రంగా, మల్లెల బాబ్జీ, మాధవరెడ్డి, సూరి హత్యల వెనుక బాబు హస్తముందంటారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రంగా, మల్లెల బాబ్జీ, మాధవరెడ్డి, సూరి హత్యల వెనుక బాబు హస్తముందంటారు

రంగా, మల్లెల బాబ్జీ, మాధవరెడ్డి, సూరి హత్యల వెనుక బాబు హస్తముందంటారు

Written By news on Friday, April 27, 2012 | 4/27/2012


మతిలేకుండా మాట్లాడుతున్నారుఎక్కడేం జరిగినా జగన్‌కే ఆపాదిస్తారా?
రంగా, మల్లెల బాబ్జీ, మాధవరెడ్డి, సూరి హత్యల వెనుక బాబు హస్తముందంటారు
రంగా భార్య, సూరి భార్య ప్రత్యక్ష ఆరోపణలు కూడా చేశారు
ఈ ఆరోపణలపై చంద్రబాబు విచారణకు సిద్ధపడ్డారా?
జగన్‌ను మీడియా ఏమీ అనడం లేదని ఆక్రోశమెందుకు?
మందు, బిర్యానీ పొట్లాలకోసం వస్తున్నారని ప్రజలను అవమానిస్తారా?
ప్రజలంటే మీకెంత చులకనభావమో దీంతో వెల్లడైంది
వీహెచ్, రేణు, వీరశివలవి పిచ్చి మాటలు
ఈనాడు పేరును 420గా మారిస్తే బావుంటుంది
టీఆర్‌ఎస్‌కూ, వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధాలు లేవు
పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు
ఉప ఎన్నికల ముందే చేతులెత్తేసిన కాంగ్రెస్

హైదరాబాద్, న్యూస్‌లైన్:
విశ్వాసఘాతుకానికి విశ్వరూపం... అవినీతి అక్రమాలకు నిలువుటద్దం... కుట్రలూ కుతంత్రాలకు నిలువెత్తు రూపం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో గెలవలేమన్న నిరాశా నిస్పృహలతో చంద్రబాబు, ఆయన వందిమాగధులు పనిగట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని, కాంగ్రెస్ పార్టీలో కూడా కొందరు నాయకులు అదే పాట పాడుతున్నారని దుయ్యబట్టారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... జగన్‌కు సూరి హత్యతో సంబంధం ఉందని చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు చెప్పడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు చేసే అలవాటు చంద్రబాబుదేనని మండిపడ్డారు. ‘‘తీవ్ర నిరాశా నిస్పృహలతో చంద్రబాబుకు మతి భ్రమించి జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. సూరిని హత్య చేసిన భానుకు మంగలి కృష్ణకు సంబంధాలున్నాయనీ... కృష్ణ జగన్‌కు సన్నిహితుడనీ... అందువల్ల ఈ హత్యలో జగన్ ఎ-వన్ (ప్రధాన నిందితుడు) అని బాబు వంకర టింకర లింకులు కలుపుతున్నాడు... ఏం మాటలివి? అసలు మతి ఉండే మాట్లాడుతున్నారా...? ఒకే ఊరి వాడైనందువల్ల సంబంధాలుండవచ్చు. అంత మాత్రాన కృష్ణ కేసులన్నింటితో జగన్‌కు సంబంధం ఉంటుందా? ’’ అని అంబటి నిలదీశారు. జగన్‌కు బదులుగా ఎ-వన్‌కు ఓటేయండని రామోజీరావు ఈనాడులో కార్టూను వేయించడంపై మండిపడ్డారు. ‘‘మరి రామోజీరావుపై 420 కేసులు నమోదై ఉన్నాయి కదా... ఆయన కూడా తన పత్రిక ‘ఈనాడు’ పేరు స్థానంలో ‘420’ అని వేసుకుంటే బావుం టుంది కదా! ఆరోపణలన్నీ నిజాలైనట్లే వార్తలు రాయడం సబబు కాదు. మంగలి కృష్ణకు జగన్‌తో సంబంధాలున్నాయంటూ భూతద్దంలో చూపుతూ వార్తలు రాయడం.. వాటిని పట్టుకుని టీడీపీ యాగీ చేయడం అలవాటైపోయింది. అసలు వైఎస్ మృతి చెందిన నాటినుంచి టీడీపీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో జగన్‌ను ఆడిపోసుకోని సందర్భమే లేదంటే... ఆ పార్టీ ఎంతగా భయపడుతుందో అర్థమవుతోంది’’ అని అంబటి ధ్వజమెత్తారు.

బిర్యానీ పొట్లాలకూ మద్యం బాటిళ్లకూ ఆశపడి జగన్ సభలకు తండోపతండాలుగా జనం వస్తున్నారనీ, యువకులు ఈజీమనీ (తేలిగ్గా డబ్బు సంపాదించుకోవడం) కోసం జగన్ చుట్టూ చేరారనీ బాబు చెప్పడం ప్రజలను అవమానించడమేనని దుయ్యబట్టారు. బాబుకు ప్రజలంటే ఉన్న చులకనభావం దీంతో వెల్లడైందనీ... అందుకే తాము తొలి నుంచీ ఆయన మనసులో ఉండేది ఒకటి బయటకు చెప్పేది మరొకటి అని చెబుతూ వచ్చామని గుర్తుచేశారు. జగన్ సభలకు జనం భారీగా వస్తున్నారనే వాస్తవాన్ని... యువకులంతా జగన్ వెంటే ఉన్నారన్న నిజాన్ని బాబు అంగీకరించడం సంతోషంగా ఉందని చెప్పారు.

మీపై వచ్చిన ఆరోపణలకు విచారణకు సిద్ధపడ్డారా?

చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు మతిభ్రమించి ఏమేమో మాట్లాడుతున్నారని అంబటి నిప్పులు చెరిగారు. ‘‘సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగి ఒక వ్యక్తి మరణించిన కేసులో స్వయంగా బాలకృష్ణ నిందితుడుగా ఉన్నారు. బాలకృష్ణ బాబుకు బావమరిది కనుక చంద్రబాబే ఈ కేసులో మొదటి ముద్దాయి అవుతారా? గాలి ముద్దుకృష్ణమనాయుడు వియ్యంకుడు (పుత్రుడికి పిల్లనిచ్చిన మామ) కట్టా సుబ్రమణ్యం నాయుడు భూకబ్జాలకు సంబంధించిన కేసులో 200 రోజులు జైల్లో ఉన్నారు. వియ్యంకుడితో సంబంధాలున్నందుకు ఈ కేసులో ముద్దు కృష్ణమ ప్రథమ ముద్దాయి అవుతారా?’’ అని ప్రశ్నించారు.

జగన్‌ను మీడియా ఏమీ అనడం లేదు, ఇతర రాజకీయ పార్టీల నాయకులు కూడా విమర్శించడం లేదని చంద్రబాబు ఆక్రోశం వెళ్లగక్కడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. చంద్రబాబులా వం కర టింకరగా లింకులు కలపడానికి వారికేం పనని ప్రశ్నిం చారు. ‘‘విజయవాడలో జరిగిన వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. మల్లెల బాబ్జీని చంపించింది కూడా బాబేనని అప్పట్లో ప్రచారం జరిగింది. ఎన్టీఆర్‌కు కార్యదర్శిగా వ్యవహరించిన రాఘవేంద్రరావు రోడ్డు ప్రమాదంలో మరణించిన సంఘటన వెనుక కూడా ఆయన హస్తమే ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతెందుకు హోంమంత్రిగా ఉండిన ఎలిమినేటి మాధవరెడ్డిని చంపించింది కూడా బాబేనన్న విమర్శలు వచ్చాయి. వాటిలో నిజం ఉందా లేదా అనేది తరువాత సంగతి, ఎపుడైనా ఈ ఆరోపణలపై చంద్రబాబు విచారణకు సిద్ధపడ్డారా?’’ అని అంబటి సూటిగా ప్రశ్నించారు. తాజాగా సూరి భార్య భానుమతి తన భర్త హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారని, గతంలో రంగా భార్య కూడా ఇదే విధమైన ఆరోపణలు చేశారని, మరి ఆయనపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విచారణ జరుపదని నిలదీశారు.

వారివి మతిభ్రమించిన మాటలు

బాబు మతిభ్రమించి మాట్లాడుతుంటే కాంగ్రెస్‌లో వి.హనుమంతరావు, రేణుకా చౌదరి, వీరశివారెడ్డి వంటి పిచ్చి ముదిరిన నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ చిందులేస్తున్నారని అంబటి దుయ్యబట్టారు. ఉప ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందనడానికి గవర్నర్ నరసింహన్ కేంద్రానికి పంపిన నివేదికే నిదర్శనమని చెప్పారు. ఉప ఎన్నికల అనంతరం రాష్ట్ర కాంగ్రెస్‌లో సంక్షోభం తప్పదని, ఫలితంగా రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం రావచ్చని గవర్నర్ నివేదికలో పేర్కొన్నట్లు కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయని తెలిపారు. జగన్‌కు ఓటేస్తే రాష్ట్ర విభజన జరుగుతుందని కొందరు కాంగ్రెస్ నాయకులు దురుద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారం అర్థం లేనిదన్నారు. టీఆర్‌ఎస్‌కూ, వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధాలు లేవని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమ పార్టీకి మరెవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరమే లేదని ఆయన తేల్చి చెప్పారు.

Share this article :

0 comments: