జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు కోర్టు ఉద్యోగులు, న్యాయవాదులు క్యూ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు కోర్టు ఉద్యోగులు, న్యాయవాదులు క్యూ

జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు కోర్టు ఉద్యోగులు, న్యాయవాదులు క్యూ

Written By news on Tuesday, May 29, 2012 | 5/29/2012

* వినమ్రంగా, చేతులు జోడించి చిరునవ్వుతో పలకరించిన జననేత
* అండగా ఉంటామంటూ ధైర్యం చెప్పిన మహిళా న్యాయవాదులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి హాజరైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు కోర్టు ఉద్యోగులు, న్యాయవాదులు క్యూ కట్టారు. సోమవారం ఉదయం పదిన్నరకు కోర్టుకు హాజరైన జగన్‌ను చూసేందుకు వారు పరుగులు తీశారు. ఆయన కోర్టు హాలులోకి ప్రవేశించేప్పుడు కరచాలనం చేసేందుకు న్యాయవాదులు ముందుకు వచ్చారు. ఆయనతో ఆత్మీయంగా మాట్లాడారు. పోలీసులు నెట్టేస్తున్నా వారు వెనక్కి తగ్గకుండా జగన్‌తో కరచాలనం చేశారు. 

మధ్యాహ్న భోజన సమయంలో 12.30 నుంచి సాయంత్రం 4 గంటలకు తిరిగి కోర్టు ప్రారంభమయ్యే వరకూ సీబీఐకి చెందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ల గదిలో ఉన్న జగన్‌ను కలిసేందుకు పలు న్యాయస్థానాల ఉద్యోగులు, న్యాయవాదులు క్యూ కట్టారు. పెద్ద సంఖ్యలో మహిళా న్యాయవాదులు వెళ్లి జగన్‌ను చూసి వచ్చారు. ‘అన్నా! మీకు మేం అండగా ఉంటాం. ప్రభుత్వం, సీబీఐ కుట్రలు కుతంత్రాల నుంచి మీరు నిర్దోషిగా బయటకు వస్తారు. మీరేమీ దిగులు చెందొద్దు’ అని జగన్‌కు తాము చెప్పామని కొందరు మహిళా న్యాయవాదులు ‘న్యూస్‌లైన్’తో అన్నారు. బదులుగా జగన్ ఎంతో వినమ్రతతో చిరునవ్వుతో చేతులు జోడించి నమస్కరించారని వివరించారు. అదే ప్రాంగణంలో ఉన్న బ్యాంకు సిబ్బంది కూడా వచ్చి జగన్‌ను కలసి వెళ్లారు. 

‘పాపం! ఆయనకు ఏమి ఖర్మ. మండు వేసవిలోనూ రేయింబవళ్లు ఓదార్పు యాత్ర చేశారు. యాత్ర వల్ల విశ్రాంతి లేక ముఖం చిక్కిపోయింది. బాగా తగ్గిపోయారు. రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ ఇలా కావడం నాకెంతో బాధ కలిగించింది. కళ్లలో నీళ్లు తిరిగాయి. అయినా ఆయన ఎంతో ఆప్యాయంగా చిరునవ్వుతో చేతులు కలిపి పలకరించారు. ఇది మనకు మరువలేని అనుభూతే’ అని కోర్టు హాలులోని ఇద్దరు మహిళా న్యాయవాదులు మాట్లాడుకోవడం కనిపించింది.

నిజమైన నేతంటే ఆయనే..
‘నిజమైన రాజకీయ నాయకుడంటే అలా ఉండాలి. ఫైటింగ్ లీడర్‌కు నిలువెత్తు నిదర్శనం వైఎస్ జగనేనని ఇప్పుడు అర్థమైంది. మొన్నటివరకూ ఆయన ఓదార్పు యాత్రకు వెళితే చూసేందుకు జనం గంటల తరబడి ఎదురు చూస్తున్నారని మీడియాలో చూసి ఎందుకింత క్రేజ్ అనుకున్నాం. ఇప్పుడు మనమే ఆయనను దగ్గర నుంచి చూసేందుకు, కరచాలనం చేసేందుకు పోటీ పడ్డాం. మన మహిళా న్యాయవాదులు జగన్ ఉన్న గదిలోకి వెళ్లి మరీ సంఘీభావం తెలిపి వచ్చారు. గదిలో ఉన్న తనను చూసేందుకు వచ్చిన వారికి జగన్ చిరునవ్వుతో నమస్కరిస్తున్నారు. బాధను మనసులో దాచుకుని, చిరునవ్వును జనానికి చూపుతూ ఆప్యాయత కనబరచడం నిజమైన నేతలకే సాధ్యం. ఆ లక్షణాలు పుణికి పుచ్చుకున్నందుకే జనానికి రియల్ లీడర్‌గా మారారు జగన్’ అని మధ్యాహ్న భోజన విరామ సమయంలో కోర్టు హాలులోనే న్యాయవాదులు చర్చించుకున్నారు. 

‘మేం న్యాయవాద వృత్తి చేపట్టిన ఈ 15 ఏళ్లలో ఎందరో నాయకులు రకరకాల కేసుల్లో కోర్టులకు హాజరయ్యారు. అడ్వకేట్లు వారితో కరచాలనం చేసేందుకు పోటీ పడిన సందర్భం మాత్రం ఇప్పటి వరకూ మేం చూడలేదు’ అని రంజిత్ అనే న్యాయవాది అన్నారు. జగన్‌ను కోర్టు ప్రాంగణం నుంచి పోలీసులు తీసుకెళ్లేప్పుడు కూడా ఆయనతో కరచాలనానికి ఉద్యోగులు, న్యాయవాదులు, ఇతరులు ప్రయత్నించారు. కానీ రద్దీ దృష్ట్యా పోలీసులు ఇరువైపులా తాడు పట్టుకుని ఎవరినీ దగ్గరకు రానీయకుండా జగన్‌ను తీసుకెళ్లారు.
Share this article :

0 comments: