ఆత్మస్థైర్యాన్ని నింపిన జగన్ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆత్మస్థైర్యాన్ని నింపిన జగన్ పర్యటన

ఆత్మస్థైర్యాన్ని నింపిన జగన్ పర్యటన

Written By ysrcongress on Tuesday, April 10, 2012 | 4/10/2012

సంగారెడ్డి మున్సిపాలిటీ/అర్బన్, న్యూస్‌లైన్: పట్టణంలో ఇటీవల జరిగిన అల్లర్ల కారణంగా సర్వం కోల్పోయి రోడ్డున పడిన బాధితులను వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పరామర్శించారు. సంగారెడ్డిలోని ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బాధితులను ఆప్యాయంగా పలుకరించి వారి గోడును ఓపిగ్గా విన్నారు. ‘నేనున్నాంటూ’ ఆయన వారికి భరోసా ఇచ్చారు. పార్టీ తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జగన్ పరామర్శతో బాధితుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపినట్టయింది.

సంతృప్తి కలిగింది..
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నా కుటుంబం యోగ క్షేమాలు తెలుసుకున్నారు. అల్లర్లు ఎలా జరిగాయి?, ఎవరు చేశారు?, ఏ సమయానికి ఘటన జరిగింది? అంటూ పూర్తి వివరాలు ఓపికగా తెలుసుకున్నారు. ప్రభుత్వంతో మాట్లాడి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ తరఫున కూడా ఆదుకుంటామన్నారు. అల్లర్లు జరిగిన తర్వాత ఎంతో మంది నాయకులు వచ్చి వెళ్లారే తప్ప జగన్‌లా ఎవరూ ఇంతలా భరోసా ఇవ్వలేదు
.- అశ్వక్ హైమద్, గ్రాండ్ హోటల్ యజమాని

అధైర్య పడవద్దన్నారు..
ముప్పై ఏళ్లుగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుని ఉంటున్నా. రూ.20 లక్షల విలువ చేసే బిల్డింగ్, రూ.25 లక్షల విలువ చేసే సామగ్రి మూడు గంటల్లో కాలి బూడిదైంది. పెండ్లీడుకొచ్చిన కూతురుంది. ప్రభుత్వం పదివేల రూపాయలు, నిత్యావసర సరుకులు ఇచ్చింది. ఇది ఏ మూలకూ సరిపోదు. జగన్ మా గోడును ఓపికగా విన్నారు. ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం అందిందా? అని ఆరా తీశారు. అధైర్య పడకండి, ప్రభుత్వంతో మాట్లాడి నష్ట పరిహారం ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు. - బి.శంకర్, రేఖ, హోల్‌సేల్ కిరాణ షాపు, నాల్సాబ్‌గడ్డ

మనోధైర్యాన్ని నింపారు..
నా దుకాణంలో జరిగిన నష్టంపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. పూర్తి వివరాలు తెలుసుకున్నారు. నాకు జరిగిన నష్టంపై విచారం వ్యక్తం చేశారు. చాలా ఆత్మీయంగా మాట్లాడారు. పరిహారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భరోసా ఇచ్చారు. దుకాణాలు దహనం చేసిన వారు బహిరంగంగా తిరుగుతున్న విషయాన్ని ఆయనకు చెప్పా. బాధ్యులను అరెస్టు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు.
- సయ్యద్ జఫార్, ఎస్‌ఏ ఎలక్ట్రికల్ షాపు యజమాని

సాయం చేస్తానన్నారు
నా దుకాణం దహనం కావడం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను జగన్‌మోహన్‌రెడ్డి తెలుసుకున్నారు. నా కుటుంబం గురించి ఆరా తీశారు. 35 నిమిషాల పాటు నా దుకాణంలోనే ఉన్నారు. ఆర్థిక సాయం సంగతి పక్కన పెడితే శాంతియుతంగా ఉండాలని పదే పదే చెప్పారు. సాధ్యమైనంత వరకు ఆదుకునే ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చారు. నిజమైన నాయకుడంటే ఇలా ఉండాలనిపించింది.
- నిజామొద్దీన్, డీసెంట్ స్వీట్ హౌస్
Share this article :

0 comments: