‘సాక్షికి సంకెళ్ల’పై మీరూ గొంతు కలపండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘సాక్షికి సంకెళ్ల’పై మీరూ గొంతు కలపండి

‘సాక్షికి సంకెళ్ల’పై మీరూ గొంతు కలపండి

Written By news on Thursday, May 10, 2012 | 5/10/2012

అక్షరంపై కక్షతో సాక్షి పత్రిక గొంతు నులిమేందుకు రాష్ట్రప్రభుత్వం, సీబీఐ, ఎల్లో మీడియా కలిసి పన్నిన కుట్రపై రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కలాలు గొంతెత్తుతున్నాయి. జరిగిన అన్యాయంపై ఆకాశమే హద్దుగా నినదిస్తున్నాయి. జనం గుండె గొంతుకైన సాక్షి పత్రికకు అండగా నిలుస్తున్నాయి. ముందస్తు నోటీసులు లేకుండా రాత్రికిరాత్రే ఏకపక్షంగా సాక్షి పత్రిక, టీవీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసిన సీబీఐ కపటనాటక కుట్రకు వ్యతిరేకంగా సామాన్య జనం నుంచి విద్యాధికులు, మేధావులు, మీడియా స్వేచ్ఛను కాంక్షించే ప్రతిఒక్కరూ ముందుకొస్తున్నారు. 

ఈ పోరాటంలో ‘‘నేను సైతం’’అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. సాక్షికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కుట్రపై మీకూ స్పందించాలని ఉందా.. గుండెగొంతుకై నినదించాలని ఉందా? ఇందుకోసం సాక్షి అభిమానులు ప్రత్యేకంగా ఫేస్‌బుక్ పేజీ సిద్ధంచేశారు. అభిప్రాయాలు, ఆలోచనలను, నినాదాలను పంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ facebook.com/supportsakshiకి లాగిన్ అయితే చాలు. రండి.. అక్షరం శక్తి ఏమిటో చూపించండి!
Share this article :

0 comments: