బాబుకు భజన చేస్తున్న కిరణ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబుకు భజన చేస్తున్న కిరణ్

బాబుకు భజన చేస్తున్న కిరణ్

Written By news on Saturday, April 14, 2012 | 4/14/2012


ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రజా సమస్యలు గాలికొదిలేసి టీడీపీ అధినేత చంద్రబాబుకు భజన చేస్తూ మచ్చిక చేసుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. బాబు హయాంలో చోటు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంలోని అవకతవకలు బయటకు రాకుండా సీఎం అడ్డుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో చేసుకున్న ఒప్పందం మూలంగానే మధ్యతరగతి, చిన్న పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. కుట్ర, కుమ్మక్కు రాజకీయాల కోసం ప్రజలు ఏమైనా ఫర్వాలేదన్నట్లుగా సీఎం కిరణ్ ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘చంద్రబాబు హయాం 1997లో విద్యుత్ కొనుగోలు విషయంలో స్పెక్ట్రం పవర్ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పదం వల్ల ట్రాన్స్‌కో దాదాపు రూ.300 కోట్లు నష్టపోయింది. నిర్మాణం విషయంలో మూలధనం ఎక్కువ చేసి చూపినందువల్ల చంద్రబాబుకు, టీడీపీ నేతలకు భారీగా ముడుపులు అందినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రమోటర్ల మధ్య వచ్చిన భేదాభిప్రాయంవల్ల ఈ అవకతవకలు బయటకొచ్చాయి. 

దీనికి సంబంధించి ఒక ప్రమోటర్ ఆధారాలతో సహా కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సీబీసీఐడీ విచారణకు ఇవ్వాల్సిందిగా ట్రాన్స్‌కోకు ఆదేశించారు. బాబు హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అనేక లొసుగులున్నాయని, ట్రాన్స్‌కో అనేక ఆధారాలు సమర్పించింది. ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా బయటపడుతున్న కేసు పురోగతి సాధించకుండా సీఎం కిరణ్ మోకాలడ్డటం సిగ్గుచేటు’’ అని దుయ్యబట్టారు. ‘‘విద్యుత్ చార్జీల పెంపును సమర్థించుకుంటూ... ట్రాన్స్‌కో తీవ్ర సంక్షోభంలో ఉందంటూ సీఎం ఉపన్యాసాలిస్తున్నారు. చంద్రబాబు కారణంగా ట్రాన్స్‌కో ప్రతి నెల అదనంగా రూ. 2 కోట్లు చెల్లిస్తున్నా పట్టించుకోరు. ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేయాలనే ఆలోచన చేయకుండా... కేసును మూసేయాలని సీబీసీఐడీ సంస్థను ఆదేశించడం సిగ్గుమాలిన చర్య. ఇదంతా కాంగ్రెస్-టీడీపీల కుమ్మక్కుకు నిదర్శనం కాదా?’’ అని ఆమె నిలదీశారు. ఒకరి తప్పుల్ని ఒకరు కప్పిపుచ్చుకుంటూ చంద్రబాబు, కాంగ్రెస్ పెద్దలు కలిసి ఆడుతున్న నాటకాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్తుందని, అదే విధంగా న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తుందని పద్మ తెలిపారు.
Share this article :

0 comments: