జగన్ కంపెనీల్లో ప్రసాద్ పెట్టుబడి రూ. 854 కోట్లు... దాన్లో రూ. 350 కోట్ల విలువైన వాటాల్ని విక్రయించేశారు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ కంపెనీల్లో ప్రసాద్ పెట్టుబడి రూ. 854 కోట్లు... దాన్లో రూ. 350 కోట్ల విలువైన వాటాల్ని విక్రయించేశారు..

జగన్ కంపెనీల్లో ప్రసాద్ పెట్టుబడి రూ. 854 కోట్లు... దాన్లో రూ. 350 కోట్ల విలువైన వాటాల్ని విక్రయించేశారు..

Written By news on Thursday, May 17, 2012 | 5/17/2012

జగన్ కంపెనీల్లో ప్రసాద్ పెట్టుబడి రూ. 854 కోట్లు... 
దాన్లో రూ. 350 కోట్ల విలువైన వాటాల్ని విక్రయించేశారు.. 
క్విడ్ ప్రో కోగానే ఈ పెట్టుబడులు పెట్టారని సీబీఐ చెప్పింది..
ఆ రూ. 350 కోట్లపై వచ్చిన లాభం గురించి ప్రస్తావనే లేదు
అసలు క్విడ్ ప్రో కో పెట్టుబడులపై లాభాలొస్తాయా?
లాభం వచ్చిందంటే దాన్ని ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించొద్దా?
{పసాద్ చాలా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారుగా!
అసలు ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టడమే నేరమా?
వాన్‌పిక్‌కు స్టాంపు డ్యూటీ మినహాయించటమూ నేరమేనా?
గతంలో ఎన్నో కంపెనీలకు మినహాయింపులిచ్చారని తెలియదా?

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడి పెట్టడం నేరం! దాన్ని నిరూపించటమే మా ధ్యేయం’’ ఇదే ఇప్పుడు సీబీఐ దర్యాప్తు వెనక ఉన్న ఏకైక ఎజెండా. ఈ ఎజెండాలో భాగంగా అది లేని లింకులు వెదుకుతోంది. పొంతన లేని వాదనలు చేస్తోంది. నవ్విపోదురుగాక నాకేటి... అన్న రీతిలో సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకెళుతోంది. మ్యాట్రిక్స్ ల్యాబొరేటరీస్ వ్యవస్థాపకుడు, మా టీవీ సంస్థల చైర్మన్ నిమ్మ గడ్డ ప్రసాద్‌ను అరెస్టు చేసిన సందర్భంగా బుధవారం అది కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టును చూస్తే ఈ సంగతి స్పష్టంగా బోధపడుతుంది. ఎందుకంటే.. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో వివిధ ప్రాజెక్టులను పొందినందుకు ప్రతిఫలంగానే (క్విడ్ ప్రో కో) ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు పెట్టారంటున్న సీబీఐ దీనికి సంబంధించి చిత్రమైన వాదన చేసింది. ‘‘జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన వివిధ సంస్థల్లో ప్రసాద్ మొత్తం రూ.854 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. తరవాత అందులో రూ.350 కోట్ల విలువైన వాటాల్ని విక్రయించుకున్నారు. ప్రస్తుతం ఆయన పెట్టుబడులు రూ.505 కోట్లు మిగిలాయి’’ ఇదీ సీబీఐ చేసిన వాదన. 
అసలు క్విడ్ ప్రో కో పెట్టుబడులంటే ఏంటి? ప్రయోజనం పొందినందుకు ప్రతిఫలంగా పెట్టిన సొమ్మే అనుకోవాలి కదా!! ఇవన్నీ ముడుపులనే సీబీఐ ఆరోపిస్తోంది కదా!! మరి అలాంటి ముడుపుల సొమ్ము మళ్లీ వెనక్కి రావటం... అది కూడా లాభాలతో కలిపి చేతికి రావటం ఎక్కడైనా ఉంటుందా? ఒక పెట్టుబడిపై లాభం వచ్చినపుడు దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ అంటారా లేక ముడుపులుగా చెల్లించిన సొమ్మని అంటారా? ఈమాత్రం ఇంగితజ్ఞానం సీబీఐకి లేదనుకోవాలా? తన టార్గెట్‌ను ఛేదించటం కోసం ఎంతటి స్థాయికైనా తెగిస్తున్న వైఖరి దీన్లో కనిపించటం లేదా? ఇదెక్కడి వాదన! నిమ్మగడ్డ ప్రసాద్ గనక తాను ప్రాజెక్టులు పొందినందుకే వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో రూ.854 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఉంటే... అందులో రూ.350 కోట్లు లాభంతో సహా తిరిగి వస్తుందా!! ఆ వాటాను ఆయన వేరెవరికో విక్రయించుకుని బయటపడే అవకాశం ఉంటుందా? అలాంటి అవకాశం ఉన్నపుడు దాన్ని ఇన్వెస్ట్‌మెంట్‌గా పరిగణిస్తారు తప్ప ఏదో మేలు పొందినందుకో, ఏదో లాభం వచ్చినందుకో పెట్టారని ఎలా అనుకుంటారు? సీబీఐ చర్యలకు న్యాయం, ధర్మం అవసరం లేదా? కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సీబీఐ ఏ స్థాయికి దిగజారిపోయి వ్యవహరిస్తోందో తేలిగ్గానే తెలుస్తుంది. పోనీ నిమ్మగడ్డ ప్రసాద్ తన కెరీర్‌లో ఇప్పటిదాకా ‘సాక్షి’లో తప్ప మరెక్కడా ఇన్వెస్ట్‌మెంట్ చేయకపోతే సీబీఐ ఆరోపణల్ని నమ్మే పరిస్థితి ఉండొచ్చు. కానీ ప్రసాద్ విజయవంతమైన ఇన్వెస్టరుగా ఎంతో పేరు పొందారు. హెల్త్‌కేర్, మీడియా రంగాల్లో పెట్టుబడులు పెట్టడమే కాక... సరైన సమయాల్లో కొన్ని విక్రయించుకుని లాభాలు పొందారు. చిత్రమేమిటంటే.. జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో కూడా ఈయన కొంత వాటాను లాభానికి విక్రయించుకున్నారు. దాన్ని కూడా ప్రస్తావించిన సీబీఐ... తన పాత పాటను మాత్రం వదలకపోవటం గమనార్హం. ‘‘ఇన్వెస్టర్ల జోలికి వెళ్లం’’ అని కోర్టులో నేరుగా చెప్పిన సీబీఐ ఇప్పుడు ఎన్నికల ముందు ఎందుకు యూ టర్న్ తీసుకుందన్నది ఈ దర్యాప్తుకు సారథ్యం వహిస్తున్న జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణో మరొకరో చెబితే తప్ప సామాన్యులకు తెలిసే అవకాశం లేదు కూడా!!! స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇవ్వటమూ అక్రమమేనా!!
స్టాంపు, రిజిస్ట్రేషన్ల చట్టానికి విరుద్ధంగా వాన్‌పిక్ ప్రాజెక్టుకు పలు మినహాయింపులిచ్చారని, అదంతా ప్రసాద్‌కు మేలు చేకూర్చడానికేనని సీబీఐ రిమాండ్ రిపోర్ట్‌లో మరో ఆరోపణ చేసింది. అసలు ఇంతకన్నా ఘోరం ఇంకేమైనా ఉందా అంటే... చచ్చినా కనిపించదు. అసలు 1996లో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి పారిశ్రామిక విధానంలో భాగంగా పలు రాయితీలతో ఇస్తున్న జీవోల గురించి సీబీఐకి తెలియదా? జీవో ఎంఎస్ నంబరు 108 (20.5.1996), జీవో ఎంఎస్ నంబరు 241 (15.7.1998)లతో మొదలు పెడితే... 2001, 2004తో పాటు ఇప్పటికి 15 జీవోలు విడుదలయ్యాయి. వీటిలో 2010 ఏప్రిల్లో నాటి రోశయ్య ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ నంబరు 32 కూడా ఉంది. వీటన్నిటిలోనూ రాయితీల సంగతి స్పష్టంగా... అందులోనూ స్టాంపు డ్యూటీ మినహాయింపు, రీయింబర్స్‌మెంట్‌ను మరీ ప్రముఖంగా పేర్కొన్న అంశం దర్యాప్తు సంస్థకు తెలియదా! కేవలం వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే... అది కూడా ఒక్క నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన కంపెనీలకే ఇచ్చినట్లు ఎందుకింత దిగజారుడు ఆరోపణలు? నిష్పాక్షిక దర్యాప్తుతో నిజాలు నిగ్గు తేల్చాల్సిన దర్యాప్తు సంస్థలు మరీ ఈ స్థాయికి వస్తే ఇక న్యాయానికి దిక్కెవ్వరు?


ఇది రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం కాదా?

నిజానికి వాన్‌పిక్‌కు సంబంధించి ప్రభుత్వానికి నిమ్మగడ్డ ప్రసాద్‌తో ఎలాంటి ఒప్పందమూ కుదరలేదు. ఇది జీ టూ జీ ఒప్పందం. అంటే రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం. 2008 జనవరిలో రస్ అల్ ఖైమా (రాక్) ప్రభుత్వ సలహాదారు ఎ.జె.జగన్నాథన్ వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించారని, వాడరేవు, నిజాంపట్నం పోర్టు కారిడార్ అభివృద్ధి ప్రాజెక్టును (వాన్‌పిక్) చేపట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేశారని సీబీఐ రిమాండ్ రిపోర్టులో కూడా పేర్కొంది. ఆ తరవాత తమ ఇండియన్ పార్ట్‌న ర్‌గా నిమ్మగడ్డ ప్రసాద్‌ను పెట్టుకుంటున్నట్లు రాక్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసిందని, దాని ప్రకారమే ప్రసాద్ ఈ ప్రాజెక్టులోకి వచ్చారని అదే పేర్కొంది. మరి రాక్ ప్రభుత్వ భాగస్వామిగా వచ్చినపుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకేదో మేలు చేసిందని, అందుకు ప్రతిఫలంగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని వాదించటం ఏ మేరకు సమంజసం? ఇందులో వాస్తవమెంత?

మునుపెవ్వరూ మినహాయింపులివ్వలేదా?

చిత్రమేమిటంటే రెండు పోర్టులతో సహా వాన్‌పిక్ ప్రాజెక్టును అభివృద్ధి చేసే ఒప్పందానికి సంబంధించి 2008 జూలైలో రాయితీల ఒప్పందంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాక్ ప్రభుత్వం సంతకాలు చేశాయని సీబీఐ పేర్కొంది. ‘‘రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోర్టులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి బ్రహ్మానందరెడ్డి, రాక్ ప్రభుత్వం తరఫున నిమ్మగడ్డ ప్రసాద్ సంతకాలు చేశారు’’ అని తెలిపింది. ఈ ప్రాజెక్టుకిచ్చిన మినహాయింపుల్లో చాలావరకూ కేబినెట్‌లో చర్చించిన దానికి విరుద్ధంగా ఉన్నాయని, కేబినెట్లో పేర్కొనని అంశాల్ని దీన్లో చేర్చారని తెలిపింది. పెపైచ్చు ఈ రాయితీల్ని గంగవరం, కృష్ణపట్నం పోర్టులతో పోల్చటమూ చేసింది. ‘‘కృష్ణపట్నం, గంగవరం పోర్టులతో పోలిస్తే ఈ ప్రాజెక్టుకు విరుద్ధమైన మినహాయింపులిచ్చినట్లు 2009లో ప్రభుత్వం గమనించింది’’ అని సీబీఐ పేర్కొంది. నిజానికి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడుల కేసుకు సంబంధించి ప్రభుత్వానికి హైకోర్టు ఎప్పుడో నోటీసులిచ్చింది. దానికి ప్రభుత్వం తరఫున సమాధానమే లేదు. కోర్టులో కౌంటర్ కూడా వేయలేదు. ఇటీవల సుప్రీం కోర్టు సైతం ఆ జీవోలు జారీ చేసిన మంత్రులంతా సమాధానం చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 30తో గడువు తీరిపోయినా మంత్రులు మాత్రం సమాధానాల్ని పంపలేదు. మరి ప్రభుత్వం ఎప్పుడు గుర్తించిందో, ఏ రూపంలో సీబీఐకి చెప్పిందో, 2009లోనే ఇలా గుర్తించినట్లు ఎవరు చెప్పారో అర్థం కాని విషయం. పెపైచ్చు చంద్రబాబునాయుడు అడ్డగోలుగా రాయితీలు కట్టబెట్టిన కాకినాడ పోర్టుతో దీన్ని పోల్చకపోవటం గమనార్హం. కాకినాడ పోర్టుకు సంబంధించి మలేసియా కన్సార్షియం పేరిట ఎల్ అండ్ టీతో చేసుకున్న ఒప్పందంలో ఏటా ప్రభుత్వానికి మినిమమ్ గ్యారంటీ మొత్తం చెల్లించాలనే నిబంధన ఉండేది. దాన్ని మళ్లీ చంద్రబాబు మార్చేసి ఏటా నికరలాభంలో కొంత శాతం చెల్లించేలా పేర్కొన్నారు. అంటే కంపెనీకి లాభం వస్తే తప్ప ప్రభుత్వానికి సొమ్ము చెల్లించాల్సిన పని లేదన్నమాట. దీన్ని అప్పట్లో కాగ్ సైతం తీవ్రంగా తప్పుబట్టింది. ఇక్కడ సీబీఐ మాత్రం ‘‘ఒప్పందంలో స్థూల లాభం నుంచి చెల్లింపులు జరపాలని పేర్కొనకుండా నికర లాభం నుంచి చెల్లించాలని పేర్కొనటం సరికాదు’’ అని అభిప్రాయపడింది. అసలు ప్రభుత్వం ఏ కంపెనీకి ఎంత రాయితీలివ్వాలో నిర్ణయించేది కేబినెట్టా? లేక సీబీఐనా? కేబినెట్‌ను పూర్తిగా పక్కనపెట్టి... పెపైచ్చు కేబినెట్ తప్పేమీ లేదన్నట్లుగా తానే క్లీన్ చిట్ ఇచ్చేస్తూ సీబీఐ ఎందుకు దర్యాప్తు సాగిస్తోందన్నది అంతుబట్టని విషయం.
Share this article :

0 comments: