‘చెల్లెమ్మా.. అండగా ఉంటా’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘చెల్లెమ్మా.. అండగా ఉంటా’

‘చెల్లెమ్మా.. అండగా ఉంటా’

Written By news on Wednesday, April 25, 2012 | 4/25/2012

పోలవరం నియోజకవర్గ పరిధిలోని జీలుగుమిల్లి మండలంలో రౌతుగూడెం కాలువ నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రోడ్ షో ప్రారంభిం చారు. ఈ సందర్భంగా 150 మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించిన స్థాని కులు జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగ తం పలికారు. జగన్‌మోహన్‌రెడ్డి మండలంలో అడుగు పెట్టగానే ‘జై జగన్.. జై వైఎస్‌ఆర్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. 

ఆయనను చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డితో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. ఈ సందర్భంలో అటుగా వస్తున్న ఉపాధి హామీ పథకం కూలీలు తాలూరి సుబ్బలక్ష్మి, యాడం జ్యోతి ఆయనను కలిశారు. ‘ఏం చెల్లెమ్మా! ఏ పనులకు వెళ్లి వస్తున్నారు’ అని జగన్‌మోహన్‌రెడ్డి వారిని పలకరించగా.. ఉపాధి హామీ పనులకు వెళ్లామని ఆ మహిళలు చెప్పారు. ‘కూలి ఎంత గిట్టుబాటు అవుతోంది’ అని జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నిం చగా... ‘రాజశేఖరరెడ్డి గారు ఉన్నప్పుడు మాకు అధిక కూలి వచ్చేది. ప్రస్తుతం 50 నుంచి 60 రూపాయల కంటే ఎక్కువ రావటం లేదు’ అని చెప్పారు. 

‘కూలి డబ్బులు సమయానికి అందుతున్నాయా తల్లీ’ అని అడగ్గా.. ‘లేదన్నా.. రెండు మూడు వారాలు పడుతోంది. అదీ అదృష్టం ఉంటేనే చేతికి డబ్బులు అందుతాయి’ అని ఆ మహిళలు చెప్పుకొచ్చారు. వారి పరిస్థితి విని చలించిన జగన్‌మోహన్‌రెడ్డి ‘త్వరలోనే మంచి రోజులు వస్తాయి. మేం అధికారంలోకి రాగానే రైతు కూలీలకు అండగా నిలబడతాం’ అని భరోసా ఇచ్చారు. అనంతరం రౌతుగూడెంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు.
Share this article :

0 comments: