యువజనం నోట జై జగనన్న అన్న మాటే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » యువజనం నోట జై జగనన్న అన్న మాటే

యువజనం నోట జై జగనన్న అన్న మాటే

Written By news on Saturday, April 21, 2012 | 4/21/2012

 జగనన్నను కలిశామన్న ఆనందం కొందరిది. తమ్ముడి ఆత్మీయ పిలుపు విన్నామన్న సంతోషం మరి కొందరిది. మా రాజు కొడుకు కష్టపడుతున్నాడన్న ఆవేదన ఓ కన్నతల్లిది. ఇల్లు.. సంసారం వదులుకుని వచ్చాడు మా నాయన అంటూ ఓ అవ్వ ఓదార్పు. తండ్రిలాగే ఆయన మాట తప్పడు.. మడమ తిప్పడు అంటూ ఓ పండు ముసలి నిండు దీవెన. యువజనం నోట జై జగనన్న అన్న మాటే తప్ప మరో ధ్యాస లేదు. నేల ఈనిందా.. అన్న రీతిలో రోడ్లపై జనాలు బారులుతీరి ‘ఉప’ బరిలో నిలిచే ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించారు. ఇదీ పాయకరావుపేట ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి రెండో రోజైన శుక్రవారం పాయకరావుపేట మండలంలో లభించిన అపూర్వ ఆదరణ. 

పల్లె గుండె తట్టారు : పాల్తేరులో మొదలైన ఉప ఎన్నికల ప్రచారం అంకంపేట, కందిపూడి, రాజగోపాలపురం, కుమారపురం, రాజానగరం, వెంకటనగరం, రాజవరం, కేశవరం, శ్రీరాంపురం మీదుగా ఎస్.నరసాపురం వరకు కొనసాగింది. అడుగడుగునా జనం జగన్‌కు నీరాజనాలందించారు. నక్కపల్లిలో బయలుదేరిన జగన్ తుని మీదుగా పాల్తేరు చేరుకున్నారు. తుని నుంచి కవలపాడు వరకు రోడ్లు సమీప గ్రామాల మహిళలతో నిండిపోయింది. చాలా చోట్ల మహిళలు మగాళ్లను నెట్టుకుంటూ.. జన నేతను చూసేందుకు ఎగబడ్డారు. బాణాసంచా, డప్పుల మేళాలు, తప్పెటగుళ్లు, పగటి వేషాలతో ప్రజలు ఆయన్ని ఆదరంగా స్వాగతించారు. నింగికెగిసే తారాజువ్వలు.. అంతే స్థాయిలో కురిపించిన పల్లె ప్రజల అభిమానం జగనన్న మనసు దోచుకునేందుకు పోటీ పడ్డాయి. 

బాబూరావన్నకే మా ఓటు : గొల్ల బాబూరావును జగన్ పిలిచేది బాబూరావన్నా అని. అదే మాదిరిగా జనం సైతం బాబూరావన్నకే మా ఓటంటూ ఎలుగెత్తి చాటారు. పేదల కోసం పదవుల్ని తృణప్రాయంగా వదిలిన వారిని మళ్లీ అసెంబ్లీకి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు. మత్స్యకార పల్లె అయిన రాజానగరం వీధుల్ని దాటేంత వరకు ఊరుఊరంతా ఆయన్ని అనుసరించింది. మహిళలు, వికలాంగులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

పీసీపీఐఆర్‌తో తరలింపు ప్రమాదంలో ఉన్నామంటూ వాపోయారు. ఇప్పటికే తుపానుకు నష్టపోతున్న తాము, అధికారుల బెదిరింపులకు దినదినగండంలా బతుకు వెళ్లదీస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లకు పట్టాల్లేక, ఏళ్ల తరబడి ఉంటున్న ఇళ్లపై కనీస హక్కులేక నిత్యం ఆందోళనలోనే ఉన్నామన్నారు. దీనిపై జన నేత సువర్ణ పాలనతో శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్న హామీతో జేజేలు కొట్టారు. పొరుగునే ఉన్న వెంకటనగరం వరకు జగన్ వెంట పరుగు తీశారు. రాజన్నే మళ్లీ వచ్చాడా? : దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డే తమ కళ్ల ముందుకొచ్చినట్టు మహిళలు ఆనందపరవశులయ్యారు. ఎక్కడ మహిళలు ఉన్నా.. అక్కా.. చెల్లెమ్మా.. అమ్మా.. అవ్వా.. అంటూ ఆయన ఆత్మీయ పిలుపులకు పులకరించిపోయారు. 

మళ్లీ రాజన్న పాలన జగనన్నతోనే సాధ్యమవుతుందన్న నమ్మకాన్ని గుండెనిండా నింపేసుకున్నారు. ఆనాడు రాజన్న మాట మేరకే బాబూరావును గెలిపించుకున్నామని, ఇపుడు ఆ రాజన్న కొడుకు జగనన్న పిలుపుతో భారీ మెజార్టీ కట్టబెడతామని హామీ ఇచ్చారు. తాను ప్రసంగించిన ప్రతి చోటా నిజాయితీకి నిలబడి పదవిని త్యాగం చేసిన బాబూరావన్నకు చల్లని మనసుతో, సంపూర్ణ మద్దతు తెలపాలన్న జగన్ విన్నపానికి జనాలు జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో జగన్ వెంట పార్టీ రాష్ట్ర వ్యవహారాల కో-ఆర్డినేటర్ కొణతాల రామకష్ణ, కేంద్ర పాలకమండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ, పార్టీ అభ్యర్థి గొల్ల బాబూరావు, పార్టీ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జిలు తిప్పల నాగిరెడ్డి, బొడ్డేడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: