‘చిదంబర రహస్యం’ చెప్పండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘చిదంబర రహస్యం’ చెప్పండి

‘చిదంబర రహస్యం’ చెప్పండి

Written By news on Saturday, May 5, 2012 | 5/05/2012


‘‘టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనతో భేటీ అయినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి చిదంబరం స్పష్టంగా చెప్పారు. అయినా చంద్రబాబు ఇంకా బుకాయిస్తున్నారు. అంటే.. ప్రజలు పిచ్చివాళ్లని బాబు అనుకుంటున్నారా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్ పార్టీతో ఢిల్లీ స్థాయిలోనే చంద్రబాబు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని మేము మొదటి నుంచీ చెబుతున్న విషయం ఇప్పుడు రుజువైంది. ప్రత్యేక ఎజెండాతో రాష్ట్ర రాజకీయాలను ఇద్దరూ కలిసే నడుపుతున్నారు. బాబు సలహాలు, సూచనలతో కేంద్ర ప్రభుత్వాన్ని వయాగా చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని మేము చెబుతున్నది చిదంబరం వ్యాఖ్యల ద్వారా బట్టబయలైంది. ఇప్పటికైనా చిదంబరంతో కుదిరిన రహస్య ఒప్పందమేమిటో చంద్రబాబు బయటపెట్టాలి’’ అని డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మీ ఒప్పందం ఫలితంగానే బాబుపై ఉన్న అవినీతి ఆరోపణలు, కోర్టు కేసులు కనీసం విచారణకు రాకుండానే ఆగిపోయాయి. విజయమ్మ వేసిన పిల్‌తో కోర్టు విచారణకు ఆదేశించినప్పుడు.., సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు వీలుగా సీబీఐ విచారణ జరగకుండా ఆలస్యం చేయడం ఇందులో భాగమే. ఆ ఒప్పందం ఫలితంగానే జగన్‌ను, ఆయన కుటుంబాన్ని ఇద్దరూ కలిసే వేధించారు’’ అని గట్టు ఆరోపించారు. 

‘‘చిదంబరం కుమారుడు, టీడీపీ రాజ్యసభ సభ్యుని మధ్య ఉండే వ్యాపార సంబంధాలు.. చిదంబరం- చంద్రబాబుల మధ్య రాజకీయ సంబంధంగా మారింది. అందులో భాగంగానే చంద్రబాబు కూడా పార్టీలోని సీనియర్లను కాదని సుజనా చౌదరి, సీఎం రమేష్, నామా నాగేశ్వరరావులాంటి వారికి ఢిల్లీలో ప్రాధాన్యతనిచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు’’ అని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన సంక్షోభాలకు అధికార, ప్రధాన ప్రతిపక్షాల మధ్య అనైతికంగా కుదుర్చుకున్న అవగాహనే కారణమని తెలిపారు. భవిష్యత్‌లో టీడీపీకి రెండు లేదా మూడు పార్లమెంట్ సీట్లు వచ్చినా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని చంద్రబాబు ఒప్పందం చేసుకొని ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఆయనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి చిదంబరంతో భేటీ కావడం చూస్తే.. చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం మునిగిపోతున్న టీడీపీని వదిలి కాంగ్రెస్‌లోకి దూకేందుకు సిద్ధపడుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టీడీపీలు రెండూ మునిగిపోయే పడవలే అయినందున బాబు ప్రయత్నం ఫలించకపోవచ్చని ఎద్దేవా చేశారు. ‘‘టీడీపీ జెండా, ఎజెండా చంద్రబాబువి కావు. గుంజుకున్నవే. వాళ్లు తిరిగి గుంజుకుంటే మిగిలేది ఒంటరిగానే కదా. అప్పుడు కాంగ్రెస్‌లో కలవడం తప్ప మరేమీ ఉండదుగా’’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

అప్పుడు ఆనందించింది కిరణేగా!

సీఎల్పీ సాక్షిగా డీఎల్ రవీంద్రారెడ్డి, శంకర్రావు.. వైఎస్‌ని విమర్శిస్తుంటే చూస్తూ ఆనందపడిన కిరణ్‌కుమార్‌రెడ్డి మూతే ఇప్పుడు కాలుతోందని గట్టు ఎద్దేవా చేశారు. ‘‘ఆరోజు రాజశేఖరరెడ్డిగారిని వీళ్లు విమర్శిస్తుంటే ఆనందపడింది సీఎం కాదా? ఎదుటి వారి చేతులు కాలాయని ఆనందపడితే ఈరోజు నీ మూతే కాలుతోంది. వైఎస్‌ని విమర్శించాలని ఆరోజు అధిష్టానం ఆదేశించిందని స్వయంగా శంకర్రావే చెప్పారు’’ అని గుర్తు చేశారు. సీఎంపై డీఎల్, శంకర్రావు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపడుతున్న వారు.. ఇదే నేతలు ఆనాడు వైఎస్‌ను విమర్శిస్తే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 
Share this article :

0 comments: