వై‘ఎస్’ అన్నా ‘నో’ అన్నా ఓటమే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వై‘ఎస్’ అన్నా ‘నో’ అన్నా ఓటమే!

వై‘ఎస్’ అన్నా ‘నో’ అన్నా ఓటమే!

Written By news on Friday, April 13, 2012 | 4/13/2012

తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వాణ్ణి పరమ దుర్మార్గునిగా భావిస్తారు జనం . వైఎస్ విషయంలో నేడు కాంగ్రెస్ నాయకులు చేస్తున్నది ఇదే. 2004లోనూ, 2009 లోనూ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గద్దె మీద కూర్చోపెట్టిన ఘనత వైఎస్‌కే దక్కుతుంది. తన చరిత్రాత్మక పాదయాత్రతో 2004లోనూ, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుతో 2009లోనూ వైఎస్ కాంగ్రెస్‌ను విజయపథాన నడిపించాడు. వైఎస్ రెక్కల కష్టంతోనే పదేళ్లు కాంగ్రెస్ అవిచ్ఛిన్నంగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారం చెలాయించింది. 

ఇద్దరు ముగ్గురు తప్ప రాష్ట్ర మంత్రులం దరూ వైఎస్ మంత్రివర్గంలోని వారే. జగన్‌ను ఎదుర్కోవా లంటే వైఎస్‌ను టార్గెట్ చేసి దూషించాలట! దీని మీద తర్జన భర్జనలు? జిల్లాలో దమ్మిడీకి చెల్లని వారు కూడా వైఎస్‌ను విమర్శించేవారే! వీహెచ్ లాంటి వృత్తి వ్యతి రేకుల సంగతి చెప్పాల్సిన పనిలేదు. పోనీ వైఎస్ మరణా నంతరం వైఎస్ పట్ల మర్యాదగా నడుచుకున్నారా? వైఎస్ వ్యతిరేక ప్రచారానికి పచ్చజెండా ఊపింది సోనియా కాదా! సోనియాకు తెలియకుండా డాక్టర్ శంకర్రావు వైఎస్ మీద హైకోర్టులో పిల్ వేశాడా? ఆమెకు తెలియకుండానే సీబీఐ విచారణ జరుగుతుందా? వైఎస్ మరణవార్త విని ప్రాణాలు వదిలారంటే అదంతా అవాస్తవం అన్నారు. వీహెచ్ మాటే వేదవాక్కన్నారు. తర్వాత ఏఐసీసీ విచా రించగా అవి నిజమే అన్నారు. 

బాధితులకు ఆర్థిక సహా యం చేస్తామన్నారు. ఏళ్లు గడుస్తున్నా వారిని ఓదార్చింది లేదు. ఇదంతా సోనియా నిర్వాకం! ఆమె రాజకీయ పరపతి ఆవిరైపోయిందని యూపీ, పంజాబ్ ఎన్నికలు తిరుగులేని విధంగా నిరూపించాయి. ఆమె ఇందిరాగాంధీ కోడలైతే కావచ్చు గానీ, ఆమె భావాలకు వారసురాలు మాత్రం కాదు. 2014లో ఇంకా ఎక్కువ సంఖ్యలో ఏపీ నుంచి పార్లమెంటు సభ్యులను గెలిపించి రాహుల్‌ను ప్రధానిని చేయాలని వైఎస్ కలలుగన్నాడు. అది నిష్కల్మ షమైన ఆలోచన. కానీ, కృతఘ్నతకు కొత్త నిర్వచనం సోనియా చెప్పారు. 

ఆమెది చారిత్రక కృతఘ్నత. ఈ ద్రోహాన్ని సహించలేక కాంగ్రెస్‌లో తిరుగుబాటు చెలరేగు తోంది. కొంత మంది మంత్రులే దీనిని వ్యతిరేకించారు. మాజీ కేంద్ర మంత్రి సాయిప్రతాప్ తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను గానీ వైఎస్‌ను దూషించలేనన్నారు. ఆ మాటకు వస్తే కాంగ్రెస్‌నే విమర్శిస్తాను గానీ వైఎస్‌ను కాదని వైఎస్ తమ్ముడు వివేకానందరెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ ఇటీవల వైఎస్ పాలనను మరో మారు మెచ్చుకున్నారు. నిన్నటిదాకా వైఎస్ మహానేత అన్నవారు ఈ రోజు అవినీతిపరుడయ్యాడని అంటే జనం ఉమ్మేస్తారు. అలా అయితే వైఎస్ పేరుతో స్మృతివనాలు, స్తూపాలెందుకు? పోస్టల్ స్టాంపులెందుకు? ఆయన పేరుతో వైఎస్‌ఆర్ జిల్లా ఎందుకు? ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్న సామెత వీరికి చక్కగా వర్తిస్తుంది. వీరికి ఓట్లు కాదు వచ్చేది చేతికి చిప్ప!

తప్పని నిర్ణయం
సాగదీసి, సాగదీసి విధిలేక స్పీకర్ ఆ 17 మంది శాసన సభ్యుల రాజీనామాలను ఆమోదించక తప్పలేదు. రాజీ నామా చేసే హక్కు రాజ్యాంగ బద్ధమైనప్పుడు, వాటిని ఆమోదించే బాధ్యత స్పీకర్‌కు లేకపోవడం ఎంత విడ్డూ రం? ఆమోదించిన పిదప ఆ స్థానాలు ఖాళీ అయినట్లు నోటిఫై చేయడానికి ఎంత ఆలస్యం! పాలక పక్షం చేతిలో రాజ్యాంగం ఒక చిత్తుకాగితంగా మారిపోవడం లజ్జాకర మైన పరిణామం. రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనే హక్కు ఈ స్థానాల నుంచి కొత్తగా ఎన్నికయ్యే వారికి ఉండాలన్న సుసంప్రదాయాన్ని గౌరవించాలని ఎన్నికల కమిషన్ చెం దుతున్న ఆవేదన నెరవేరకూడదన్నది పాలకపక్షం దుర్బు ద్ధిగా కనపడింది. ఇటువంటి గూడుపుఠానీలో కాంగ్రెస్ పెద్దలు ఆరితేరిన వారని లోకానికి తెలిసిందే. ఏమైనా పాలకపక్షం కనుసన్నలలో మెలగకుండా, స్వతంత్రంగా ఆలోచించి రాష్ట్రపతి ఎన్నికలలోగానే ఈ 18 స్థానాలకు ఉప ఎన్నికలు జరపబోతున్నట్లు ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించడం శుభపరిణామం. అందుకు ఆయనను అభినందించక తప్పదు, ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉం దని చాటి చెప్పినందుకు.

ఎన్నికల కమిషన్ నిస్సహాయత...
ఉప ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నా, ఎన్నికల అవినీతిని అరికట్టడంలో అది తన నిస్సహాయతను అంగీకరించక తప్పలేదు. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో పాలకపక్షం అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పటికీ, రిగ్గింగ్ వీరు ల పన్నాగాలను అరికట్టడంలో ఎన్నికల యంత్రాంగం నిష్పాక్షికంగా వ్యవహరించి ప్రజల మన్ననలు పొందింది. కోవూరు ఉప ఎన్నికలో ఎన్నికల కమిషన్ తన పరిధికి లోబడి చేయగలిగింది చేసినప్పటికీ డబ్బు, సారా పంప కాన్ని అరికట్టలేకపోవడాన్ని అంగీకరించింది. అభ్యర్థులు బినామీ పద్ధతిలో ఈ ప్రక్రియను సాగించినందువల్ల అరికట్టలేకపోయామని కమిషన్ బాహాటంగానే అంగీకరించింది.

శాసనసభకైతే రూ.16 లక్షలు, పార్లమెంటుకైతే రూ.40 లక్షలకు మించి అభ్యర్థి ఖర్చుచేస్తే ఆ ఎన్నిక చెల్లనే రదని నిబంధన ఉన్నప్పటికీ ఆ పరిమితికి మించి పదిరెట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ, ఎన్నికల ఖర్చు చూపించే రిటర్న్స్ బోగస్ అని తెలిసినప్పటికీ ఎన్నికల కమిషన్ గుడ్లప్పగించి చూడటంతప్ప చేసేది ఏమీలేదు. అవినీతిని గురించి గొంతు చించుకునే చంద్రబాబు నాయుడు కోవూరులో తమ అభ్యర్థి రూ.16 లక్షల పరిమితికి లోబడి ఖర్చు చేశాడని గుండెమీద చేయివేసుకుని చెప్పగలడా? ప్రధాన పార్టీలన్నీ ఈ సమస్య మీద దొంగకు తేలుకుట్టినట్లు నోరు విప్పడం లేదు. జీవితవ్యయ పరిమాణం ఇబ్బడిముబ్బ డిగా పెరిగినట్లుగానే ప్రజాస్వామ్యం కూడా సామాన్యు నికి అందని సరుకుగా తయారైంది.

సిగ్గుచేటైన ‘ఆపరేషన్ థర్టీ డేస్’
18 నియోజకవర్గాల్లోనూ, నెల్లూరు పార్లమెంటరీ నియో జకవర్గంలోనూ నోటిఫికేషన్ వెలువడక ముందే కోట్ల కొద్దీ ప్రభుత్వ ధనాన్ని కుమ్మరించి కార్యకర్తలను, ఓటర్లను ప్రలోభపెట్టడానికి ముఖ్యమంత్రి, బొత్స కలిసి రూపొం దించిన పథకానికి ‘ఆపరేషన్ థర్టీ డేస్’ అన్న ముచ్చటైన పేరుపెట్టారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను ఎదుర్కొనే ధైర్యం లేక విముఖత ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను ప్రోత్స హిస్తున్న విధానం ఇది. నోటిఫికేషన్ అన్నది సాంకేతిక పరమైన హద్దుగా చెప్పారు గానీ, ఆ స్థానాల్లో ఎన్నికలు ఖాయమైనప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేసి విచ్చ లవిడిగా ఓటర్లను ప్రలోభపెట్టే ఈ పథక రచన ఎలా చట్ట సమ్మతమవుతుంది? ఈ పథకాన్ని సుప్రీంకోర్టుకెళ్లి సవా ల్ చేస్తే అధికార పక్షం దుర్నీతి ప్రపంచానికి తెలిసి పోతుంది.

ఇది విశ్వాస పరీక్షే!
కాంగ్రెస్ అంతర్గతంగానూ, బయట తీవ్రమైన సంక్షో భాన్ని ఎదుర్కొంటోంది. అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయంటే ప్రజలు నమ్మలేదు. చెవులు మెలివేసి కూర్చోపెట్టారు. కడప, పులివెందుల, కోవూ రులో అది నిరూపితమైంది. కాంగ్రెస్, చంద్రబాబు బల మైన అభ్యర్థులను నిలబెట్టి కోట్లు ఖర్చు పెట్టారు. 2014 కీలకమైంది కాబట్టి, తమ పార్టీ వారి స్థైర్యం నిలబెట్టడాని కైనా సీట్లు గెలవకపోయినా ఓట్ల శాతమైనా చూపించుకో వాలి. 

ఈ 18 ఉప ఎన్నికలు మినీ జనరల్ ఎన్నికలతో సమానం. కాంగ్రెస్ టోకుగా ఓడిపోతే, ఓట్ల శాతం అధ్వా నంగా ఉంటే మధ్యంతర ఎన్నికలను తప్పించుకోలేదు. అందువల్లనే వారు శతవిధాలా కొన్ని సీట్లయినా సంపా దించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు తెలివిపరులు. అది కాంగ్రెస్ వారి డబ్బు కాదు, అది ప్రజల డబ్బు, జరిగిన ఉప ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టారు. ఓటుకు 5 వందల నుంచి 2 వేల రూపాయల దాకా ఇచ్చారు. అయినా ఓటమి తప్పలేదు. కాంగ్రెస్, టీడీపీలు ప్రజలను నమ్ముకోవటం లేదు. వారు సీబీఐని నమ్ముకుంటున్నారు. 

జగన్‌ను జైల్లో పెట్టించి తాను సీఎం కావాలని చంద్రబాబు కలలు కంటు న్నాడు. అయితే సామాన్య ప్రజలు జగన్‌ను సీఎంగా చూడాలని, మళ్లీ వైఎస్ పాలన రావాలని కోరుకుంటు న్నారు కాబట్టే జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. ఎనిమిది మాసాలైనా సీబీఐ జగన్ మీద నేరారోపణ నిరూ పించలేకపోయింది. వైఎస్ భూములను కేటాయింపు చేసింది కేబినెట్ ఆమోదంతోనే. నిబంధనలు పాటించే చేశాడు. నిబంధనలు ఉల్లంఘించకుండా చేసిన కేటాయిం పులు చట్టసమ్మతమే. జగన్ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు కూడా చట్టసమ్మతమే అయినప్పుడు అందులో తప్పే మిటి? కాంగ్రెస్ పెద్దల కనుసన్నల్లో సీబీఐ వ్యవహరి స్తున్నా, న్యాయస్థానాలున్నాయి గదా! అన్నిటికంటే పెద్ద న్యాయస్థానం ప్రజాన్యాయస్థానమే. రానున్న ఉప ఎన్ని కల్లో ప్రజలిచ్చే రాజకీయ తీర్పు ఢిల్లీ పెద్దలకు, రాష్ట్ర నేత లకు దిమ్మ తిరిగేదిగా ఉంటుంది. కాంగ్రెస్, టీడీపీల ఆరా టమంతా గౌరవమైన ఓటమి కోసమే. ఘోరమైన ఓటమి నుంచి బయటపడటానికే! 
Share this article :

0 comments: