ప్రజలకే..కృష్ణ‘దాసుడు’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలకే..కృష్ణ‘దాసుడు’

ప్రజలకే..కృష్ణ‘దాసుడు’

Written By news on Wednesday, April 18, 2012 | 4/18/2012

ఎమ్మెల్యేల్లో రెండు రకాలు 
ప్రజా సమస్యలు పట్టని వారొకరైతే... సమస్యలపై స్పందించే వారు మరొకరు 
రెండో కోవకు చెందిన వ్యక్తి కృష్ణదాస్ 
పదవీ త్యాగం చేసిన దాసన్నను గెలిపించుకోవాలి 
ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి

శ్రీకాకుళం, న్యూస్‌లైన్ : ‘ఎమ్మెల్యేల్లో రెండు రకాలు ఉన్నారు. ప్రజా సమస్యలు పట్టని వారొకరైతే... ప్రజా సమస్యలపై స్పందించే వారు మరొకరు’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రెండో కోవకు చెందిన వ్యక్తి ధర్మాన కృష్ణదాస్ అని స్పష్టం చేశారు. నరసన్నపేట ఉప ఎన్నికల మూడో రోజు ప్రచారంలో భాగంగా మంగళవారం నరసన్నపేట, జలుమూరు మండలాల్లో రోడ్‌షో నిర్వహించా రు. ఈ సందర్భంగా కంబకాయ, శ్రీముఖలింగం, జలుమూరు, చల్లవానిపేటలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘గెలిచిన తర్వాత ప్రజలేమైపోయినా పర్వాలేదు. ఐదేళ్ల పదవీ కాలం ఉన్నందున అంతవరకు ప్రజలు పని లేదని ఆలోచించే ఎమ్మెల్యేలు ఒకరని, తమను గెలిపిం చిన ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అయ్యో అని ప్రభుత్వంపై పోరాడిన ఎమ్మెల్యేలు మరొకరన్నారు. రైతులను పట్టించుకోని కారణంగా అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన ధర్మాన కృష్ణదాస్ లాంటి ఎమ్మెల్యేలంతా రెండో కేటగిరీ కిందకు వస్తారని పేర్కొన్నారు. పదవీ త్యాగం చేయాలంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారని, నిరుపేద రైతుల కోసం వదులుకోవాలంటే మరింత ఆలోచిస్తారన్నారు.

మరో ఐదేళ్ల వరకు ప్రజల పని లేదన్న దృష్టితో పదవి త్యాగం చేయడానికి పెద్ద ఇష్టపడరన్నారు.అయితే నిరుపేదలకు తోడుగా, రైతులకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో రైతు వ్యతిరేక ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో తమ మద్దతు ఎమ్మెల్యేలంతా తీర్మానానికి అనుకూలంగా ఓటేసి చెడిపోయిన రాజకీయాలకు విలువలు తీసుకొచ్చారన్నారు. ఈ రకంగా ప్రజల కోసం, నిజాయితీ రాజకీయాల కోసం పదవిని కోల్పోయిన కృష్ణదాస్‌కు చల్లని దీవెనలు, ఆశీస్సులు అందించాలని పిలుపునిచ్చారు. నరసన్నపేట ఉప ఎన్నిక అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, సంక్షేమ పథకాలను కాంగ్రెస్ సహకారంతోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అందించారని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అదే నిజమైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆ సంక్షేమ పథకాలన్నీ ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించారు. నాయకుడు సమర్ధుడైతేనే ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. వైఎస్‌ఆర్ కూడా సమర్థ నేత కావడంతో ఎప్పుడూలేని విధంగా సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయన్నారు. వైఎస్‌ఆర్ ఆశయ లక్ష్యంగా పనిచేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డికి శ్రీముఖలింగేశ్వరుని ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఉంటాయన్నారు. రాష్ట్రానికి దశ, దిశ నిర్థేశించే నాయకుడు వైఎస్‌ఆర్ తనయుడేనన్నారు. 
Share this article :

0 comments: