నీకూ నాకూ డ్యాష్..డ్యాష్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నీకూ నాకూ డ్యాష్..డ్యాష్

నీకూ నాకూ డ్యాష్..డ్యాష్

Written By news on Saturday, May 5, 2012 | 5/05/2012


బట్టబయలైన బాబు ‘మ్యాచ్‌ఫిక్సింగ్’
సీబీఐ విచారణ నుంచి బయటపడేందుకే హోంమంత్రితో రహస్య భేటీ?
అందుకు బలం చేకూర్చేలా జగన్, ఎమ్మార్ కేసుల్లో సీబీఐ దర్యాప్తు
జగనే లక్ష్యంగా ‘నానా కోణాల్లో’ ‘ఆగమేఘాలపై’ దర్యాప్తు చేస్తున్న సీబీఐ
ఎమ్మార్ కేసులో బాబు ప్రమేయం కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నా పట్టించుకోని వైనం
దర్యాప్తుతో తనను ఇబ్బంది పెట్టొద్దని కేంద్రాన్ని కోరిన బాబు?
అందుకు ప్రతిగా ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టబోమంటూ ఆఫర్!
చిదంబరం తాజా వ్యాఖ్యలపై టీడీపీలో తీవ్ర కలకలం
ఆంతర్యమేంటో తెలుసుకోవాలంటూ నేతలను పురమాయించిన బాబు
ఈ విషయం పొలిట్‌బ్యూరోలో చర్చకు రాకుండా జాగ్రత్తపడ్డ వైనం


హైదరాబాద్, న్యూస్‌లైన్: పరదా తొలగింది. బడా బాబుల చీకటి మాటు భేటీల తాలూకు ‘చిదంబర’ రహస్యం ఎట్టకేలకు బట్టబయలైంది. రెండున్నరేళ్లుగా అనేకాంశాల్లో అధికార కాంగ్రెస్‌తో అంటకాగుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ‘మ్యాచ్‌ఫిక్సింగ్’ బండారం లోక్‌సభ సాక్షిగా తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. బాబు తనను కలిశారంటూ స్వయానా కేంద్ర హోం శాఖ మంత్రి చిదంబరం లోక్‌సభలోనే వెల్లడించడంతో టీడీపీ నాయకత్వం ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడింది. బాబు- చిదంబరం భేటీ జరిగిన ఒకట్రెండు రోజులకే జగన్ సంస్థల్లో పెట్టుబడులు, ఎమ్మార్ కేసుల్లో హైకోర్టు తీర్పు వెలువడటం, ఆ తర్వాత వారం రోజులకు వాటిపై సీబీఐ దర్యాప్తు మొదలవడం తెలిసిందే. ఆ రెండు దర్యాప్తులు సాగుతున్న తీరుపై మొదటినుంచీ సర్వత్రా పలు అనుమానాలు తలెత్తుతూనే ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతే ఏకైక లక్ష్యంగా ఆయన ఆస్తుల కేసు దర్యాప్తును ‘యుద్ధ ప్రాతిపదిక’న రేయింబవళ్లూ కొనసాగిస్తున్న సీబీఐ.. ఎమ్మార్ కుంభకోణంలో మాత్రం బాబు ప్రమేయం అడుగడుగునా కొట్టొచ్చినట్టుగా కన్పిస్తున్నా అసలే పట్టించుకోని వైనం రాష్ట్ర ప్రజలందరికీ కనిపిస్తూనే ఉంది. దీని వెనక దాగున్నది బహుశా ఈ ‘చిదంబర రహస్యమే’నన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. జగన్ ఉదంతంపై అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ నేతలే సంయుక్తంగా హైకోర్టులో కేసులు వేయడం, అక్కడి నుంచి సీబీఐ దర్యాప్తు దాకా అంతా ఆగమేఘాలపై జరిగిపోవ డం తెలిసిందే. ఎమ్మార్ దర్యాప్తులో తీగ లాగితే తన డొంకే కదులుతుం దని కలవరపడ్డ బాబు, జగన్ కేసుతో పాటు ఈ విషయంపై కూడా చిదంబరంతో రహస్య భేటీలో చర్చించారని భావిస్తున్నారు. గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన ఏఐసీసీ నాయకుడు ఒకరు ఈ విషయమై చేసిన వ్యాఖ్యలు కూడా ఈ అనుమానాలను ఊతమిచ్చేవిగానే ఉండటం విశేషం! ప్రైవేటు వ్యవహారాలు చక్కదిద్దుకునేందుకే ఆయన్ను బాబు రాత్రి మాటున గుట్టుగా కలుసుకున్నారని ఆయన గట్టిగా అభిప్రాయపడ్డారు. ఎంత చిన్న పని చేసినా, మీడియాను మేనేజ్ చేసి మరీ దానికి వీలైనంత ప్రచారం పొందేందుకు ప్రయత్నించే బాబు నైజాన్ని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి ఒకవేళ నిజంగానే రాష్ట్ర సమస్యలు తదితరాలపైనే చిదంబరాన్ని కలిసి ఉంటే, ఆ విషయాన్ని తక్షణం మీడియాకు పూసగుచ్చినట్టు చెప్పేవారని, దానికి వీలైనంత కవరేజీ ఇప్పించుకునేందుకు ప్రయత్నించేవారని వ్యాఖ్యానించారు. బాబు నిజంగా కలవనిదే కేంద్ర హోంమంత్రి వంటి బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి, ఏకంగా లోక్‌సభలో ఆ విషయాన్ని అంత ఎలా ఆషామాషీగా చెబుతారని ఆయన ప్రశ్నించారు. 2011 ఆగస్టులో రెండు రోజుల ఢిల్లీ పర్యటన సందర్భంగా బాబు ఒకరోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎస్పీజీ కమెండోలు, పోలీసు భద్రత లేకుండా ఒక ఎంపీ, తన వ్యక్తిగత భద్రతాధికారితో 


కలిసి రహస్యంగా వెళ్లి చిదంబరంతో అరగంట పాటు భేటీ అయినట్టు వార్తలు రావడం తెలిసిందే. ఎంపీని కూడా బయటికి పంపి ఒంటరిగానే మంతనాలు సాగించారని కూడా అప్పట్లో పలు చానళ్లు ప్రసారం చేశాయి. ఆ రాత్రి బాబును కలిసేందుకు ప్రయత్నించిన పలువురు టీడీపీ ఎంపీలకు కూడా ఆయన ఎక్కడున్నారన్న దానిపై ఏ సమాచారమూ తెలియలేదు. దాంతో ఆయనెటు వెళ్లి ఉంటారా అంటూ వారంతా లోతుగా ఆరా తీశారు కూడా! బాబు-చిదంబరం రహస్య భేటీ జరిగిన ఒకట్రెండు రోజులకే జగన్ సంస్థల్లో పెట్టుబడులు, ఎమ్మార్ కేసులపై హైకోర్టు తీర్పు వెలువడింది. ఆ తర్వాత వారం రోజులకే ఇటు జగన్‌పై, అటు ఎమ్మార్‌కు సంబంధించిన సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. జగన్ కేసు దర్యాప్తును సీబీఐ యుద్ధ ప్రాతిపదికన, తన చరిత్రలోనే ఎన్నడూ లేనంత వేగంగా ‘నానా కోణాల్లో’ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఎమ్మార్ కుంభకోణానికి మూల కారణమైన ఒప్పందం 2002లో చంద్రబాబు సీఎంగా ఉండగానే కుదరడం బహిరంగ రహస్యమే అయినా, హైదరాబాద్ నడిబొడ్డున ఏకంగా 535 ఎకరాల అతి విలువైన భూమిని ఒప్పందం ముసుగులో ఎమ్మార్‌కు ఆయన కారుచౌకగా కట్టబెట్టినా.. సీబీఐ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడమే లేదు. ఎమ్మార్ కేసులో 2004కు ముందు, ఒప్పందం కుదిరినప్పటి నుంచీ జరిగిన లావాదేవీలన్నింటిపైనా దర్యాప్తు జరపాలని ఎన్ని డిమాండ్లు వచ్చినా తనకు వినిపించనట్టే వ్యవహరిస్తోంది. పైగా, అది కుదరదంటూ న్యాయస్థానాల సాక్షిగా సీబీఐ తన వైఖరిని ఇప్పటికే వెల్లడించింది కూడా! కనీసం ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబును కనీసం విచారించడానికి కూడా అది సాహసించడం లేదు. ఈ వైఖరిపై అప్పట్లోనే రాజకీయ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. జగన్ విషయంలో ఓవర్‌టైమ్ పని చేస్తూ, ఎమ్మార్ కేసులో మాత్రం కొట్టొచ్చినట్టుగా కన్పిస్తున్న బాబు పాత్రపై విచారణ ఊసే ఎత్తని సీబీఐ తీరులో ఏదో మతలబు దాగుందన్న అనుమానాలు మొదటి నుంచీ వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యం నుంచి చూస్తే, బాబు తనను కలిశారన్న చిదంబరం తాజా ప్రకటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.

సర్కారుకు బాసట - ఎమ్మార్ కేసులో ఊరట

కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనానికి ముందు రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న ప్రతిపాదన తెరపైకి రావడం, ప్రధాన విపక్షం టీడీపీ ఈ విషయంలో తన బాధ్యతను విస్మరిస్తోందంటూ ఇతర పార్టీల నుంచి భారీగా విమర్శలు రావడం తెలిసిందే. 2011 జనవరిలోనే అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ ఇతర పక్షాలు టీడీపీపై బాగా ఒత్తిడి తెచ్చాయి. అయినా బాబు మాత్రం దానిపై ఎటూ తేల్చలేదు. పైగా ‘‘ఎవరో చెబితే పెడతామా? అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలో మాకు తెలుసు’’ అంటూ విషయాన్ని దాటవేశారు. అవిశ్వాసం పెట్టబోమని చిదంబరంతో రహస్య భేటీ కంటే ముందు చేసిన ఢిల్లీ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌కు బాబు చెప్పినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా ప్రభుత్వాన్ని కాపాడుతామంటూ పటేల్‌కు ఫోన్ చేసి మరీ బాబు భరోసా ఇచ్చారని ప్రచారం జరిగింది. ప్రభుత్వం పడిపోకుండా చూస్తామంటూ బాబు స్వయంగా ఫోన్ చేసి మరీ చెప్పడంతో ఎంతో విస్మయానికి లోనయ్యానని అహ్మద్ పటేలే తన సన్నిహితులతో వ్యాఖ్యానించారని అప్పట్లో కాంగ్రెస్ వర్గాలు కూడా చెప్పాయి! నాటినుంచీ బాబు ఏదో ఒక మిషతో ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారంటున్నారు. జగన్‌పై బాబు ఆరోపణలు, సీబీఐ విచారణ డిమాండ్ల నేపథ్యంలో బాబుపై కూడా సీబీఐ విచారణ జరగాలంటూ ఎన్నో డిమాండ్లు రావడం తెలిసిందే. సరిగ్గా ఈ నేపథ్యంలోనే చిదంబరంతో బాబు రహస్య భేటీ జరిగిందని చెబుతున్నారు. ‘‘అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోం. తద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పడిపోకుండా చూస్తాం. బదులుగా సీబీఐ కేసుల వ్యవహారంలో కేంద్రం నన్ను ఇబ్బందులపాలు చేయకుండా చూడండి’’ అంటూ బాబు కోరినట్టు తెలుస్తోంది.

గుట్టు విప్పడంపై ఆంతర్యం...?

బాబు తనను కలిసిన విషయాన్ని తొమ్మిది నెలల తర్వాత, అదీ లోక్‌సభలో చిదంబరం ఎందుకు బయట పెట్టాల్సివచ్చిందో అర్థంకాక టీడీపీ నేతలంతా తలపట్టుకుంటున్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ ముఖ్యులతో గురువారం దీనిపై బాబు తన నివాసంలో రెండు గంటలపాటు తర్జనభర్జన జరిపారు. దీనిపై విలేక రులతో ఎవరు, ఏం మాట్లాడాలా అంటూ మల్లగుల్లాలు పడ్డారు. చివరికి, మీడియాతో మాట్లాడి మరిన్ని ఇబ్బందులు తేవొద్దని నిర్ణయించారు. ఆ తర్వాత చిదంబరం వ్యాఖ్యలు అవాస్తవమంటూ బాబు ఒక ప్రకటన విడుదల చేసి సరిపెట్టడం తెలిసిందే. అయితే.. ఈ రహస్య భేటీపై ఆ మర్నాడే చానళ్లన్నీ కోడై కూస్తే, వాటిపై స్పందించాల్సిన అవసరం లేదని ఆ రోజు ఢిల్లీలో బాబు వ్యాఖ్యానించారు! నాటి ఎంపీ మైసూరారెడ్డి నివాసంలో టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి, నిమ్మల కిష్టప్ప, రమేశ్ రాథోడ్, వేణుగోపాలరెడ్డి, మాజీ ఎంపీ లాల్‌జాన్ బాషా తదితరుల సమక్షంలోనే విలేకరులతో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై సీబీఐ విచారణను ఓ విలేకరి ప్రస్తావించారు. సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పే మీరు, ఈ రోజు జగన్‌పై విచారణ జరపడాన్ని ఎలా చూస్తారని ప్రశ్నించగా, ‘అప్పటికీ ఇప్పటికీ ఎంతో వ్యత్యాసముంది’ అంటూ బాబు బదులిచ్చారు!

టీడీపీ నేతల ఆరా 

బయట పడకూడదనుకున్న విషయాన్ని చిదంబరం యాదృ చ్ఛికంగా బయటపెట్టారా, లేక లోక్‌సభలో టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు తీరుపై ఆగ్రహంతో వెల్లడించారా అంటూ పార్టీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు. దీని ఆంతర్యంపై ఆరా తీయాల్సింది ఢిల్లీలో ఉన్న పార్టీ నేతలను బాబు ఆదేశించినట్టు టీడీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. పార్టీకి చెందిన ఓ ఎంపీ కుమారుడి ద్వారా ‘చిదంబర’ రహస్యాన్ని తెలుసుకోవాలని బాబు కోరినట్టు విశ్వసనీయ సమాచారం. శుక్రవారం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన పొలిట్‌బ్యూరో భేటీలో దీనిపై బాబు వివరణ ఇస్తారని భావించామని టీడీపీ నేతలు కొందరు చెప్పారు. కానీ దీనిపై ఎక్కువ చర్చ పెడితే మరింతగా జనంలోకి వెళ్తుందన్న ఉద్దేశంతో ఎక్కువగా చర్చే జరగకుండా ఆయన జాగ్రత్త పడినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి
Share this article :

0 comments: