గుండె పగిలిన అభిమానం, 48 మంది గుండెపోటుతో మృతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గుండె పగిలిన అభిమానం, 48 మంది గుండెపోటుతో మృతి

గుండె పగిలిన అభిమానం, 48 మంది గుండెపోటుతో మృతి

Written By news on Tuesday, May 29, 2012 | 5/29/2012

48 మంది గుండెపోటుతో మృతి

న్యూస్‌లైన్ నెట్‌వర్క్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అరెస్ట్‌తో ఉద్వేగానికి గురై పలువురి గుండె ఆగింది. ‘అధిష్టానం’ అత్యంత దాష్టీకంగా వ్యవహరిస్తూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డను అరెస్ట్ చేయించడాన్ని తట్టుకోలేక తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. జగన్ అరెస్ట్‌ను చేసినట్టు టీవీల్లో వచ్చి వార్తలను చూస్తూ, పత్రికల్లో చదువుతూ ఉద్వేగానికి లోనై ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా 48 మంది గుండెపోటుకు గురై మృతిచెందారు. గుంటూరు జిల్లాలో పదిమంది, తూర్పు గోదావరి జిల్లాలో ఆరుగురు, అనంతపురం, పశ్చిమ గోదావరి, కర్నూలు, వైఎస్‌ఆర్ జిల్లాల్లో నలుగురు చొప్పున, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున, చిత్తూరు, మహబూబ్‌నగర్, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున గుండెపోటుతో ప్రాణాలొదిలారు. 

తల్లడిల్లి ఆత్మహత్య

జగన్‌మోహన్‌రెడ్డి అరెస్ట్‌ను జీర్ణించుకోలేక ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కె.గంగవరం మండలం కూళ్ల శివారు తమ్మాయపాలానికి చెందిన వాసంశెట్టి అర్జునరావు (32) సోమవారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. టీవీలో వార్తలు చూస్తూ జగన్‌కు కోర్టు రిమాండ్ విధించిందని తెలుసుకుని ఇంట్లోనే పురుగుల మందుతాగి ప్రాణాలు తీసుకున్నాడు. మరో ఘటనలో గుంటూరు జిల్లా వేమూరు మండలం పోతుమర్రు గ్రామానికి చెందిన ఈపూరు సుధారాణి(20) ఆదివారం రాత్రి జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేసిందన్న వార్తలను టీవీలో చూస్తూ మనస్తాపానికి గురైంది. అర్ధరాత్రి పురుగులమందు తాగడంతో గమనించిన కుటుంబసభ్యులు తెనాలి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. 

ఉద్వేగంతో గుండెపోటుకు గురై..

ఆదివారం రాత్రి జగన్ అరెస్టు, విజయమ్మ ధర్నా, తదనంతర పరిణామాలను టీవీల్లో వీక్షిస్తూ, సోమవారం ఉదయం పత్రికల్లో వార్తలు చదువుతూ ఉద్వేగానికి గురైన పలువురు అభిమానులు గుండెపోటుతో మరణించారు. గుంటూరు జిల్లా నకరికల్లు పంచాయతీ ఉదయ్‌నగర్‌కాలనీకి చెందిన మండూరి రాధాకృష్ణ(55), చెరుకుపల్లి మండలం పొన్నపల్లికి చెందిన పిట్టు చిట్టిమ్మ(50), అమృతలూరు ఎస్సీ కాలనీకి చెందిన చందోలు శ్యామలాదేవి (53), నూజెండ్ల మండలం కంభంపాడు గ్రామానికి చెందిన కూరేటి కోటయ్య(45), మూల్పూరులోని చింతాయపాలేనికి చెందిన ఇంటూరు యాకోబు(50), కర్లపాలెం మండలం పెదపులుగువారిపాలెం మాజీ సర్పంచ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పులుగు సుబ్రహ్మణ్యంరెడ్డి (56), ముప్పాళ్ళ మండలం మాదల గ్రామానికి చెందిన షేక్ దేచారం లాల్‌బి (40) , క్రోసూరు మండలం దొడ్లేరుకు చెందిన ఆవుల రామతులశమ్మ (50), వినుకొండ రూరల్ మండలం నాగులవరానికి చెందిన శ్యామకూరి వెంకటేశ్వరరెడ్డి(57), చిలకలూరిపేట రూరల్ మండలం మురికిపూడి గ్రామానికి చెందిన గోగు వె ంకయ్య(56) గుండెపోటుతో మృతిచెందారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం శీలంవారిపాలానికి చెందిన ఊబా చంద్రరావు (50), కోరుకొండ మండలం కోటి గ్రామంలో కప్పాల డొక్క ఏసురత్నం (50), రాజానగరం మండలం కొత్తతుంగపాడుకు చెందిన ఉల్లింగ వీరవేణి (45), కొత్తపేట మండలం పలివెల కట్టా దుర్గారావు (27), ఆత్రేయపురం మండలం నార్కెడ్‌మిల్లికి చెందిన పి.వెంకటరత్నం (45), తాళ్లరేవు మండలం ఇంజరానికి చెందిన గ్రంధి శ్రీనివాస్ (38)లు జగన్ అరెస్ట్‌కు సంబంధించిన వార్తలు తెలిసిన తర్వాత గుండెపోటుతో మృతిచెందినట్టు వారి కుటుంబసభ్యులు తెలిపారు.

కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామంలో టైలర్ రాముడు(36), కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామంలో బోయ విజయమ్మ(35), కొలిమిగుండ్ల మండలం హనుమంతుగుండం గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త సంజీవరాయుడు (36), బండిఆత్మకూరు మండలం పెద్దదేవళాపురం గ్రామానికి చెందిన బిజినేముల రామసుబ్బయ్య(50), వైఎస్‌ఆర్ జిల్లా వీరబల్లి మండలం ఓదివీడు గ్రామానికి చెందిన దయ్యాల చిన్నప్ప(50), కడప ఆల్మాస్‌పేట ఎస్టీ కాలనీకి చెందిన కమ్మగిరి శ్రీనివాసులు(42), బద్వేలు మునిసిపాలిటీ మడకలవారిపల్లెకు చెందిన దుగ్గెనబోయిన బాలయ్య (46), పోరుమామిళ్ల మండలం గానుగపెంట పంచాయతీ రేపల్లె దళితవాడకు చెందిన మాగిపోగు లక్ష్మయ్య(55) ,అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం బనాన్‌చెరువు తండాలో గ్యాంగులమ్మ(48),అనంతపురం మండలం పిల్లిగుండ్ల కాలనీలో గంగాధర్(45) కూడా జగన్ అరెస్ట్‌ను తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందారు.

వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామానికి చెందిన నారాయణ(46), కదిరిలో వెంకటరమణ (55), పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం గగ్గిపర్రుకు చెందిన అడ్డాల రంగారావు (50), దెందులూరు మండలం దోసపాడుకు చెందిన దేర్ల రాజబాబు (42), పెదవేగి వుండలం లక్ష్మీపురానికి చెందిన సొంగా పుల్లేష్ (50), దుగ్గిరాల జోసఫ్‌నగర్‌కు చెందిన చిన్నం రత్నంరాజు (43) జగన్ అరెస్ట్‌ను తట్టుకోలేక మనోవేదనతో మరణించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం మారేళ్ల పంచాయతీ ఎరుకుల కాలనీకి చెందిన గాలేటి చిన్నప్ప(45), నాగలాపురం మండలం ఎస్‌ఎస్‌పురం ఆదిఆంధ్రవాడకు చెందిన నారయ్యు(55), మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం రాచాల గ్రామానికి చెందిన ఎద్దుల జగత్ ప్రకాశ్‌గౌడ్ (49), పెద్దమందడి మండలం అమ్మపల్లికి చెందిన వడ్డె బాల్‌చెంద్రి(50), నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం సంగోజీపేటకు చెందిన మలబాబు(54), కరీంనగర్ జిల్లా ఎలిగేడు మండలం నర్సాపూర్‌లో యాదగిరి చంద్రకుమార్ (25), హైదరాబాద్ అసిఫ్‌నగర్‌లో ఉంటున్న ఎం.హేమ్లానాయక్(42), ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల క్రాంతినగర్‌కు చెందిన చిన్నంగారి కృష్ణమూర్తి (30) జగన్ అరెస్ట్ వార్తలను టీవీలోచూస్తూ ఉద్వేగానికిలోనై గుండె ఆగి మృతిచెందారు. 

విశాఖ జిల్లా హుకుంపేట మండలం కొట్నాపల్లిలో గెమ్మెలి చిన్నయ్య(44), రావికమతం మండలం కొత్తకోటకు చెందిన పూడి పాప(45), మునగపాక మండలం పల్లపు ఆనందపురం శివారు కుమారపురం గ్రామానికి చెందిన దోసపాత్రుని అమ్మయ్యమ్మ(56), శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం శ్రీనివాసపురానికి చెందిన షేక్ మస్తానయ్య (50), వెంకటగిరిలో పాటిపట్ల సుబ్బారెడ్డి (50) గుండెపోటుతో చనిపోయారు. కలువాయి ముస్లింపాళెంకు చెందిన షేక్.ఖాజామొహిద్దీన్(43) హైబీపీకిలోనై మృతి చెందారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరుకు చెందిన తుమ్మల మేరీ వనకుమారి (54), నూజివీడు నందమూరి పేటలో బొబ్బిలి హేమకుమారి (55) జగన్ అరెస్ట్ వార్తలు చూస్తూ గుండెపోటుతో చనిపోయినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
Share this article :

0 comments: