వైఎస్సార్ సీపీలోకి రాధా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీలోకి రాధా

వైఎస్సార్ సీపీలోకి రాధా

Written By news on Friday, April 20, 2012 | 4/20/2012


విజయవాడ, న్యూస్‌లైన్ : మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. 27వ తేదీన రాఘవయ్యపార్కు వద్ద ఉన్న వంగవీటి రంగా విగ్రహం సాక్షిగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు ఆప్తుల హర్షధ్వానాల మధ్య రాధా ప్రకటించారు. గత నెలలో గుంటూరులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలసివచ్చిన తరువాత త్వరలోనే పార్టీలో చేరతానని రాధా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

పెదనాన్న రాధా చనిపోయిన తర్వాత ఏర్పాటయిన రాధా మిత్రమండలి, తండ్రి రంగా మరణానంతరం ఏర్పాటయిన రాధా-రంగా మిత్రమండలి నాయకులతో రాధాకృష్ణ సమాలోచనలు జరిపారు. అందరూ ముక్తకంఠంతో రాధా నిర్ణయాన్ని సమర్థించారు. గతంలో రాధాకృష్ణ వర్గంలో ఉన్న పలువురు మాజీ కార్పొరేటర్లు కూడా రాధా బాటనే అనుసరించాలని నిర్ణయించారు. 

రాధా వైఎస్సార్ సీపీలో చేరాలని నిర్ణయించడంతో కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు కూడా ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించారు. 27వతేదీన విజయవాడ వచ్చేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించడంతో ఆ రోజు రాధా పార్టీలో చేరాలని నిర్ణయించారు. దీనికోసం సన్నాహాలు ప్రారంభమ య్యాయి. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఉన్న రంగా అభిమానులందరితో రాధా అనుచరులు సమాలోచనలు సాగిస్తున్నారు. వీరందరూ రాధాతోపాటే జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరనున్నారు. విజయవాడలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాధాతోపాటు పలువురు మాజీ కార్పొరేటర్లు, రాధా-రంగా మిత్రమండలి నాయకులు పాల్గొన్నారు. 

27వ తేదీ గన్నవరం విమానాశ్రయం నుంచి బందర్‌రోడ్డు రాఘవయ్య పార్కు వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తామని, సాయంత్రం విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో పార్టీలో చేరతామని రాధా చెప్పారు. రంగా, వైఎస్ అభిమానులు పలువురు పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నారని, తర్వాత కూడా చాలామంది చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. రంగా అభిమానులందరినీ ఒకే తాటిపైకి తీసుకువస్తానన్నారు. నగరంలో అందరినీ కలుపుకొని పనిచేస్తానని తెలిపారు. 

ఇప్పటికే నగరంలో విడిగా కార్యక్రమాలు చేస్తున్నా, కలిసికట్టుగా చేస్తున్నా.. అందరూ పార్టీ కోసమే చేస్తున్నారని, తాను పార్టీలో చేరిన తర్వాత అందరినీ కలుపుకొని పనిచేయడానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. వంగవీటి మోహనరంగా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేవారని, రాధా అందుబాటులో ఉండరని ఉన్న విమర్శలపై స్పందిస్తూ తాను ప్రజల్లోనే ఉండటానికి సమయం కేటాయిస్తానని పేర్కొన్నారు. 

రంగా స్థాయి అందుకోవడం సాధ్యం కాదని, కొడుకుగా దాన్లో పదోవంతు స్థాయికి చేరినాఆనందమేనని చెప్పారు. నగరంలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రశ్నించినపుడు ఆ విషయం జగన్ ప్రకటిస్తారన్నారు. రంగా, వైఎస్‌లను విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులు వారి ఫోటోలు లేకుండా ఎన్నికలకు వెళ్లాలని రాధా సవాలు విసిరారు.

Share this article :

0 comments: