ఆశలు వదులుకున్న టిడిపి(andhrabhoomi) - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆశలు వదులుకున్న టిడిపి(andhrabhoomi)

ఆశలు వదులుకున్న టిడిపి(andhrabhoomi)

Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012

హైదరాబాద్, మే 26: ఉప ఎన్నికల ఫలితాలపై టిడిపి ఆశలు వదులుకొంది. ఇప్పుడు ఫలితాలు ఏవిధంగా ఉన్నా, సాధారణ ఎన్నికల సమయంలో ఆ ప్రభావం ఉండదని టిడిపి నేతలు వాదిస్తున్నారు. పార్టీ శ్రేణులకూ ఇదే సందేశాన్ని ఇస్తున్నారు. ఈ ఫలితాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని, సాధారణ ఎన్నికలు వేరుగా ఉంటాయని పార్టీ నాయకత్వం చెబుతోంది. ప్రారంభంలో ఉప ఎన్నికల్లో కనీసం ఐదారు స్థానాల్లో విజయం సాధిస్తామని టిడిపి నేతలు చెబుతూ వచ్చారు. నోటిఫికేషన్ వెలువడిన తరువాత కనీసం ఆరు స్థానాల్లో గట్టి పోటీ ఇస్తామన్నారు. జగన్‌పై ముప్పేట దాడి, సిబిఐ విచారణ నేపథ్యంలో టిడిపి నేతల స్వరం మారింది. ‘ఉప ఎన్నికలు వేరు, సాధారణ ఎన్నికలు వేరు, సాధారణ ఎన్నికల్లో ఈ ఫలితాల ప్రభావమేమీ ఉండదని ఇప్పుడు వాదిస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో ఇప్పుడు ప్రాధాన్యత వహించే అంశాలేవీ ముందుకు రావు. మంచి పాలన ఎవరు అందించారు, కాంగ్రెస్ పాలన ఎలా ఉందని చూస్తారు. రెండింటినీ పోల్చుకొని ప్రజలు టిడిపికి అధికారం అందించే అవకాశం ఉంది’ అని టిడిపి ఉపాధ్యక్షుడు ఇ పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో తెలంగాణ అంశం ప్రాధాన్యత ఉండదు, ఎన్నికలు ముగిసిన తరువాత మళ్లీ ఆ అంశం ముందుకు వస్తుందేమో కానీ ఎన్నికల్లో మాత్రం ఉండదని, ఒకవేళ అలా ఉంటే 2009లో టిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొన్నందుకు టిడిపి విజయం సాధించి ఉండాల్సిందని అన్నారు. పదేపదే ఉప ఎన్నికలు మంచిది కాదని, జగన్ వల్లనే ఉప ఎన్నికలు వచ్చాయని శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు, టిడిపి నాయకుడు దాడి వీరభద్రరావు విమర్శించారు. పదేపదే ఉప ఎన్నికలకు అవకాశం లేకుండా రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
2009 తరువాత జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లోనూ టిడిపి ఘోరంగా దెబ్బతింటుండటంతో ఉప ఎన్నికలంటే టిడిపి నాయకులు ఇబ్బంది పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మనం విజయం సాధిస్తామని పార్టీ శ్రేణులను మానసికంగా సిద్ధం చేయడానికి ఎంతో శ్రమించాల్సి వస్తుందని, తీరా ఉప ఎన్నికలు రావడం, ఫలితాలు మాకు వ్యతిరేకంగా ఉండటంతో అప్పటి వరకు తాము చేసిన కృషి వృధా అవుతుందని పార్టీ సీనియర్లు అంటున్నారు. ఉప ఎన్నికలు జరిగే 18 నియోజక వర్గాల్లో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండగా, ఇక నెల్లూరు పార్లమెంటు నియోజక వర్గంలో పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. యుద్ధరంగంలో చేతులు ఎత్తేసినట్టు నామినేషన్ల చివరి రోజు టిడిపి అభ్యర్థి ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి పోటీపట్ల నిస్సహాయత వ్యక్తం చేశారు. దాంతో అప్పటికప్పుడు బీద రవిచంద్రయాదవ్‌తో నామినేషన్ వేయించారు. డబ్బులకు సంబంధించిన ఇబ్బందులు తీరుస్తామని హామీ ఇచ్చి ఒంటేరు రంగంలో ఉండేట్టు ఒప్పించారు. పార్టీ నాయకత్వం ఒంటేరును ఒప్పించినా, నియోజక వర్గంలో మాత్రం పార్టీ పరిస్థితి బలహీనంగానే ఉంది.
ప్రస్తుతం జగన్ వ్యవహారం టిడిపికి నష్టం కలిగే విధంగానే మారుతోందని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. జగన్‌ను సిబిఐ విచారించడం, ఎంవి మైసూరారెడ్డి టిడిపిని వీడి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరడం వంటి అంశాలపై పార్టీ సీనియర్లతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. సానుభూతి అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం ఏర్పడడంతో అరెస్టుల డిమాండ్‌పై టిడిపి అధ్యక్షుడు స్వరం మార్చారు. అరెస్టు చేయమని మేండిమాండ్ చేయడం లేదు, చట్ట ప్రకారం చర్య తీసుకోమని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
Share this article :

0 comments: