వైఎస్ జగన్ ఇంతవరకు తిరుమలకు రానేలేదని అవాస్తవ వ్యాఖ్యలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ ఇంతవరకు తిరుమలకు రానేలేదని అవాస్తవ వ్యాఖ్యలు

వైఎస్ జగన్ ఇంతవరకు తిరుమలకు రానేలేదని అవాస్తవ వ్యాఖ్యలు

Written By news on Friday, April 27, 2012 | 4/27/2012


2009 ఏప్రిల్ 18న శ్రీవారి దర్శనం చేసుకున్న వైఎస్ జగన్

తిరుపతి-న్యూస్‌లైన్ ప్రతినిధి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాస్తికుడని, అలాంటి వారికి అధికారం అప్పగిస్తే తిరుపతి, తిరుమల పవిత్రత మంటగలుస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి చంద్రబాబు ముత్యాలరెడ్డిపల్లె సర్కిల్‌లో బహిరంగ సభలో మాట్లాడారు. ‘సోనియాగాంధీ అయినా తిరుమలకు వచ్చారు కానీ, కడపలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ఏనాడూ తిరుమలకు వచ్చిన దాఖలాలు లేవు’ అన్నారు. 

అయితే, 2009 ఎన్నికల సమయంలో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి భూమన కరుణాకరెడ్డికి మద్దతుగా 2009 ఏప్రిల్ 17వ తేదీన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతిలో ప్రచారం చేశారు. ఆ రోజు రాత్రి ఆయన తిరుమలలో బస చేసి 18వ తేదీ ఉదయం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేకసార్లు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. కాగా, ఎన్నికల నిబంధనావళిని విస్మరించిన చంద్రబాబు మత విశ్వాసాలపై వ్యాఖ్యానించటంతో పాటు రాత్రి 10 గంటల తర్వాత రోడ్‌షో ద్వారా ఎన్నికల ప్రచారం కొనసాగించారు.
Share this article :

0 comments: