండా ప్రతి వ్యథార్థ హృదయం జననేత సాంత్వన కోరింది. ఆయన పలకరింపు కోసం, పిలుపు కోసం, ధైర్య వచనాల కోసం పల్లెల్లో ప్రతి ఒక్కరి అడుగూ వడివడిగా పడింది. తరలి వచ్చిన వారందరినీ జగన్ స్నేహపూర్వక హస్తం చెంతకు తీసుకుంది. ఆయన ఆప్త వాక్యం అనునయించింది. ఆయన దరహాసం భవితపై భరోసా ఇచ్చింది.
Share this article :

0 comments: