రాష్ర్టపతి ఎన్నికపై ‘అరెస్టు’ ప్రభావం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ర్టపతి ఎన్నికపై ‘అరెస్టు’ ప్రభావం!

రాష్ర్టపతి ఎన్నికపై ‘అరెస్టు’ ప్రభావం!

Written By news on Thursday, May 31, 2012 | 5/31/2012

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ఈ పరిణామం రాష్ట్రపతి ఎన్నికలు సహా జాతీయ రాజకీయాలలో పెనుమార్పులను కలుగజేయగలిగేది. కీలకమైన ఉప ఎన్నికలకు ముందు జరిగిన ఈ అరెస్టు తదుపరి పరిణామాలను బట్టి చూస్తే, వైఎస్సార్‌సీపీ ధాటికి కాంగ్రెస్, టీడీపీల అభ్యర్థులు డిపాజిట్లు దక్కించుకోగలిగితే అద్భుతమే. యూపీఏ రెండు వరుస విజయాలను సాధించడానికి కారణమైన ఆంధ్రప్రదేశ్‌లో, నేడు రాజకీయ పరిణామాలు అతివేగంగా జరుగుతున్నాయి. 

అవినీతి ఆరోపణలతో జగన్ ఇప్పుడు జైల్లో ఉంటే ఉండొచ్చుగానీ, ప్రజల దృష్టిలో మాత్రం ఆయన రాజకీయ వేధింపులకు గురవుతున్న నేత. తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్న పలువురు యూపీఏ నేతల జోలికి పోకుండా, జగన్‌పై ఆరోపించిన అక్రమ ఆర్జనలో భాగస్వాములై ఉండాల్సిన రాష్ట్ర మంత్రులను వదిలి యువనేతను సీబీఐ అరెస్టు చేసింది. దీంతో ఆయన అరెస్టుపట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్‌పై రాజకీయ కక్షతోనే కాంగ్రెస్, తన ప్రభుత్వాధికారాన్ని ప్రయోగించి సీబీఐ సహాయంతో ఆయనను కేసుల్లో ఇరికించిందన్న అభిప్రాయాన్ని అది కలుగజేస్తోంది. 

జూన్ 12 ఉప ఎన్నికల్లో జగన్ అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తే, రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటాయి. కాంగ్రెస్ నేతలు తిరుగుబాటు చేసి జగన్ పక్షాన చేరడాన్ని నివారించడం నాయకత్వానికి అసాధ్యమవుతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఓటింగ్ చేయమని జగన్ రాష్ట్రంలోని 33 మంది కాంగ్రెస్ ఎంపీలకు పిలుపునిస్తే, మాజీ స్పీకర్ పీఏ సంగ్మా విజయావకాశాలు మెరుగవుతాయి. కాంగ్రెస్, తమకు ఆమోదయోగ్యమైన అభ్యర్థిని నిలపకపోతే యూపీఏ మిత్ర పక్షాలు సైతం సంగ్మావైపు మొగ్గవచ్చు. ఇప్పటికే జయలలిత, నవీన్ పట్నాయక్‌ల మద్దతు సంగ్మాకు ఉంది. కాబట్టి, రాష్ట్రపతి ఎన్నికలు జాతీయ రాజకీయాలలో పెను మార్పుకు కీలకమవుతాయి. ఆ మార్పుకు తొలి సూచన జూన్ 15న ఆంధ్రప్రదేశ్‌లో కనిపించే అవకాశం ఉంది. 
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో...)
Share this article :

0 comments: