జగన్ ఆస్తులపై విచారణ పూర్తి కాకమునుపే సాక్షి ఖాతాలను నిలిపివేయడం అన్యాయమని - - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ఆస్తులపై విచారణ పూర్తి కాకమునుపే సాక్షి ఖాతాలను నిలిపివేయడం అన్యాయమని -

జగన్ ఆస్తులపై విచారణ పూర్తి కాకమునుపే సాక్షి ఖాతాలను నిలిపివేయడం అన్యాయమని -

Written By news on Wednesday, May 9, 2012 | 5/09/2012

జగతి పబ్లికేషన్స్, సాక్షి దినపత్రిక, జననీ ఇన్‌ఫ్రా కంపెనీల బ్యాంకు ఖాతాలను నిలిపివేయడం సమంజసం కాదని సీపీఐ అభిప్రాయపడింది. జగన్ ఆస్తులపై విచారణ పూర్తి కాకమునుపే సాక్షి ఖాతాలను నిలిపివేయడం అన్యాయమని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీబీఐ చర్య పత్రికా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు. జగన్ కేసులో ఇటీవలే 13 మందిపై చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ ఇంతలోనే ఖాతాలను స్తంభింపజేసి పత్రికా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేయడం అన్యాయమని తెలిపారు. సిబ్బంది జీతభత్యాలకు, పత్రికా స్వేచ్ఛకు ఆటంకం కలుగకుండా దర్యాప్తు సాగించాలని ఆయన సీబీఐకి విజ్ఞప్తి చేశారు. నయా ఉదారవాద ఆర్ధిక విధానాల ఫలితమే ఇటువంటి సంఘటనలని విశాలాంధ్ర సంపాదకుడు కె.శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించగా చట్టం తన పని తాను చేసుకుపోతోందని చాడా వెంకటరెడ్డి అన్నారు.
Share this article :

0 comments: