‘తొలి సంతకం పింఛను పథకం ఫైలు పైనే’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘తొలి సంతకం పింఛను పథకం ఫైలు పైనే’

‘తొలి సంతకం పింఛను పథకం ఫైలు పైనే’

Written By news on Wednesday, April 25, 2012 | 4/25/2012

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మండలంలోని దుద్దుకూరు నుంచి నాలుగో రోజు రోడ్ షో ప్రారంభించారు. ఇప్పలపాడులో మడివి బొజ్జిదొర అనే వికలాంగుడిని పలకరించారు. అతనికి వికలాంగ పింఛను వస్తోందా లేదా అని ఆరా తీశారు. పింఛన్ వస్తోం దని, అయితే ఉపాధి కోసం బ్యాంకు ద్వారా రుణ సౌకర్యం కల్పించాలని బొజ్జిదొర కోరారు. వీరన్న పాలెం కార్మల్ ప్రార్థనా మందిరంలో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న మహిళలు జగన్‌మోహన్‌రెడ్డితో కరచాలనం చేశారు. రామారావుపేట సెంటర్‌లో వనముల లక్ష్మి, గౌరమ్మ అనే వృద్ధులను పలకరించి వృద్ధాప్య పింఛను వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

పింఛన్లు సక్రమంగా రావడం లేదని వృద్ధులు చెప్పగా... ‘ఈ సిగ్గులేని ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడుగుతున్నా ఫలి తం ఉండటం లేదు. ఈ నాయకులంతా సమస్యలను పక్కన పెడుతున్నారు. మన ప్రభుత్వం వస్తే మొదటి సంతకం వృద్ధాప్య పింఛన్ల ఫైలుపైనే చేస్తాను. నెలకు రూ.700 ఇచ్చేలా ఏర్పాటు చేస్తాను’ అని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. కర్రెడ్లగూడెం గ్రామానికి చెందిన మోహిని అనే మహిళ తన బాబుకు జగన్‌మోహన్‌రెడ్డితో ‘వైఎస్సార్’ అని నామకరణం చేయించింది. ములగలంపల్లి , దిబ్బగూడెం, పాములవారిగూడెం, స్వర్ణవారిగూడెం, మంగిశెట్టిగూడెం, టి.గంగన్నగూడెం, జొన్నవారిగూడెం, తాడువాయి, లక్ష్మీపురం, దర్భగూడెం, రమణక్కపేట, జీలుగుమిల్లి, బర్రింకలపాడు, పి.అంకంపాలెం మీదుగా కామయ్యపాలెం వరకు జగన్‌మోహన్‌రెడ్డి రోడ్ షో సాగింది. 
Share this article :

0 comments: