ఓ పక్క వాన జోరు.. మరో వైపు జనహోరు. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓ పక్క వాన జోరు.. మరో వైపు జనహోరు.

ఓ పక్క వాన జోరు.. మరో వైపు జనహోరు.

Written By news on Thursday, May 3, 2012 | 5/03/2012

ఓ పక్క వాన జోరు.. మరో వైపు జనహోరు. అభిమానంతో తడిసి ముద్దైన జననేత. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆత్మీయ పలుకరింపు కోసం వానను సైతం లెక్కచేయకుండా అభిమాన నాయకుడికి జనం ఘన స్వాగతం పలికారు. జగన్ ‘ప్రతి అవ్వ.. తాత.. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, స్నేహితుడికీ’ అంటూ చేయి చూపించి ఆత్మీయంగా పలుకరించటంతో జనం పులకించిపోయారు. ఆత్మీయ, అనురాగాల మధ్య సాగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండురోజుల పర్యటన విజయవంతం అయ్యింది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళ, బుధవారం పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్‌రెడ్డితో కలిసి తిరుపతిని చుట్టేశారు. 
రెండో రోజు పర్యటన సాగిందిలా...
తిరుపతి శివారు ప్రాంతంలోని ఆటోనగర్‌కు ఉదయం 9గంటలకు ప్రారంభం కావాల్సిన జగన్ ప్రచారం ఆలస్యంగా ప్రారంభమైంది. తిరుమల శ్రీవారి దర్శనానంతరం నేరుగా ఆటోనగర్‌కు చేరుకున్నారు. ఎర్రని ఎండను సైతం లెక్కచేయకుండా జగన్ కోసం వేచి ఉన్నారు. ఉదయం 11.10 గంటల ప్రాంతంలో వచ్చిన జగన్‌కు అపూర్వ స్వాగతం పలికారు. కేరింతలు కొడుతూ జగన్‌తో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. మహిళలు హారతులు ఇచ్చి, ఎర్రనీళ్లతో దిష్టి తీశారు. ఆదం సుధాకర్‌రెడ్డి, ఆదం రాధాకృష్ణారెడ్డి, కుప్పయ్య, వై నరసింహారెడ్డి జగన్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. మధ్యాహ్నం 12గంటలకు కళాంజలి సర్కిల్‌కు చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఇక్కడ అజయ్, కొరమేనుగుంట లక్ష్మణ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మధ్యాహ్నం 12.45 గంటలకు లక్ష్మీపురం చేరుకున్న జగన్‌కు అక్కడ అపూర్వ స్వాగతం లభించింది. వైఎస్సార్‌సీపీ నాయకులు ఆదిమూలం, బీరేంద్రవర్మ, మల్లం రవిచంద్రారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అక్కడి నుంచి 1.15 గంటలకు టీవీఎస్ షోరూం సర్కిల్‌కు చేరుకుని ఉప ఎన్నికల్లో భూమన కరుణాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఇక్కడ ఎస్‌కే బాబు, ముద్రనారాయణ, మణ్ణెం మునిరెడ్డి, మణ్ణెం చంద్రశేఖర్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

2.30 గంటలకు క్రృష్ణాపురంఠాణాకు చేరుకున్న జగన్‌కు మేళతాళాలతో వెంకటసుబ్బారెడ్డి, ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. నాలుగు కాళ్ల మండపానికి 3.10కి చేరుకున్న జగన్‌కు చెలికం కుసుమకుమారి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. 3.40కి పెద్దకాపువీధికి చేరుకున్న వైఎస్ జగన్‌కు మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, శంకర్‌రెడ్డి, గురువారెడ్డి, మునిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అక్కడి నుంచి సాయంత్రం 4.30 గంటలకు బైరాగిపట్టెడకు చేరుకున్నారు. అవిలాల లోకనాథరెడ్డి, రాయలసీమ విద్యాసంస్థల అధినేత వై ఆనందరెడ్డి, తూకివాకం మహి తదితరులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పళణి ధియేటర్ సర్కిల్‌కి చేరుకున్న జగన్‌కు వరుణుడు స్వాగతం పలికాడు. వర్షంలో తడుస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సాయంత్రం 5.35కు ముత్యాలరెడ్డిపల్లికి చేరుకున్న వైఎస్ జగన్‌కు తొప్పిరెడ్డి తిమ్మారెడ్డి, తిరుమలయ్య, వెంకటమునిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, నాదమునిరెడ్డిల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. జోరున వర్షం కురుస్తున్నా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోసం జనం.. జనం కోసం జగన్ వర్షంలోనే తడుస్తూ ప్రసంగించారు. ఆకాశం వైపు చూస్తూ రెండుచేతులతో నమస్కరిస్తూ వర్షాన్ని ఆశ్వాదించారు. ఈ దృశ్యాన్ని చూసిన జనం జగన్‌కు వర్షం అంటే ఇష్టం.. అదే విధంగా వర్షానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్ అంటే ఇష్టంగా ఉన్నట్లుంది. అందుకే వారు వచ్చినప్పుడల్లా వర్షం కురుస్తుందనుకోవటం కనిపించింది.
Share this article :

1 comments:

AJAYREDDYBODE said...

HE IS A DYNAMIC LEADER