నాడు పొట్టకొట్టి నేడు పోరాటమా ?కాకినాడ సెజ్ కోసం తమ్మవరం భూములను సేకరించిందే చంద్రబాబు ప్రభుత్వం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాడు పొట్టకొట్టి నేడు పోరాటమా ?కాకినాడ సెజ్ కోసం తమ్మవరం భూములను సేకరించిందే చంద్రబాబు ప్రభుత్వం

నాడు పొట్టకొట్టి నేడు పోరాటమా ?కాకినాడ సెజ్ కోసం తమ్మవరం భూములను సేకరించిందే చంద్రబాబు ప్రభుత్వం

Written By news on Thursday, April 19, 2012 | 4/19/2012

ఇప్పుడు అదే తమ్మవరం రైతులకు 
మద్దతుగా రేపు ధర్నా చేపట్టనున్న బాబు 

హైదరాబాద్, న్యూస్‌లైన్: తామంతా చిన్న, సన్నకారు రైతులమని, తమ భూములకు పరిహారంగా కనీసం ఎకరాకు రూ.3 లక్షలు ఇప్పించాలని కాళ్లావేళ్లా పడ్డా ఆరోజు ఆయన మనసొప్పలేదు. పరిహారం పెంపు గురించి సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ ప్రతిపాదించినా ఒక్క కలంపోటుతో దానిని వెనక్కు పంపేశారు. ఆ విధంగా రైతులకు తీరని అన్యాయం చేసిందీ... వారిని మోసం చేసిందీ ఆయనే.

నాడు అధికార దర్పంతో రైతుల పొట్టగొట్టి అధికారం చేజారిన తర్వాత గురివిందలా తాను రైతుపక్షమంటూ ఉ ద్యమానికి సిద్ధపడుతున్న వైనం చూసి పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. తాను అధికారంలో ఉండగా సేకరించిన భూ మికి అప్పట్లో పరిహారం పెంచమంటే పెంచకుండా.. 16 ఏళ్ల తర్వాత అదే సమస్యపై ఆందోళనకు సిద్ధపడుతున్న ఆయన వైఖరిని చూసి సొంత పార్టీ నేతలే విస్తుపోతున్నారు. ఏ ముఖం పెట్టుకుని రైతుల వద్దకు వెళ్లాలని మథనపడుతున్నారు. 

అధికారం కోసం ఎన్ని రంగులైనా మార్చే ఆ నేత మరెవ రో కాదు.. అధికారం అనుభవించినన్నాళ్లూ అన్నదాతను పట్టిం చుకోకుండా, వ్యవసాయం దండగంటూ.. ‘హైటెక్కు’ పాలన నడిపిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయు డు గారే..! తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని తమ్మవరంలో 1996లో జరిపిన భూసేకరణకు సంబంధించి రైతుల పక్షాన ఈనెల 20న అక్కడ ధర్నా చేయాలని ఆయన నిర్ణయించారు. అసలు సమస్యకు కారకుడైన ఆయనే మళ్లీ న్యాయం చేయాలని ఆందోళనకు దిగడం ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే చందాన ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అప్పుడేం జరిగింది...
చంద్రబాబు అధికారంలో ఉండగానే కాకినాడ సమీపంలోని తమ్మవరంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు ప్రతిపాదన వచ్చింది. దాని కోసం భూమిని నాలుగు ప్లాట్‌లుగా భూసేకరణ చట్టం ద్వారా సేకరించాలని నిర్ణయించారు. ఆ మేరకు 295.04 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు 1996లో రెవెన్యూ యంత్రాంగం డ్రాఫ్ట్ నోటిఫికేషన్, డ్రాఫ్ట్ డిక్లరేషన్ ప్రకటించింది. విశాఖపట్నం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పరిశ్రమల శాఖ అదనపు కమిషనర్‌లు భూమి మార్కెట్ ధర ఎకరాకు రూ.2 లక్షలుగా ఉంటుందని నిర్ధారించారు. జిల్లా యంత్రాంగం ఎకరం రూ.1.25 లక్షలుగా నిర్ణయించింది. ఈ మేరకు 295.04 ఎకరాలకు అవార్డు పాస్ చేశారు. అరెకరం, ఎకరం ఉన్న చిన్నకారు రైతుల నుంచి ఈ భూమిని సేకరించడంతో పరిహారం కింద ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం సరిపోదని, కనీసం రూ.3 లక్షలయినా ఇవ్వాలని రైతులు రోడ్డెక్కారు. 

అసలు భూమిని ఇచ్చేందుకు కూడా వారు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో అప్పటి జిల్లా కలెక్టర్ రైతుల డిమాండ్ మేరకు జిల్లా సంప్రదింపుల కమిటీ ఆమోదంతో 1999 డిసెంబర్ 10న పరిహారాన్ని పెంచాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ లేఖను పరిశీలించిన చంద్రబాబు ప్రభుత్వం పెంచేది లేదని తేల్చిచెప్పింది. దీంతో కొందరు రైతులు రెవెన్యూ కోర్టును, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఆ విధంగా నాడు రైతుల గోడు పట్టించుకోకుండా, ఏమాత్రం కనికరం లేకుండా వ్యవహరించిన చంద్రబాబు.. నేడదే తమ్మవరం రైతుల కోసం ఆందోళన చేపడతాననడం.. స్థానిక ప్రజల జ్ఞాపకశక్తికి పరీక్ష పెట్టడమేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం కోసం అవకాశవాద రాజకీయాలకు పాల్పడే చంద్రబాబు వైఖరికి ఇది మరో నిదర్శనమనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

సెజ్‌లకు రాయితీల కోసం బాబు ఒత్తిళ్లు!
కేంద్రానికి లేఖల మీద లేఖలు
అప్పట్లో కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పిన చంద్రబాబు.. కేంద్రం తానేది అడిగితే అది ఇచ్చేస్తుందని భావించేవారు. అదే ధైర్యంతో ఆయన ఆర్థిక మండళ్లకు ప్రత్యేక రాయితీలివ్వాలని కోరుతూ లేఖల మీద లేఖలు రాశారు. 2003 జనవరి 31న అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి జశ్వంత్‌సింగ్‌కు లేఖ రాసిన ఆయన ఆర్థికమండళ్లకు 13 రకాల రాయితీలు ప్రతిపాదించారు. మళ్లీ అదే ఏడాది మార్చి 21న మరో లేఖ రాసి ఇంకొన్ని రాయితీలను అడిగారు. ఆ లేఖల్లోని ప్రధానాంశాలివి...
- సెక్షన్ 10-ఎ, 10-బి కింద ఆదాయపు పన్ను మినహాయింపు 
- సెజ్ ప్రమోటర్ (డెవలపర్)కు ఆదాయపన్ను చట్టం కింద మినహాయింపునివ్వాలి. 
- పదేళ్ల కాలపరిమితితో సెజ్ యూనిట్లు రాయితీలు కోరుకునే వెసులుబాటుకు. 
- వచ్చిన లాభాల్లో 50% తిరిగి పెట్టుబడులుగా పెడితే వాటిని పన్ను నుంచి మినహాయించాలి. 
- ఈ మినహాయింపు కాలం పూర్తయిన తర్వాత పన్నును 50 శాతానికి మించి విధించరాదు. 
- ఆఫ్‌షోర్ బ్యాంకింగ్ యూనిట్లకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. 
- సెజ్ నుంచి డొమెస్టిక్ ప్రాంతంలోకి...సెజ్ నుంచి మరో సెజ్‌లోకి అమ్మకాలు జరిపినా వాటిని ఎగుమతులుగా గుర్తించాలి. 
- సెజ్ యూనిట్లలో విదేశీ బీమా కంపెనీల లావాదేవీలకు అనుమతించాలి. 
- ఆఫ్‌షోర్ బ్యాంకింగ్ యూనిట్లకు 5% ఫ్లాట్ రేటు ఆదాయపు పన్ను వర్తింపజేయాలి. 
- వీటిల్లో పెట్టే డిపాజిట్లకు టీడీఎఫ్ విధానం వర్తింపజేయకూడదు. 
- ఈ బ్యాంకులకు సీఆర్‌ఆర్ ఆంక్షలు, పరిమితుల నుంచి మినహాయింపు ఉండాలి. ఈ మేరకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్టులు సవరించాలి. 
- యాజమాన్య బదిలీ, విదేశీ మారకద్రవ్య మార్పిడి, పాత యూనిట్లు, పాత యంత్రాల వాడకానికి ఆదాయపన్ను చట్టం 10-ఎ, 10-బి కింద మినహాయింపునివ్వాలి. 

విదేశాల్లో సైతం ప్రచారం!
సెజ్‌ల విషయంలో చంద్రబాబుకు అప్పటికే ఓ క్లారిటీ ఉంది. ఆర్థిక మండళ్ల ఏర్పాటు ద్వారా అంతర్జాతీయ ప్రచారం పొందాలని ఆయన ఆశించారు. అందులో భాగంగా చైనా తరహా భారీ సెజ్‌లు లక్ష్యంగా విధాన ప్రకటన చేసి దేశ విదేశాల్లో ఘనంగా ప్రచారం చేసుకున్నారు. పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు చేశారు. 2002 ఫిబ్రవరిలో అమెరికా వెళ్లిన ఆయన న్యూయార్క్‌లో 50 కార్పొరేట్ సంస్థల సీఈవోలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మా దగ్గర ఆర్థిక మండళ్లలో పెట్టుబడులు పెట్టే వారికి ఆదాయపు పన్ను హాలిడే ఉంటుంది. లాభాలపైనా పన్నుండదు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఎలాంటి అవరోధాలూ లేకుండా చూస్తాం...’ అంటూ వారిలో ఆశలు రేకెత్తించారు. ఇదే వివరాలతో అమెరికాలోని పలు వాణిజ్య కూడళ్లలో రోడ్‌షోలు, ప్రదర్శనలు కూడా నిర్వహించింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. ఈ విషయాన్ని దేశ, విదేశీ పత్రికలు వార్తలుగా కూడా ప్రచురించాయి. 

రైతుల కోసం రెండు గంటలే!
కాకినాడ సెజ్ కోసం సేకరించిన భూములు తిరిగి రైతులకు అప్పగించాలనే డిమాండ్‌తో తన పుట్టిన రోజు సందర్భంగా రాజీలేని పోరాటానికి దిగుతానని ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అందుకు కేటాయించిన సమయం కేవలం రెండు గంటలు. సాయంత్రం 4 గంటల నుంచి రెండు గంటల పాటు కాకినాడ సెజ్ ఏర్పాటుకు భూములిచ్చిన రైతులతో సమావేశమవుతారని పార్టీ తెలిపింది.
Share this article :

0 comments: