ప్రజా విజయం ఆమె ధ్యేయం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజా విజయం ఆమె ధ్యేయం!

ప్రజా విజయం ఆమె ధ్యేయం!

Written By news on Wednesday, May 30, 2012 | 5/30/2012

2014లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న లక్ష్యంతో అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతూ, తమ రాజకీయ ప్రత్యర్థులను భయకంపితులను చేయడానికి పూనుకున్న సోనియాగాంధీ తొలుత మన రాష్ట్రాన్ని తన రాజకీయ పోరాట వేదికగా ఎంచుకుని పావులను కదుపుతోంది. ఈ కుతంత్రాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కోవడానికి విజయమ్మ ఇప్పుడు పుట్టెడు దుఃఖంలోనూ రంగప్రవేశం చేయక తప్పడంలేదు. సహజసిద్ధమైన పోరాట కుటుంబానికి చెందిన కోడలిగా, తల్లిగా, తెలుగు ప్రజల ఆశాజ్యోతిగా నిలుస్తున్నారు.

సోనియాగాంధీ, రిలయెన్స్ ముఖేష్ అంబానీ, చంద్రబాబు, రామోజీరావు, చిదంబరం, అహ్మద్ పటేల్.. తదితరులు వైఎస్ మరణం తరువాత ఇష్టా రాజ్యంగా తమ విధానాలు కొనసాగించుకోవచ్చని కలలు కన్నా రు. తమకిక ఎలాంటి అడ్డంకులుండవని భావించారు. కానీ, వైఎస్ అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాల స్ఫూర్తిని కాపాడ టానికి, కొనసాగించడానికి జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ రంగప్రవేశం చేయడంతో వారి ఆశలు అడియాసలయ్యా యి. ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో నడుచుకునే మన్మోహ న్‌సింగ్, అహ్లువాలియాల ప్రజావ్యతిరేక విధానాలకు భిన్నంగా గ్రామీణాభివృద్ధి, రైతుల సంక్షేమం, జలవనరుల వినియోగం, సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాల కొనసాగింపు లక్ష్యంగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల్లోకి చొచ్చుకుపోయారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వైఎస్ రూపొం దించిన కార్యక్రమాలు నీరుగారిపోకుండా ఉండాలంటే మాట తప్పని, మడమతిప్పని వైఎస్సార్ రాజకీయ వార సునిగా జగన్ కొనసాగాలని ప్రజలు ఆకాంక్షించారు. 

జగన్ ఓదార్పు యాత్రకు, ఆయన చేపట్టిన దీక్షలకు, పాదయాత్రలకు, పోరాటాలకు ప్రజలు ముక్తకంఠంతో తమ మద్దతు తెలిపారు. ఈ పరిణామం ఎంతమాత్రం రుచించని కాంగ్రెస్ అధిష్టానవర్గం, అంబానీ, రామోజీ రావు, చంద్రబాబుల అండదండలతో జగన్‌పై ఎన్నెన్నో కుట్రలు, కుతంత్రాలకు పాల్పడ్డారు. సీబీఐ చేత విచారణ జరిపించి చివరికి జైలుకు పంపారు. సీబీఐ విచారణ ప్రహసనంలాగా సాగి అపహాస్యం పాలైంది. సీబీఐపై సమరశీల పోరాటాన్ని గతంలో ఏనాయకుడూ ఇంత ధైర్యంగా, ఇంత పట్టుదలగా చేయలేదు. తాను తలపడుతున్నది స్వయానా సోనియాగాంధీ నాయకత్వంతో అని తెలిసి తెలిసీ జగన్ పూరించిన సమరశంఖం ఢిల్లీ పెద్దల తలలు తిరిగేటట్లు చేసింది. గతంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాం ధీ, సోనియాగాంధీలపై రామోజీరావు పత్రికను అడ్డం పెట్టుకుని అదేపనిగా చేసిన దాడులను మరచిపోయిన చంద్రబాబు, ఇప్పుడు సోనియాగాంధీతో కుమ్మక్కయిన తీరును గమనించిన ప్రజలు అసహ్యించుకుంటున్నారు. 

తన భర్తను పోగొట్టుకొని.. అనేక వేధింపులు, సాధిం పులు, అవమానాలను ఎదుర్కొంటున్న విజయమ్మను సోనియాగాంధీ చర్యలు తీవ్రంగా కలచివేశాయి. తన భర్త కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా ఉంటూ ఇందిర, రాజీవ్, సోనియాల నాయకత్వాన్ని బలపరుస్తూ చివరకు 2014లో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్న తన అభీష్టాన్ని వెల్లడించారు. తన ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాలకు ఇందిర, రాజీవ్‌ల పేర్లు పెట్టారు. రాజీవ్ గాంధీ మరణానంతరం రాహుల్ గాంధీ, ప్రియాంకల భవిష్యత్తు ముఖ్యమని భావించిన సోనియా కాంగ్రెస్ పార్టీ వ్యవహా రాలకు దూరంగా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో రాష్ట్రంలో బల హీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు వైఎస్ పడిన కష్టాలు రాయాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది. 
రామోజీరావు విషపుత్రికలు ఈనాడు, ఈటీవీల నుంచి కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడానికి వైఎస్ ప్రారంభించిన ‘సాక్షి’ పత్రికపై అభాండాలు, అభూత కల్పనలు విజయమ్మను సహజంగానే కలవరపరిచాయి. 

‘సాక్షి’ పత్రికకు వైఎస్ వేసిన పునాదులు గట్టివి కావడంవల్లే అది శీఘ్రగతిన అభివృద్ధిచెంది పాఠకుల మన్ననలకు పాత్రమై కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులను దిమ్మతిరిగేలా చేసింది. నేడు ‘సాక్షి’ తెలుగు ప్రజల పురోగమనానికి ఒక సంకేతమైంది. 

సాక్షిని నిరోధించడానికి అంబానీ, సోనియా, చంద్రబాబు, రామోజీ చతుష్టయం రచించిన కుట్ర నేడు బహిర్గతమైంది. సాక్షిని నిలువరిస్తే, జగన్‌మోహన్‌రెడ్డిని నిర్బం ధిస్తే తమకు ఇక తిరుగు ఉండదని భావించి ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలిచ్చి... నిస్సిగ్గుగా జగన్‌పై అసత్య ప్రచారానికి ఒడిగట్టారు. అక్రమ పెట్టుబడులు సాక్షిలో ఉన్నాయంటూ ఏమాత్రం సాక్ష్యాధారాలు లేని ఆరోప ణలు చేస్తూ, అవి న్యాయస్థానంలో బెడిసి కొడతాయని తెలిసినప్పటికీ పథకం ప్రకారం జగన్‌ని జైలు పాలు చేశారు. జగన్ జైలుకు వెళ్లడంపై ఈనాడు, దాని తోక పత్రిక చంకలు గుద్దుకుంటే మనం ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. అదేవిధంగా సోనియా, మన్మోహన్, అహ్లూవాలియాల స్థానిక తైనాతీలు కిరణ్, బొత్సలు కుప్పిగంతులు వేయడం విజయమ్మను ఎంతగా వేదనకు గురిచేసిందో కోట్లాది మంది ప్రజలు టీవీల్లో ప్రత్యక్షంగా వీక్షించారు. 
వైఎస్సార్ పార్టీ కార్యకర్తల్లో మనో ధైర్యాన్ని నింపడానికి, పెల్లుబుకుతున్న పుట్టెడు దుఃఖాన్ని ఆపుకుంటూ విజయమ్మ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడం శుత్రు శిబిరం గుండెల్లో గునపాలను దించింది. జగన్ అరెస్టుతో ఎంతో ఉద్వేగానికి, ఆవేదనకు గురైన తెలుగు ప్రజలు విజయమ్మకు జేజేలు పలకడానికి సిద్ధంగా ఉన్నారు. 

వైఎస్ అర్ధాంగిగా ఆయన కార్యరంగాన్ని దగ్గరగా, నిశితంగా పరిశీలించిన విజయమ్మకు పోరాట యోధుల కుటుంబాలలోని వీరవనితలకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. తన భర్త వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి సోనియా అనుమతిని అడగడానికి ఆమె తొలుత తటపటాయించారు. కానీ, గౌరవం కొద్దీ కన్న కొడుకును వెంట పెట్టుకుని సోనియాగాంధీ ఇంటికి వెళ్లారు. అక్కడ సోనియాగాంధీ ప్రదర్శించిన నిర్లక్ష్యం సహించలేకపోయారు. 

వైఎస్ మరణం తరువాత సోనియాగాంధీ రాష్ట్రంలో పర్యటించడానికి సైతం వెనుకాడుతున్నారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితుల్లో ఇందిర, రాజీవ్, సోనియాలను రాష్ట్రానికి ఆహ్వానించి వారి బహిరంగ సభలను, ఎన్నికల ప్రచార సభలను విజయవంతం చేసిన ఖ్యాతి వైఎస్‌కే దక్కుతుంది. మరి నేడు సోనియా, రాహుల్ పర్యటనలు రాష్ట్రంలో కనుమరుగు కావడానికి కారణాలేమిటి? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డురోజులు దాపురించాయనే అంచనాలకు ఆ పార్టీ అధినాయకత్వం వచ్చిందంటే అందుకు దారితీసిన పరిస్థితులేమిటి? తప్పులు చేయడం రాజకీయాల్లో సహజం. అవగాహన లేక జరిగిన తప్పులను సవరించుకోవచ్చు కానీ, తెలిసి తెలిసీ చేసే తప్పులను సవరించుకోలేం. గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో గవర్నర్ రామ్‌లాల్, నాదెండ్ల భాస్కర్‌రావు ఎన్టీఆర్‌ను అక్రమంగా పదవీచ్యుతున్ని చేసినప్పుడు ఆయనకు బాసటగా ప్రజలు నిలిచారు. ఇప్పుడు తిరిగి జగన్‌కు బాసటగా నిలుస్తున్నారు. రాజశేఖరరెడ్డి కుటుంబానికి గల ప్రజాబలాన్ని చూసి తట్టుకోలేక సోనియా కుతంత్రాలు పన్ని జగన్‌ను నిలువరించాలనుకోవడం ఎంత వరకు న్యాయమని విజయమ్మ వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కోడలును కూతురుగా భావించే మన సంప్రదాయం ప్రకారం మన దేశ ప్రజలు ఇటలీ దేశస్థురాలైనప్పటికీ సోనియాను ఆదరించారు. అభిమానించారు. 

2014లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న లక్ష్యంతో అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతూ, తమ రాజకీయ ప్రత్యర్థులను భయకంపితులను చేయడానికి పూనుకున్న సోనియాగాంధీ తొలుత మన రాష్ట్రాన్ని తన రాజకీయ పోరాట వేదికగా ఎంచుకుని పావులను కదుపుతోంది. ఈ కుతంత్రాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కోవడానికి విజయమ్మ ఇప్పుడు పుట్టెడు దుఃఖంలోనూ రంగప్రవేశం చేయక తప్పడం లేదు. సహజసిద్ధమైన పోరాట కుటుంబానికి చెందిన కోడలిగా, తల్లిగా, తెలుగు ప్రజల ఆశాజ్యోతిగా నిలుస్తున్నారు. ఒక కుటుంబం తమ సర్వస్వమూ త్యాగం చేసి తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా భరించడానికి పోరాట పటిమతో ప్రజల ముందుకు వచ్చింది. ఇక ఆ కుటుంబాన్ని, వైఎస్ అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత తెలుగు ప్రజలదే. ఉప ఎన్నికలు జరుగుతున్న 18 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు అఖండ విజయాన్ని కానుకగా అందించ బోతున్న శుభ తరుణంలో విజయమ్మ ఎన్నికల బరిలోకి నేరుగా దిగడం ఆ పార్టీకి మరింత శుభాన్ని చేకూర్చడం తథ్యం. 
Share this article :

0 comments: