పులివెందులలో కరెంటు ధర్నాలో సర్కారుపై విజయమ్మ మండిపాటు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పులివెందులలో కరెంటు ధర్నాలో సర్కారుపై విజయమ్మ మండిపాటు

పులివెందులలో కరెంటు ధర్నాలో సర్కారుపై విజయమ్మ మండిపాటు

Written By ysrcongress on Wednesday, April 4, 2012 | 4/04/2012

పులివెందుల నుంచి న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘‘రైతుల కష్టాలు, ఆత్మహత్యలు చూడలేక మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తాను అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పా రు. ఇచ్చిన మాట ప్రకారం ఉచిత కరెంటు ఇచ్చారు. దాదాపు రూ.1,200 కోట్ల బకాయిలు రద్దు చేశారు. రైతులకు మరింత మేలు చేయాలనే సంకల్పంతో 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పారు. వైఎస్ మరణానంతరం ఆయన ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. పైగా మోటార్లకు మీటర్లు అమర్చి ఉచిత విద్యుత్‌ను ఎత్తేసేందుకు కుట్ర పన్నుతోంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. కరెంటు చార్జీల పెంపును నిరసిస్తూ పులివెందుల ఎస్‌పీడీసీఎల్ డివిజినల్ ఇంజినీర్ కార్యాలయం ముందు విజయమ్మ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. సర్కారు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఈ సందర్భంగా విజయమ్మ తూర్పారబట్టారు. వైఎస్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా కరెంటు చార్జీలు పెంచలేదని, రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా ఉచిత విద్యుత్‌ను అమలు చేశారన్నారు. వైఎస్ రెక్కల కష్టంతో గద్దెనెక్కిన నేటి పాలకులు రైతుల మోటార్లకు మీటర్లు అమర్చి బిల్లులు వసూలుచేసేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. ఈ ధర్నాలో వైఎస్సార్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: