కలంపై జులుం.. నిరసన గళం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కలంపై జులుం.. నిరసన గళం

కలంపై జులుం.. నిరసన గళం

Written By news on Thursday, May 10, 2012 | 5/10/2012

‘సాక్షి’ పత్రిక, టీవీ చానల్ బ్యాంకు ఖాతాలను సీబీఐ స్తంభింపచేయడంపై అన్ని జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. నేతల ఆధ్వర్యంలో ప్రదర్శనలు, మానవహారాలు, ధర్నాలు నిర్వహించారు. శ్రీకాకుళం పట్టణం, నరసన్నపేటల్లో మానవహారం, రాస్తారోకోలు నిర్వహించారు. విశాఖలోని ఇసుకతోట జాతీయరహదారిపై నాలుగు వేల మంది కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. 42మందిని పోలీసులు అరెస్ట్ చేసి త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పాయకరావుపేటలో రాస్తారోకో నిర్వహించారు. విజయవాడలో ధర్నా, మానవహారం జరిగాయి. 

మచిలీపట్నంలో జాతీయరహదారి-9పై రాస్తారోకో చేపట్టారు. స్థానిక కోనేరుసెంటర్‌లో వైఎస్సార్ సీపీ నేతలు సీఎం కిరణ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పామర్రులో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ దిష్టిబొమ్మను దహనం చేశారు. జగ్గయ్యపేటలోభారీ ధర్నా నిర్వహించారు. పశ్చిమగోదావరిజిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మసెంటర్‌లో రాస్తారోకో జరిగింది. నరసాపురంలో ర్యాలీ నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో రాస్తారోకో చేపట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. అద్దంకి, చీమకుర్తిలలో రాస్తారోకో నిర్వహించారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేపట్టారు. 

జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. నెల్లూరు జిల్లాలో 30 కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్దన్‌రెడ్డి, కోవూరు శాసన సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డిలు ఇందుకూరుపేటలో రాస్తారోకో,, ధర్నా నిర్వహించారు. నెల్లూరు నగరంలో కాగడాల ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. 

తెలంగాణ జిల్లాల్లో: నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. సీబీఐ వైఖరిని నిరసిస్తూ కోదాడలో ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. మరో నలుగురు యువకులు బహుళ అంతస్తుల భవనం ఎక్కి దూకడానికి యత్నించారు. పోలీసులు, నాయకులు వారికి నచ్చజెప్పి కిందికు దింపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బస్టాండ్ ఎదుట రాస్తారోకో చేసి, సీబీఐ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ వర్సిటీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థివిభాగం ఆధ్వర్యంలో సీబీఐ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

ఖమ్మం పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. కొత్తగూడెంలో మోటార్‌సైకిల్ ర్యాలీ చేపట్టారు. మెదక్ జిల్లాలో వైఎస్సార్ సీపీతోపాటు టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎం నేతలు ఆందోళనల్లో పాల్గొన్నారు. పలు చోట్ల అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ నేతలు కూడా ఆందోళనలో పాలుపంచుకున్నారు. వరంగల్ జిల్లాలోని పలుప్రాంతాల్లో రాజకీయపక్షాలు,ప్రజాసంఘాలు,కార్మిక,మేధావులు నల్లబ్యాడ్జీలు ధరించి రాస్తారోకోలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. 

హన్మకొండతో పాటు జనగామ, భూపాలపల్లి, పరకాల, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్,డోర్నకల్, లలో రాజకీయపార్టీలు, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. కోరుట్ల, హుజూరాబాద్,కథలాపూర్, చందుర్తి, కోనరావుపేటల్లో ఆందోళనలు సాగాయి. రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్, తెలుగుదేశం, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నేతలతోపాటు విద్యార్థి, ఉద్యోగ సంఘాల నేతలు కూడా పాల్గొని సర్కారు, సీబీఐ తీరును ఎండగట్టారు. 


సీమ జిల్లాల్లో: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్‌లో ర్యాలీ నిర్వహించారు. సోనియా గాంధీ, సీబీఐ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. బద్వేలు, పోరుమామిళ్ల, పులివెందులలో నిరసనలు చేపట్టారు. నందలూరులో కడప-తిరుపతి రహదారిపై ధర్నా నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ , బనగానపల్లె, నందికొట్కూరు, శ్రీశైలంలలో ఆందోళనలు చేపట్టారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల బ్యానర్‌తో నిరసన ర్యాలీ చేశారు. 

చిత్తూరు పట్టణం, తంబళ్లపల్లె, పెద్దమండ్యం,బి.కొత్తకోట, అంగళ్లులో ధర్నా, రాస్తారోకో చేశారు. శ్రీకాళహస్తి , రేణిగుంటల్లో ధర్నా చేశారు. నగరి నియోజకవర్గం వడమాల పేటలో తిరుపతి - చెన్నై జాతీయ రహదారిలో బైఠాయించి ధర్నా , రాస్తారోకో చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. దర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండల కేంద్రాల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. 

రాజధానిలో: హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టి, సీబీఐ దిష్టిబొమ్మలు దహనం చేశారు. పంజాగుట్ట చౌరస్తాలో ఆందోళనకు దిగిన వైఎస్సార్ పార్టీ నేత రాజ్‌ఠాకూర్,నగర కన్వీనర్ ఆదం విజయ్‌కుమార్, సేవాదళం రాష్ట్ర కన్వీనర్ కోటింరెడ్డి వినయ్‌రెడ్డిలతో పాటు పలువురు నేతలను పోలీస్‌లు అరెస్ట్ చేశారు.
Share this article :

0 comments: