ఆంధ్రజ్యోతి ఎండీ రాధకృష్ణపై చీటింగ్ కేసు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆంధ్రజ్యోతి ఎండీ రాధకృష్ణపై చీటింగ్ కేసు

ఆంధ్రజ్యోతి ఎండీ రాధకృష్ణపై చీటింగ్ కేసు

Written By news on Friday, April 20, 2012 | 4/20/2012

ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ, మరో ఇద్దరిపై 420 చీటింగ్, నమ్మకద్రోహం 406 ఇండియన్ పీనల్ కోడ్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ సైబరాబాద్ 11వ మెట్రోపాలిటన్ కోర్టు సరూర్‌నగర్ పోలీసులను ఆదేశించింది. గతంలో కొంతకాలం సేల్స్ ఆఫీసర్‌గా ఆ పత్రిక అడ్వర్టైజింగ్ విభాగంలో రామచందర్ అనే ఉద్యోగి పనిచేశాడు. ఉద్యోగ సమయంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని పద్దులను యాజమాన్యానికి అప్పగించాడు.

అయితే ఉద్యోగంలో చేరేముందు రామచందర్ నుంచి సెక్యూరిటీ చెక్కులను, ప్రభుత్వ ఉద్యోగి పూచీకత్తు తీసుకున్నారు. అన్నీ సవ్యంగా చెల్లించి ఉద్యోగం మానేసి వెళ్లినా తనను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ రామచందర్ ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై సైబరాబాద్ మేజిస్ట్రేట్‌లో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారించిన న్యాయమూర్తి ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, ప్రచురణల విభాగాధిపతి రామకృష్ణ, రవిలపై నమ్మకద్రోహం, చీటింగ్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీచేశారు.
Share this article :

0 comments: