కార్మికులకు జగన్ శుభాకాంక్షలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కార్మికులకు జగన్ శుభాకాంక్షలు

కార్మికులకు జగన్ శుభాకాంక్షలు

Written By news on Tuesday, May 1, 2012 | 5/01/2012

మే డేను పురస్కరించుకుని రాష్ట్రంలోని కార్మిక లోకానికి,వారి కుటుంబ సభ్యులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ కార్మికులకు చరిత్రాత్మక దినమైన మే డే ను తమ హక్కుల సాధనకు ప్రతీకగా ఒక పండుగగా జరుపుకోవడాన్ని ఆయన ఒక ప్రకటనలో అభినందించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్మికుల హక్కుల కోసం, వారి ఉద్యోగ భద్రత కోసం, వారి సంక్షేమం కోసం కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన యావత్ కార్మిక లోకానికీ హామీ ఇచ్చారు. తాము అధికారంలోకొచ్చాక.. దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కార్మికుల పట్ల అనుసరించిన సానుకూల విధానాలను కొనసాగిస్తామని, కార్మిక శాఖను పటిష్టం చేసి కనీస వేతనాల చట్టాన్ని అమలు చేస్తామని, కార్మికుల భద్రత కోసం చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని జగన్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

నారాయణ, రాఘవులు శుభాకాంక్షలు
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కె.నారాయణ, బీవీ రాఘవులు కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మే డే కార్మికుల కుటుంబాలలో సుఖ సంతోషాలు నింపాలని సోమవారం వేర్వేరు ప్రకటనల్లో వారు ఆకాంక్షించారు. సుమారు 125 ఏళ్ల కిందట షికాగోలో కార్మికులు 8 గంటల పని దినం సహా పలు కనీస హక్కుల కోసం పోరాడి అసువులు బాసినా అసలు లక్ష్యం నెరవేరలేదని ఆవేదన వ్యక్తంచేశారు. సంస్కరణల నేపథ్యంలో పోరాడి సాధించుకున్న కనీస హక్కులు సైతం ఆవిరవుతున్నాయని తెలిపారు. హక్కుల సంరక్షణకు పోరాటమే మార్గమని, ఆ దిశగా కార్మికులు సమాయత్తం కావాలని విజ్ఞప్తి చేశారు.
Share this article :

0 comments: