వారి చేతిలో అధికారముంది. దాని అండతో నాపై ముప్పేట దాడి చేస్తున్నారు. కానీ దేవుడు నావైపు ఉన్నాడు. ప్రజలు నావైపు ఉన్నారు. రాష్ట్రంలో విపక్షంగా కాంగ్రెస్‌తో పోరాడుతున్నాం. ఆ పార్టీలోకి తిరిగి వెళ్లే ప్రశ్నే తలెత్తదు. అది ముగిసిన అధ్యాయం. జాతీయ మీడియా ఇంటర్వ్యూల్లో జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వారి చేతిలో అధికారముంది. దాని అండతో నాపై ముప్పేట దాడి చేస్తున్నారు. కానీ దేవుడు నావైపు ఉన్నాడు. ప్రజలు నావైపు ఉన్నారు. రాష్ట్రంలో విపక్షంగా కాంగ్రెస్‌తో పోరాడుతున్నాం. ఆ పార్టీలోకి తిరిగి వెళ్లే ప్రశ్నే తలెత్తదు. అది ముగిసిన అధ్యాయం. జాతీయ మీడియా ఇంటర్వ్యూల్లో జగన్

వారి చేతిలో అధికారముంది. దాని అండతో నాపై ముప్పేట దాడి చేస్తున్నారు. కానీ దేవుడు నావైపు ఉన్నాడు. ప్రజలు నావైపు ఉన్నారు. రాష్ట్రంలో విపక్షంగా కాంగ్రెస్‌తో పోరాడుతున్నాం. ఆ పార్టీలోకి తిరిగి వెళ్లే ప్రశ్నే తలెత్తదు. అది ముగిసిన అధ్యాయం. జాతీయ మీడియా ఇంటర్వ్యూల్లో జగన్

Written By news on Thursday, May 10, 2012 | 5/10/2012

* సాక్షి ఖాతాల స్తంభన అప్రజాస్వామికం 
* సీబీఐ.. కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్
* ఈ కుట్రపై సాక్షి కుటుంబమంతా సమష్టిగా పోరాడుతుంది
* పెట్టుబడులపై దర్యాప్తుకు, కరెంట్ ఖాతాలకు సంబంధమేమిటి?
* పత్రికను మూసేసి, సిబ్బందిని నిరుద్యోగులను చేయదలిచారా?
* సాక్షిలో ఎవరూ పెట్టుబడులు పెట్టొద్దా? ఇన్వెస్టర్లంతా దిగ్గజాలు.. వారిని నా బినామీలంటారా.. వారు తలచుకుంటే నన్నే కొనగలరు
* ఎమ్మార్‌పై బాబును సీబీఐ కనీసం ప్రశ్నించదెందుకు?

హైదరాబాద్, న్యూస్‌లైన్: సాక్షి కరెంట్ ఖాతాల స్తంభనను కనీవినీ ఎరగని అప్రజాస్వామిక చర్యగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభివర్ణించారు. సీబీఐ పూర్తిగా కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారిందని, ఫక్తు రాజకీయ ప్రేరేపిత దర్యాప్తు సాగిస్తోందని పేర్కొన్నారు. ఈ కుట్రపై సాక్షి కుటుంబమంతా సమష్టిగా పోరాడుతుందని పునరుద్ఘాటించారు. సాక్షి ఉనికిని దెబ్బ తీసేందుకు టీడీపీ;కాంగ్రెస్;ఈనాడు-ఆంధ్రజ్యోతి-టీవీ9ల అపవిత్ర కూటమి శాయశక్తులా ప్రయత్నిస్తోందంటూ జగన్ మండిపడ్డారు. అధికారం అండతో కాంగ్రెస్ తనపై ముప్పేట దాడి చేస్తోందని బుధవారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దుయ్యబట్టారు. ‘‘రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రజలకు పూర్తిగా తెలుసు. వారే నిర్ణేతలు. ఉప ఎన్నికల్లో వారి తీర్పు ఎలా ఉండనుందో చూస్తూండండి’’ అని పేర్కొన్నారు. చట్టానికి కట్టుబడే పౌరునిగా సీబీఐ సమన్లపై కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవుతానని స్పష్టం చేశారు. సీఎన్‌ఎన్-ఐబీఎన్, టైమ్స్ నౌ, హెడ్‌లైన్స్ టుడే, ఎన్డీటీవీలకు జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూల సారాంశం...

సాక్షి ఖాతాలను సీబీఐ స్తంభింపజేయడంపై ఏం చేయనున్నారు?
కోర్టుకు వెళ్తాం. మా వాదనలు విన్పిస్తాం. ఈ న్యాయ పోరాటానికి మీడియా అంతా కూడా మద్దతివ్వాలి. ఇది చాలా అప్రజాస్వామికం. కనీవినీ ఎరగని దారుణం. సీబీఐ తీరులో రాజకీయ స్వభావమే దాగుంది. అసలు దాని దర్యాప్తే రాజకీయ ప్రేరేపితం. సీబీఐ దర్యాప్తు సంస్థ ఇప్పుడింకెంత మాత్రమూ సీబీఐ కాదు. కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారిపోయింది. నాలుగేళ్ల క్రితం సాక్షిలోకి వచ్చిన పెట్టుబడులపై జరుగుతున్న దర్యాప్తుకు, సంస్థ కరెంట్ ఖాతాల స్తంభనకు ఏం సంబంధముంది? అసలు వారేం చేయదలచుకున్నారు? పత్రికను మూసేయాలనుకుంటున్నారా? అందులో పని చేస్తున్న 20 వేల మందిని నిరుద్యోగులుగా మార్చాలనుకుంటున్నారా? సాక్షి ఏమీ బూటకపు సంస్థో, కర పత్రికో కాదు. చానల్, పత్రిక కూడా ఉన్న ఒక పెద్ద మీడియా సంస్థ. 14.5 లక్షల సర్క్యులేషన్, 1.46 కోట్ల మంది పాఠకులతో సాక్షి పత్రిక దేశంలోనే 8వ స్థానంలో ఉంది. దానిలోని పెట్టుబడులపై ఏ రకంగా కూడా వేలెత్తి చూపేందుకు ఆస్కారమే లేదు. 

సాక్షి తన వాటాలను ఇన్వెస్టర్లకు విక్రయించడానికి ఏడు నెలల ముందే ‘ఈనాడు’ తన విలువను రూ.6,800 కోట్లుగా మదింపు చేసుకుంది. అప్పటికే ఆ పత్రికకు రూ.1,800 కోట్ల సంచిత నష్టాలున్నాయి! పైగా ఆ రోజున దాని సర్క్యులేషన్ 10 లక్షలే!! అయినా రూ.100 షేరును ఏకంగా రూ.5.28 లక్షల ప్రీమియంకు అమ్ముకుంది! సాక్షిని మేం ‘ఈనాడు’లో సగం విలువకే మదింపు చేశాం. ఇన్వెస్టర్లు మా సంస్థలో పెట్టుబడులు పెట్టారు. అయినా కొందరికి అందులో తప్పు కనిపిస్తోంది! నిజానికిక్కడ జరుగుతున్నది రాజకీయ ప్రతీకార చర్య మాత్రమే.

సాక్షిలోకి క్విడ్ ప్రొ కొ మార్గంలో నిధులొచ్చాయన్న సీబీఐ ఆరోపణలపై మీరేమంటారు 
అంటే వీరనేదేమిటి? రాష్ట్రంలో ఏ ఇన్వెస్టరూ సాక్షిలో పెట్టుబడి పెట్టొద్దా? ఇది హాస్యాస్పదం. నేను ఫలానా వ్యక్తి కుమారుడిని అయినందుకు నా వ్యాపారాలన్నీ బూటకమంటారా? నేను వ్యాపారం చేస్తున్న కారణంగా మా నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టను, నా ప్రతిష్టను దెబ్బ తీసే హక్కు ఎవరికీ లేదు. మేం చరిత్ర సృష్టించాం. ఇండియా సిమెంట్స్, ల్యాంకో, రాంకీ, పెన్నా వంటి దిగ్గజాలు సాక్షిలో పెట్టుబడులు పెట్టాయి. వారందరికీ ఒకే ధరకు షేర్లు కేటాయించాం. మా ప్రాంగణాలన్నింటిపైనా ఎడాపెడా దాడులు జరిపిన సీబీఐకి.. ఈ ఇన్వెస్టర్లకు సంబంధించిన షేర్లేమైనా ఆ సందర్భంగా దొరికాయా? లేదే! అసలు ఇండియా సిమెంట్స్, లాంకో, రాంకీ వంటివారు తలచుకుంటే నన్ను కొనేయగలరు. అలాంటి వారు నా బినామీలని సీబీఐ ఎలా అనగలదు? ఆరోపణలకు కూడా ఓ హద్దుండాలి. 

క్విడ్ ప్రొ కొ ఉదంతం కోర్టులో విచారణలో ఉంది. నిజానిజాలు అక్కడే తేలతాయి. కానీ దానికి, సాక్షి కరెంట్ ఖాతాల స్తంభనకు అసలేం సంబంధముంది? 20 వేల మంది ఉద్యోగుల ప్రయోజనాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షితో ముడిపడి ఉన్నాయి. వారికి రాజకీయాలతో ఏ సంబంధమూ లేదు. అదీగాక నేనిప్పుడు కంపెనీ చైర్మన్‌ను కూడా కాదు. 9 నెలలుగా సీబీఐ జరుపుతున్న దర్యాప్తుకు వారడిగినవన్నీ ఇచ్చి సహకరిస్తూ వస్తున్నాం. కానీ ఈ 9 నెలల్లో సీబీఐ ఏం సాధించింది? అది స్వతంత్రంగా వ్యవహరిస్తోందో, లేదో దర్యాప్తు సాగుతున్న తీరే చెబుతోంది. చంద్రబాబు, ఈనాడులపై ఉన్న కేసుల దర్యాప్తులో సీబీఐ ఇలాగే వ్యవహరిస్తోందా? ఎమ్మార్ కుంభకోణంలో బాబు పాత్రపై ఇప్పటిదాకా కనీసం దర్యాప్తు కూడా చేయలేదు!

వాస్తవమేమిటంటే.. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 కలయికతో ఒక అపవిత్ర కూటమి ఏర్పడింది. ఈ 3 రకాల శక్తులకూ సాక్షి ఉనికి అస్సలు ఇష్టం లేదు. సాక్షి లేకుంటే పోటీయే లేకుండా పోతుందన్నది వాటి ఉద్దేశం. అందుకే సాక్షిని దెబ్బ తీసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ మంత్రి నాపై కోర్టుకు వెళ్తే, అందులో టీడీపీ ఇంప్లీడ్ అయింది!

సమన్లపై మీ స్పందనెలా ఉంటుంది? కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవుతారా? అరెస్టును తప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారంటున్నారు?
నేను చట్టానికి కట్టుబడి ఉండే పౌరున్ని. కచ్చితంగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతా. దేవునిపై నాకు విశ్వాసముంది. నేనేం చేయాలో సరిగ్గా అదే చేస్తున్నాను. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్‌ను వీడినందుకే వేధింపులన్నీ మొదలయ్యాయి.

మే 28న మిమ్మల్ని అరెస్టు చేస్తారంటారా?
ఎవరైనా అసలు నన్నెందుకు అరెస్టు చేయాలి? నేను చేసిన తప్పేమిటి? రాజకీయంగా నేను వేరే వైఖరి తీసుకున్నంత మాత్రాన నా ప్రతిష్టను దెబ్బ తీసే స్వేచ్ఛ వారికి వచ్చేస్తుందా?

సీబీఐ విచారణలో ప్రభుత్వ పాత్రేమీ లేదని సీఎం అంటున్నారు! కాంగ్రెస్‌తో పోరాడతారా? లేక ఆ పార్టీ స్నేహ హస్తం చాస్తే తిరిగి వెళ్తారా?
పోరాడుతున్నది నేను కాదు. వాళ్లే నాపై దాడి చేస్తున్నారు. వారి చేతిలో అధికారముంది. దాని అండతో నాపై ముప్పేట దాడి చేస్తున్నారు. కానీ దేవుడు నావైపు ఉన్నాడు. ప్రజలు నావైపు ఉన్నారు. రాష్ట్రంలో విపక్షంగా కాంగ్రెస్‌తో పోరాడుతున్నాం. ఆ పార్టీలోకి తిరిగి వెళ్లే ప్రశ్నే తలెత్తదు. అది ముగిసిన అధ్యాయం. 

సాక్షి ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లేమైనా చేస్తున్నారా?
ఇది ధర్మ పోరాటం. సాక్షి కుటుంబం మొత్తం ముందుండి ఈ పోరాటాన్ని చివరిదాకా ముందుకు తీసుకెళ్తుంది.

ప్రస్తుత పరిణామాల వల్ల సాక్షి సర్క్యులేషన్‌పడిపోతుందని భయపడుతున్నారా?
లేదు. నిజానికి సర్క్యులేషన్ పెరుగుతుంది.

ఉప ఎన్నికల ముందు ఇలాంటి పరిణామం మీ విజయావకాశాలపై ప్రభావం చూపదా? ఎన్ని స్థానాలు గెలుస్తామనుకుంటున్నారు?
అలా సంఖ్యను చెప్పదలచుకోలేదు. కానీ ఉప ఎన్నికల ఫలితాలను మీరే చూస్తారుగా! 18 అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే మొత్తం 24 అసెంబ్లీ స్థానాల పరిధిలో అన్నమాట! ప్రజలే నిర్ణేతలు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో వారందరికీ తెలుసు. దాని ప్రకారమే ఓటేస్తారు. దేవుడు నా వైపున్నాడు.
Share this article :

0 comments: