ఎండైనా, వానైనా జగన్ వెంట జన ప్రవాహం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎండైనా, వానైనా జగన్ వెంట జన ప్రవాహం

ఎండైనా, వానైనా జగన్ వెంట జన ప్రవాహం

Written By news on Wednesday, May 2, 2012 | 5/02/2012

= జనంలోకి వెళ్లి పలుకరించిన జన నేత
= రెండు, మూడు గంటలు ఆలస్యమైనా యువనేత కోసం ఎదురుచూపులు
= దారి పొడవునా ఆత్మీయ స్వాగతాలు
= తిరుపతి సమస్యల పరిష్కారం కోసం జగన్ హామీ
= ప్రతి సభకు భారీ జనం
= 13 చోట్ల జగన్ ప్రసంగం

నడినెత్తిన మండుతున్న సూర్యుడు. ఎండ వేడిమికి చెమటలు కక్కుతూ జనం నడిరోడ్డు మీదే స్నానం చేసినంత అనుభవం. గంటల కొద్దీ రోడ్డు మీద ఎదురు చూపులు. అడుగడుగునా అడ్డుపడి అభిమాన నాయకుడికి జనం పంచిన ఆత్మీయత. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో లీలామహల్ సర్కిల్ వద్ద వర్షం. అయినా వెన్ను చూపని అభిమానులు. ఎండైనా, వానైనా జగన్ వెంట జన ప్రవాహం. మంగళవారం నాటి తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లభించిన అపూర్వ ఆదరణ ఇది.
తిరుపతి-న్యూస్‌లైన్ ప్రతినిధి: తిరుపతిలో పార్టీ అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి విజ యం కోసం రెండు రోజులు ప్రచారం చేయడానికి జగన్ మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ జిల్లా ముఖ్య నేతలు, పెద్ద సంఖ్యలో అభిమానులు ఆయనకు భారీ స్వాగతం పలికారు. అక్కడి నుంచి పార్టీ అభ్యర్థి కరుణాకరరెడ్డి ఇంటికి వెళ్లిన ఆయనకు అక్కడ కూడా అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఉదయం 9 గంటలకు తిమ్మినాయుడుపాలెంలో సభ ప్రారంభం కావాల్సి ఉండగా, అభిమానుల తాకిడి వల్ల ఉదయం 10-15 గంటలకు జగన్ అక్కడికి చేరుకున్నారు. జన నేత కోసం ఉదయం 8 గంటల నుంచే రోడ్డు మీద జనం ఎదురు చూశారు. పూల వర్షం, డ ప్పులతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి సత్యనారాయణపురం సభకు బయల్దేరిన జగన్ కారుకు రోడ్డు వెంబడి జనం అడ్డుతగిలి ఆపారు. 

జనం తనకోసం ఎదురు చూడటంతో జగన్ కారు దిగి వారిని ఆత్మీయంగా పలకరించి ముందుకు సాగారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వచ్చి సత్యనారాయణపురం పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారితో పాటు స్థానికులు జయ జయ ధ్వానాలతో జగన్‌కు స్వాగతం పలికారు. జగన్‌తో చేయి కలపడానికి జనం ఆయన మీద పడటంతో కొంత తోపులాట జరిగింది. అక్కడి నుంచి జీవకోనకు వెళ్లడానికి గంటకుపైగా సమయం పట్టింది. ఉదయం 11-15 గంటలకు లీలామహల్ సర్కిల్‌లో సభ జరగాల్సి ఉండగా, మధ్యాహ్నం 1-15కు జగన్ అక్కడికి చేరుకున్నారు. వేలాది మంది జనం మండుటెండలో ఆయన కోసం ఎదురు చూడగా, జగన్ వచ్చే సరికి వాతావరణం చల్లగా మారి కొంత వర్షం కురిసింది. అయినా కూడా జనం జగన్‌ను చూడాలని రోడ్డు మీదే నిలబడ్డారు. ఆ తర్వాత టీఎంఆర్ కల్యాణమండపం సర్కిల్, తుడా సర్కిల్‌లో జరిగిన సభలకు సైతం జనం పోటెత్తారు. 

మధ్యాహ్నం 1-30కు రైల్వే కాలనీలో సభ జరగాల్సి ఉండగా సాయంత్రం 4 గంటలకు జగన్ అక్కడికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో బీసీలు, పేదలు నివసించే ఈ ప్రాంతంలో జగన్‌కు నీరాజనం లభించింది. ఆ తర్వాత శ్రీనివాస మహల్‌సర్కిల్, అన్నారావు సర్కిల్‌లో కూడా జనం భారీ ఎత్తున హాజరై జగన్ ప్రసంగాలను విన్నారు.చెన్నారెడ్డి కాలనీ పంచాయతీ ఆఫీసు వద్ద జనం పూలవర్షం కురిపించి స్వాగతించారు.పాతమెటర్నిటీ ఆస్పత్రి సర్కిల్, జ్యోతి థియేటర్ వద్ద జరిగిన సభలు కూడా ఊహించిన దానికంటే భారీగా విజయవంతమయ్యాయి. టౌన్ క్లబ్ సర్కిల్‌లో రాత్రి జరిగిన సభకు జనం కిక్కిరిశారు. మంగళవారం నాటి 13 సభల్లో జగన్ ప్రజలు ఎదుర్కుంటున్న తాగునీటి సమస్యను ప్రస్తావిస్తూ తాను సీఎం కాగానే గాలేరు-నగరి ప్రాజెక్టు పూర్తి చేసి తిరుపతి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చినప్పుడు జనం కేరింతలు కొట్టారు.
Share this article :

0 comments: