సంక్షేమ పథకాల్ని తుంగలో తొక్కారు: జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » సంక్షేమ పథకాల్ని తుంగలో తొక్కారు: జగన్

సంక్షేమ పథకాల్ని తుంగలో తొక్కారు: జగన్

Written By news on Thursday, April 19, 2012 | 4/19/2012


రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఒకటేనని అనిపిస్తోందనివైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని రాజయ్యపేటలో మాట్లాడుతూ.. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి రాష్ట్రంలో ఉందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో పేదవారు, రైతులు ఒక పక్క, కుళ్లు కుతంత్రాలు మరో పక్క ఉన్నాయని జగన్ తెలిపారు. రైతుల కోసం బాబురావు పదవీ త్యాగం చేశారని ఈ సందర్భంగా జగన్ అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి అమలు చేసిన సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని జగన్ అన్నారు. పేదవాడికి వైద్యం అందించే 108 వాహనాలన్ని రిపేర్ షెడ్లలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు మరణిస్తే ఐదు లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియాను అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. మత్స్యకారుల గ్రామాలలో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. పిల్లలను స్కూల్‌కు పంపితే తల్లితండ్రుల అకౌంట్లలో 1000 రూపాయల్ని జమ చేస్తామన్నారు. 


Share this article :

0 comments: