భవిష్యత్ నీదే.. రాబోయే రాజ్యం మనదే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » భవిష్యత్ నీదే.. రాబోయే రాజ్యం మనదే

భవిష్యత్ నీదే.. రాబోయే రాజ్యం మనదే

Written By news on Saturday, April 21, 2012 | 4/21/2012

నక్కపల్లి/పాయకరావుపేట, న్యూస్‌లైన్ : ‘ప్రజల పక్షాన నిలిచిన ఎమ్మెల్యేలను అనర్హత వేటు వేసి తొలగించారు. వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే. రాబోయే కాలమంతా మనదే. త్వరలో రాజన్న కాలం నాటి సువర్ణయుగం తీసుకొస్తా...’ అని వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పాయకరావుపేట ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన ముఖ్యంగా మత్స్యకార గ్రామాలైన వెంకటనగరం, రాజానగరం, రాజవరం, కేశవరం తదితర గ్రామాల్లో పర్యటించారు. అక్కడి ప్రజలు తాము ఎదుర్కొంటున్న కష్టాలు ఏకరువు పెట్టారు. మత్స్యకారులు ప్రభుత్వం తమపై చూపెడుతున్న వివక్షను జగన్‌కు వివరించారు. తీరప్రాంతంలో రసాయన పరిశ్రమల ఏర్పాటు వల్ల మత్స్యసంపద నాశనమౌతోందని గతంలో పది కిలోమీటర్లు సముద్రంలోకి వెళ్తే చేపలు లభించేవని, ఇప్పుడు 100 నుంచి 120కిలోమీటర్ల దూరం వెళ్లినా చేపలు లభించడంలేదని వాపోయారు.

వేట నిషేధ సమయంలో ప్రభుత్వం రెండేళ్ల నుంచి మత్స్యకారులకు ఇచ్చే ఉచిత బియ్యాన్ని ఇవ్వడంలేదనీ, వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృత్యువాత పడితే ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి కూడా పరిహారం అందడం లేదని చెప్పారు. కంపెనీల నుంచి విడుదలయ్యే వ్యర్థరసాయనాల వల్ల ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తుపానులు, సునామీ వంటి విపత్కర పరిస్థితుల్లో ఇంజిన్లు, వలలు నష్టపోతున్న మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవడంలేదనీ విన్నవించారు.

ఉపాధి వేతనం గిట్టుబాటు కాకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో 108, 104 వాహనాలు రావడంలేదని జగన్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై యువనేత స్పందిస్తూ ఈ ప్రభుత్వం పాలించే అర్హత కోల్పోయిందనీ, కాబట్టే గద్దెదింపాలని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి సంక్షేమఫలాలు అందేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. వేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు మృతిచెందితే రూ.5లక్షల నష్టపరిహారం ఇస్తామన్నారు. ప్రతి అవ్వ, ప్రతి తాత మూడుపూటలా తిండి తినేలా పింఛన్లు రూ.700కు పెంచుతానని చెప్పారు. ఆయన ఇచ్చిన భరోసా మత్స్యకారులు, మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది. నాన్న ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు... అదే బాటలో నడువుబాబూ... భవిష్యత్ నీదే.. రాబోయే రాజ్యం మనదే అంలటూ మహిళలు, వృద్ధులు ఆయనను ఆశీర్వదించారు.
Share this article :

0 comments: