మాబోటోళ్ల బాధలు.. మీరు ముఖ్యమంత్రి అయితేనే తీరతాయ్.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మాబోటోళ్ల బాధలు.. మీరు ముఖ్యమంత్రి అయితేనే తీరతాయ్..

మాబోటోళ్ల బాధలు.. మీరు ముఖ్యమంత్రి అయితేనే తీరతాయ్..

Written By ysrcongress on Wednesday, April 4, 2012 | 4/04/2012

ఏం చేత్తాం.. కాంగ్రెసోళ్లు కరెంటు చార్జీలు పెంచారు.. కనీసం కరెంటు ఎప్పుడు ఇత్తారో.. ఎప్పుడు తీత్తారో తెల్వడం లేదు.. మా పిల్లల చదువులకు కరెంటు లేక ఇబ్బంది పడుతున్నాం.. మాబోటోళ్ల బాధలు.. మీరు ముఖ్యమంత్రి అయితేనే తీరతాయ్.. అంటూ మహిళలు యువనేత వైఎస్ జగన్‌మోహనరెడ్డికి మొరపెట్టుకున్నారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని మంగళవారం మొగల్తూరు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిర్వహించిన ఆందోళనలో పలువురు మహిళలు గోడు వెళ్లబోసుకున్నారు. టీడీపీ, కాంగ్రెస్ తీరును ఎండగడుతూనే జగన్‌మోహనరెడ్డిపై వారికి ఉన్న నమ్మకాన్ని చెప్పారు. మొగల్తూరుకు చెందిన కవుదుల రాణి, మాసిలంక పావని, మాణిక్యం వేదిక వద్దకు వచ్చి కరెంటు కష్టాలను ఏకరువు పెట్టారు. జగన్‌మోహనరెడ్డితో వారి ముఖాముఖి ఇలా సాగింది. 

పావని: ఉదయం 6 గంటలకు కరెంట్‌పోతుం ది. సాయంత్రం 6 గంటల వరకు మళ్లీ రాదు. 
వైఎస్ జగన్: ఏమిటీ.. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరెంట్ ఉండదా? 
మహిళ: ఉండదు సార్..! అంతేకాదు అర్ధరాత్రి కూడా తీసేస్తారు. పిల్లల చదువులకు ఇబ్బం దులు పడుతున్నాం.
జగన్: మళ్లీ రాత్రి ఎంతసేపు తీస్తారు, అసలు కరెంట్ మీకు ఎంతసేపు ఉంటుంది?
పావని: ఎప్పుడు పోతుందో.. ఎప్పుడొస్తుందో తెలియదు. ఇలాగైతే ఎలా సార్..! మా గురించి మీరే పట్టించుకోవాలి.
నర్సాపురం పట్టణానికి చెందిన బీటెక్ విద్యార్థిని కప్పల ఐశ్వర్య అయితే కరెంటు సమస్యలపై జగన్‌కు వివరించారు.
ఐశ్వర్య: మాది మున్సిపాలిటీ. మాకు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 గంటల నుండి 4 గంటల వరకు కరెంటు తీసేస్తారు.
జగన్: ఏమిటీ.. టౌన్‌లో కూడా అంతసేపు పవర్‌కట్ ఉంటుందా?
ఐశ్వర్య: అంతేకాదు సార్..! అర్ధరాత్రి కూడా రెండు, మూడు గంటలు కరెంట్ ఉండదు.
జగన్: పట్టణంలో కూడా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా..? 
భీమవరానికి చెందిన ఆకుల సుబ్బలక్ష్మి సైతం కరెంట్ కష్టాలను ఏకరువుపెట్టారు.
సుబ్బలక్ష్మి: కరెంటు సరిగ్గా ఉండదు. మిని మమ్ చార్జీ మాత్రం రూ.150 వసూలు చేస్తారు.
జగన్: ఎంతమ్మా.. మినిమమ్ చార్జీ ఎంత వసూలు చేస్తున్నారు.
సుబ్బలక్ష్మి: మినిమమ్ చార్జీ రూ.150 లే సార్..! కానీ బిల్లులు మాత్రం రూ.600-800 కూడా వస్తాయి. 
జగన్: ఏమిటీ.. రూ.600, రూ.800 కూడానా..?
సుబ్బలక్ష్మి: నెలంతా కష్టపడ్డా కరెంటు బిల్లు కట్టలేని దుస్థితి నెలకొంది సారూ..
జగన్: కాంగ్రెస్, టీడీపీ పాలనలో కరెంటు వైర్లు కాదు.. బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొడుతోంది. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించేలా ఈ ధర్నాతో కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నదే చిన్న ఆశ. 
..ఇలా సాగింది. సభలో విద్యుత్తు కష్టాలపై వైఎస్ జగన్‌మోహనరెడ్డికి, మహిళలకు మధ్య చర్చ. అనంతరం సభలో మాట్లాడిన జగన్‌మోహనరెడ్డి ఈ విషయాన్నే ప్రస్తావించారు. కరెంట్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఉండదో తెలియదు గాని బిల్లులు చూస్తే మాత్రం షాక్ కొడతాయని వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: