ప్రకాశం జిల్లా వైఎస్‌ఆర్ సీపీ యువజన దళం ఏర్పాటు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రకాశం జిల్లా వైఎస్‌ఆర్ సీపీ యువజన దళం ఏర్పాటు

ప్రకాశం జిల్లా వైఎస్‌ఆర్ సీపీ యువజన దళం ఏర్పాటు

Written By news on Wednesday, April 18, 2012 | 4/18/2012

= 23 మండలాలకు అధ్యక్షుల నియామకం
= ఈ నెల 25లోపు అన్ని మండ లాలకూ ఎంపిక
= నెలాఖరులోపు బూత్, మండల కమిటీల ఏర్పాటు
= వచ్చే నెల 15లోపు జిల్లా కార్యవర్గం ఎంపిక
= ఉప ఎన్నికలో సత్తా చాటాలని రమణారెడ్డి పిలుపు

ఒంగోలు కార్పొరేషన్, న్యూస్‌లైన్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో భాగంగా యువజన విభాగం మండల కమిటీలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర పార్టీ ఆమోదం మేరకు మొదటి విడతగా 23 మండలాల అధ్యక్షులను యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కేవీ రమణారెడ్డి ప్రకటించారు. ఆ పార్టీ స్థానిక కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు. మిగిలిన మండలాలకు అధ్యక్షుల నియామకం ఈ నెల 25లోపు పూర్తవుతుందన్నారు. 30లోపు మండల అధ్యక్షులు అన్ని గ్రామాల్లో బూత్ కమిటీలు, మండల కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కమిటీల్లో 10మంది చొప్పున సభ్యులుగా ఉండాలన్నారు. వచ్చే నెల 15లోపు జిల్లా కార్యవర్గం కూడా ఏర్పాటు కానున్నట్లు చెప్పారు.

ప్రతి మండలం నుంచి ఒకరు కార్యవర్గంలో ఉండే విధంగా ప్రణాళిక తయారు చేస్తున్నామన్నారు. వచ్చే నెల 15లోపే బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. రానున్న ఉప ఎన్నికలో యువకులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వారి వారి మండలాల్లో యువజన విభాగం పటిష్టం చేయడంతోపాటు పార్టీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఆయా మండలాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిప్రాయాల సూచనలు, సలహాల మేరకు సుశిక్షితులైన వారినే అధ్యక్షులుగా ఎంపిక చేశామన్నారు.

పార్టీ విజయవాడ సిటీ ఇన్‌చార్జి వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి 1999కు ముందురోజులు పునరావృతం అయ్యే కాలం దగ్గర పడిందని హెచ్చరించారు. ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్‌బాబు మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి క్రిష్టియానిటీకి చెందిన వ్యక్తని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. క్రిష్టియన్ మతం అంటే అంటరాని మతం అని, వారికి పాలించే అర్హత లేదన్నట్లు కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం క్రైస్తవులను అవమానించడమేనని విమర్శించారు. నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ యువజన కమిటీల్లో సమర్థమైన వారికి అవకాశం కల్పించిడం పార్టీ బలోపేతానికి ఎంతో దోహదపడుతుందన్నారు. సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, నాయకులు నూతలపాటి తిరుమలరావు పాల్గొన్నారు.

23 మండలాల యువజన అధ్యక్షుల
వివరాలు:
పేరు మండలం
సంతనూతలపాడు బీ మధుసూదన్‌రావు
జరుగుమల్లి స్వర్ణ రవీంద్రబాబు
వెలిగండ్ల వై నారాయణరెడ్డి
కనిగిరి టౌన్ ఏ వెంకటరెడ్డి
పీసీ పల్లి పువ్వాడ మల్లికార్జున చౌదరి
హనుమంతునిపాడు ఎస్వీ కృష్ణారెడ్డి
కొండపి వాకా శ్రీకాంత్‌రెడ్డి
లింగసముద్రం పాటిబండ్ల శ్రీకాంత్
వలేటివారిపాలెం కాకుమాని కుమార్ యాదవ్
గుడ్లూరు కోకా శ్రీనివాసరావు
కందుకూరు కూనం రామకృష్ణారెడ్డి

కందుకూరు టౌన్ షేక్ రఫీ
ఉలవపాడు ఎస్‌డీ ఫజుల్
పెద్దారవీడు షేక్ బుజ్జి
పొదిలి జీ శ్రీనివాసరెడ్డి
పొదిలి టౌన్ షేక్ జిలాని
యర్రగొండపాలెం టౌన్ వీ రామిరెడ్డి

పుల్లలచెరువు కే యల్లయ్య యాదవ్
త్రిపురాంతకం ఏ. కృష్ణారెడ్డి
దోర్నాల శ్రీనివాసయాదవ్
యర్రగొండపాలెం కే చిన్నా
టంగుటూరు ఎం కృష్ణారెడ్డి
చీమకుర్తి మేకల రాజశేఖర్
Share this article :

0 comments: