‘పోలవరం’ పులకింత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘పోలవరం’ పులకింత

‘పోలవరం’ పులకింత

Written By news on Wednesday, April 25, 2012 | 4/25/2012

వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటనతో పోలవరం నియోజకవర్గం పులకరించింది. గిరిజనుల గుండె తట్టి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. శనివారం నుంచి మంగళవారం వరకు నాలుగురోజుల పాటు పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో ఆయన రోడ్‌షోలు, సభలకు జనం పోటెత్తారు. పర్యటన ముగింపుగా కొయ్యలగూడెంలో మంగళవారం రాత్రి జరిగిన బహిరంగ సభకు జనం భారీ సంఖ్యలో హాజరయ్యారు.

జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన పార్టీ నాయకులు, కార్యకర్తల్లో సమరోత్సాహం నింపింది. నాలుగు రోజుల్లో 71 గ్రామాలు, 131 కిలో మీటర్ల మేర ఆయన పర్యటించారు. నక్సలైట్ ప్రభావిత అటవీ ప్రాంతం, గ్రామాల్లో కూడా జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు. రాష్ట్రస్థాయి నేతలు ఎవరూ పర్యటించని మారుమూల గ్రామాలకు కూడా ఆయన వెళ్లి గిరిజనులతో మమేకమయ్యారు. గిరిజన తెగలైన కోయ, లంబాడీ, సుగాలి భాషల్లో మాట్లాడటంతో వారిలో ఆనందోత్సహాలు వెల్లివిరిశాయి. పర్యటించిన ప్రతి గ్రామంలో స్థానిక సమస్యలను ప్రస్తావించిన ఆయనకు అడుగడుగునా ఆయనకు ప్రజలు నీరాజనాలు పలి కారు. 

ఒక అన్నలా, తమ్ముడిలా, కొడుకులా, మనువడిలా, స్నేహితుడిలా భావించి ఆప్యాయతానురాగాలు కురిపించారు.జగన్‌మోహన్ రెడ్డి కూడా ఆయా గ్రామాల్లో అవ్వాతాత అక్కాచెల్లి అన్నా అంటూ అందర్నీ ఆప్యాయంగా పలకరించి వారి మనసులో చోటు సంపాదించుకున్నారు.రైతులు, పేదలు, కూలీలు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను విన్నవించారు. ‘మీ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నంత కాలం రాష్ట్రం, పేదల బతుకులు బాగుండేవి, ప్రస్తుతం తమను ఎవరు పట్టించుకోవడం లేదు. ఆయన పెట్టిన పథకాలు అమలు కావాలంటే మీరు సీఎం కావాల’ని పలువురు జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించారు. 

తమ పార్టీ అధికారంలోకి వస్తే అందరి కష్టాలు తీరుతాయని, రైతు రాజ్యాన్ని గెలిపిచండని ఆయన విజ్ఞప్తి చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలో నియోజకవర్గంలో కీలకమార్పులు చోటుచేసుకున్నాయి. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల కీలక నాయకులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ లో చేరారు. టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ పూనెం సింగన్నదొర భార్య శ్రీలక్ష్మి, కుమారులు పూనెం వీరవెంకటసత్యరామ్మోహన్, మురళి, రవి, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు చేరారు. టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించిన పోలవరం మండల ఎస్టీసెల్ అధ్యక్షుడు మడకం బోడయ్య, పీసీసీ సభ్యుడు, ఇళ్ల భాస్కరరావు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. 

పోతన, చెలికాని చేరిక
కొయ్యలగూడెం సభలో పారిశ్రామికవేత్త, బయ్యనగూడెం గ్రామవాసి పోతన శేషు, ద్వారకాతిరుమల మం డల నాయకుడు చెలికాని రాజబాబు, అంకాలగూడెంకు చెందిన బీజేపీ నాయకుడు గండ్రోతు సత్యనారాయణ తన అనుచరులతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని ఆయన పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.
Share this article :

0 comments: