వర్ల రామయ్యపై మండిపడ్డ బాబుమోహన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వర్ల రామయ్యపై మండిపడ్డ బాబుమోహన్

వర్ల రామయ్యపై మండిపడ్డ బాబుమోహన్

Written By news on Monday, April 9, 2012 | 4/09/2012

తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యకు కళ్లు నెత్తికె క్కినట్లున్నాయని టీడీపీ నేత,ప్రముఖ సినీనటుడు బాబుమోహన్ మండిపడ్డారు. పాలుతాగే చిన్నపిల్లాడు సైతం గుర్తుపట్టే బాబుమోహన్ తెలియద ంటున్న రామయ్య భవిష్యత్తులో తన తల్లిదండ్రులు కూడా తెలియదంటాడేమో అని వ్యాఖ్యానించారు. సోమవారం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో బాబుమోహన్ మాట్లాడారు.

‘ఒకనాడు బాబుమోహన్‌ను చూసేందుకు ఇదే వర్ల రామయ్య రోడ్డుపై నిలుచున్నాడు. కానీ ఇపుడు నేనెవరో తెలియదంటున్నాడు. చంద్రబాబు పక్కన కూచుంటున్నాడు కదా. క ళ్లు నెత్తికెక్కి అహంకారం వస్తే అలానే ఉంటది. నాపై ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. బాబుమోహన్ తెలియదంటున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లో ఉండేందుకే అనర్హుడు’ అని వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: