సిబిఐ ఉద్దేశం వివరించిన జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సిబిఐ ఉద్దేశం వివరించిన జగన్

సిబిఐ ఉద్దేశం వివరించిన జగన్

Written By news on Monday, May 28, 2012 | 5/28/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సిబిఐ కోర్టులో ఈరోజు సిబిఐ అరెస్టు వెనుక ఉద్దేశాన్ని న్యాయమూర్తికి విరించారు. ' ప్రస్తుతం రాష్ట్రంలో 18 శాసనసభ, ఒక లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగానేకాక దేశవ్యాప్తంగా దీనిపై ఆసక్తి నెలకొంది. నేను ప్రచారంలో పాల్గొనకుండా ఉండేందుకే సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చాను. కోర్టుకు సమర్పించిన కేసుడైరీ చూస్తే అన్ని విషయాలూ మీకు తెలుస్తాయి. అడ్డదిడ్డంగా సీబీఐ కొన్ని ప్రశ్నలు వేసింది. అందుకే కొన్నిసార్లు మౌనంగా ఉన్నాను. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నాను. అయినా సిబిఐ ఏదో సాకు చూపుతోంది. ఇదే కేసులో సీబీఐ కోర్టు మిగతావారికి సమన్లు జారీచేసింది. వ్యక్తిగత పూచీకత్తుతో మిగతా నిందితులను విడిచిపెట్టింది. నన్నుకూడా అదే విధంగా కోర్టు వదిలేస్తుందని సీబీఐ అరెస్టు చేసింది. నాపై ఈ కేసు ఎందుకు పెట్టారో తెలియదు. ఇది ఒక పొలిటికల్ డ్రామా. నేను ఒక పార్టీ అధ్యక్షుడిని. మూడురోజలుగా సీబీఐ విచారణకు సహకరించాను. ఆదివారం కూడా విచారణకు పిలిచారు. సీబీఐ అధికారులు అనుకున్న విధంగా సమాధానం చెప్పలేదనే విచారణకు సహకరించడంలేదని చెప్తున్నారు.

సాక్షి పత్రిక దేశంలోనే ఎనిమిదో స్థానంలో ఉంది. సాక్షి పత్రికకు విలువ లేదా? 350 రూపాయలకు షేరు అమ్మడం తప్పా? ఈనాడు 100 రూపాయల షేరును 5 లక్షల 28 వేల రూపాయలకు అమ్మలేదా? ఈనాడు విలవును 6,800 కోట్ల రూపాయలుగా చెప్పారు. అందులో సగమే మా సంస్థ విలువ. ఇది సీబీఐకి తప్పుగా కనిపించలేదా? టూఐ క్యాపిటల్‌లో సీబీఐ చెప్పినట్టు 1045 కోట్లు పెట్టుబడి పెట్టలేదు. 120 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టారు. హవాలా ద్వారా పెట్టుబడి పెట్టారని సీబీఐ చెప్తోంది. నా వాటాలు నేనెందుకు రెట్టింపు ధరతో కొనక్కుంటాను. నాకు బాధ అనిపిస్తోంది. ఈనాడుకు ఉన్న విలువ సాక్షికి లేదా? నేను సహకరించడంలేదని చెప్పడం నిజం కాదు విచారణకు సంబంధించి వీడియో రికార్డులు ఉన్నాయి.' అని జగన్ కోర్టుకు వివరించారు.
Share this article :

0 comments: