‘ఇంటి నిర్మాణానికి రూ.లక్ష ఇస్తా’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘ఇంటి నిర్మాణానికి రూ.లక్ష ఇస్తా’

‘ఇంటి నిర్మాణానికి రూ.లక్ష ఇస్తా’

Written By news on Thursday, April 26, 2012 | 4/26/2012

 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి ఇస్తున్న రుణాన్ని రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెంచుతామని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన బుధవారం 29వ వార్డులోని అరుంధతీయ పేటలో దళితులను పలకరించారు. ఈ సందర్భంగా కొప్పాడ విజయలక్ష్మి, అంతర్వేదిపాలెపు దుర్గ ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో దళిత మహిళలు జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. 

‘ఈ వార్డులోనే ఎంతోకాలం నుంచి ఉంటున్నామయ్యా.. మాకు ఇంతవరకు ఇళ్లు కేటాయించలేదు. ఇంటి స్థలం కూడా ఇవ్వటం లేదు. మీరే మాకు స్థలాలిచ్చి.. ఇళ్లు కట్టించి ఆదుకోవాలి బాబూ’ అంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇందిరమ్మ పథకంలో ఇస్తున్న రుణాలు కూడా ఏమాత్రం సరిపోవడంలేదని చెప్పారు. వారి సమస్యలను సుమారు 10 నిమిషాలపాటు ఓపికగా విన్న జగన్‌మోహన్‌రెడ్డి ‘ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నందున ఇళ్లపట్టాలు ఇవ్వలేను. దయచేసి అర్థం చేసుకోండి. అధికారంలోకి రాగానే మీ అందరికీ స్థలాలివ్వటంతోపాటు ఇంటి నిర్మాణానికి లక్ష రూపాయల చొప్పున రుణాలు కూడా ఇప్పిస్తాం’ అని పేర్కొన్నారు. దీనికి మహిళలు స్పందిస్తూ... ‘ఎన్నికల్లో మీ పార్టీకే ఓటేస్తాం. మిమ్మల్ని గెలిపిస్తాం’ అని స్పష్టంగా చెప్పారు. వారి మాటలను ఆలకించిన జగన్‌మోహన్‌రెడ్డి ‘తల్లీ ఇప్పుడు జరుగుతున్నవి ఉప ఎన్నికలు. 2014లో మన పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు పేదల ఇంటి నిర్మాణానికి ఇచ్చే రుణాన్ని రూ.లక్షకు పెంచుతాం’ అని చిరునవ్వుతో సమాధానమిచ్చారు. ‘ముందుగా జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి’ అని విజ్ఞప్తి చేశారు. 

పులకించిన దళితులు
పట్టణంలోని 29వ వార్డు అరుంధతీయ పేట ప్రాంతంలో పూర్తిగా దళితులే నివశిస్తున్నారు. ఈ ప్రాంతంలో పర్యటించడానికి స్థానిక నేతలే వెనుకడుగు వేస్తూ ఉంటారు. ఇక్కడి ప్రజలు స్థానిక సమస్యలపై ఏ విధంగా నిలదీస్తారో.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలోనని నాయకులు ఆలోచిస్తుంటారు. అలాంటిది ఈ పేటలో జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించడమే కాకుండా అక్కడివారిని ఒక్కొక్కరినీ దగ్గరకు తీసుకుని మాట్లాడడం, వారి సమస్యలను ఓపికగా వినడంతో ఈ ప్రాంతవాసుల ఆనందానికి అవధుల్లేవు. తమ కష్టాలను వినడానికి ఇప్పటి వరకూ ఏ ఒక్క పెద్ద నాయకుడు తమ పేటలోకి వచ్చిన దాఖలాలు లేవంటూ సంతోషం వ్యక్తం చేశారు. 

Share this article :

0 comments: