మీడియా గొంతు నొక్కితే.. ప్రజలే బుద్ధి చెప్తారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మీడియా గొంతు నొక్కితే.. ప్రజలే బుద్ధి చెప్తారు

మీడియా గొంతు నొక్కితే.. ప్రజలే బుద్ధి చెప్తారు

Written By news on Friday, May 18, 2012 | 5/18/2012


సర్కారు కక్ష సాధింపులు సరికాదు: కోదండరామ్
{పభుత్వానిది వ్యక్తిగత కక్ష: ఆర్.కృష్ణయ్య
సాక్షి ఖాతాలను స్తంభింపచేయటం పత్రికా స్వేచ్ఛకు భంగమే: అమ్జదుల్లాఖాన్
జర్నలిస్టుల ఆందోళనకు తెలంగాణ జేఏసీ,
బీసీ సంక్షేమ సంఘం, ఎంబీటీ మద్దతు
ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్ విగ్రహానికి
క్షీరాభిషేకం చేసి జర్నలిస్టుల నిరసన

హైదరాబాద్, న్యూస్‌లైన్: మీడియా గొంతు నొక్కిన వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారని పలు ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. మీడియాపై సర్కారు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని తెలంగాణ రాజకీయ సంయుక్త కార్యాచరణ కమిటీ చైర్మన్ కోదండరామ్ ఖండించారు. ‘సాక్షి’ కలాన్ని, గళాన్ని అణచివేసేందుకు సర్కారు, సీబీఐ చేస్తున్న కుట్రలపై జర్నలిస్టులు చేపట్టిన ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. జర్నలిస్టులకు సంఘీభావంగా కోదండరామ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా ఉద్యోగుల భద్రతపై భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. సాక్షి ఉద్యోగుల డిమాండ్లపై జేఏసీ స్టీరింగ్ కమిటీలో చర్చిస్తామని, వారు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని కోదండరామ్ ప్రకటించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య, ఎంబీటీ కార్పొరేటర్ అమ్జదుల్లాఖాన్ తదితరులు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. అనంతరం అక్కడే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, పూలమాలలు వేశారు. సాక్షి మీడియాపై ప్రభుత్వం ముప్పేట దాడిని వారు తీవ్రంగా ఖండించారు.

ప్రజా సమస్యలను గాలికి వదిలేసి.. వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కిరణ్ సర్కారుకు ఉప ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. జర్నలిస్టులకు జనం అండ ఉంటుందని కృష్ణయ్య పేర్కొన్నారు. నియంతలైన ముబారక్‌ను తరిమినట్లే కాంగ్రెస్ సర్కార్‌ను ప్రజలు తరమటం ఖాయమన్నారు. గత ఎన్నికల్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. సీబీఐ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారొద్దని కృష్ణయ్య సూచించారు. సాక్షి మీడియా బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయటం పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించటమేనని ఎంబీటీ కార్పొరేటర్ అమ్జదుల్లాఖాన్ పేర్కొన్నారు. మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలను సర్కారు మానుకోవాలని హితవు పలికారు. సాక్షికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. 

Share this article :

0 comments: