వైఎస్‌ను దళిత వ్యతిరేకి అనడం దారుణం: జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ను దళిత వ్యతిరేకి అనడం దారుణం: జగన్

వైఎస్‌ను దళిత వ్యతిరేకి అనడం దారుణం: జగన్

Written By news on Wednesday, April 25, 2012 | 4/25/2012

పశ్చిమ గోదావరి: మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు రెండుసార్లు అధికారం దక్కిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేంద్ర, రాష్ర్టల్లో అధికారం తీసుకు వచ్చన వైఎస్‌ను రైతు, దళిత, పేదల వ్యతిరేకి అని అనడం దారుణమని ఆయన అన్నారు. ప్రతిపక్ష టీడీపీతో కాంగ్రెస్ కుమ్మక్కై వైఎస్‌పై ఆరోపణలు చేస్తోందని వైఎస్ జగన్ ఆరోపించారు. వైఎస్‌ఆర్ సువర్ణయుగంలో పొగాకుకు 1200 రూపాయల, వరికి 1000 రూపాయల మద్దతు ధర లభించిందని జగన్ తెలిపారు. రైతులకు 1,800 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు రద్దు... గిరిజనులకు 14.75 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసిన ఘతన YSRదేనని, రైతులు, రైతు కూలీలు బాగుండాలన్నదే వైఎస్ ఆశయమని ఆయన అన్నారు. టీడీపీ-కాంగ్రెస్లు కుమ్మక్కై ఆర్టీఐ కమిషనర్‌ల పదవులు పంచుకున్నారని జగన్ విమర్శించారు. ఎమ్మార్ విషయంలో బాబును సీబీఐ ఎందుకు విచారించడంలేదని జగన్ ప్రశ్నించారు.
Share this article :

0 comments: