వైఎస్ పథకాలపై ఉప ఎన్నికల్లో ముస్లింల ప్రచారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ పథకాలపై ఉప ఎన్నికల్లో ముస్లింల ప్రచారం

వైఎస్ పథకాలపై ఉప ఎన్నికల్లో ముస్లింల ప్రచారం

Written By news on Tuesday, May 1, 2012 | 5/01/2012



హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని ముస్లింలకు దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేసిన మేలు మరువలేనిదని వైఎస్సార్ కాంగ్రెస్ మైనారిటీ రాష్ట్ర విభాగ సమావేశం అభిప్రాయపడింది. ఆయన ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని నిర్ణయించింది. విభాగం కన్వీనర్ హెచ్.ఏ.రెహ్మాన్ అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ సమావేశంలో 23 జిల్లాలకు చెందిన ముస్లింలు భారీ ఎత్తున పాల్గొన్నారు. త్వరలో జరుగనున్న ఉప ఎన్నికలను పురస్కరించుకుని ఏర్పాటైన ఈ సమావేశంలో మాట్లాడిన వక్తలు మైనారిటీ వర్గాలకు వైఎస్ చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో రాజశేఖరరెడ్డి కృషి ఫలితంగానే నాలుగు శాతం రిజర్వేషన్లు లభించాయని, దీని వల్ల ఎన్నో కుటుంబాలు బాగు పడ్డాయని అన్నారు.

ఉప ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలు ఇంటింటికీ వెళ్లి వైఎస్ సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని, అందుకు అనుగుణంగా ఒక వ్యూహం రూపొందించుకోవాలని సమావేశం నిర్ణయించింది. సంక్షేమ పథకాలు విస్మరించిన ప్రభుత్వం ఒక్కరోజు అధికారంలో ఉన్నా ప్రజలకు నష్టమని భావించిన ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని తీసుకున్న నిర్ణయం ఫలితంగానే ఎన్నికలను ఎదుర్కొంటున్నామని వక్తలు పేర్కొన్నారు. ఒక వ్యక్తి స్వార్థం కోసం ఈ ఉప ఎన్నికలు వచ్చాయని కాంగ్రెస్, టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని పార్టీ శ్రేణులు తిప్పి కొట్టి ప్రజలకు వాస్తవాలు వివరించాలనిసూచించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు సజ్జల రామకృష్ణా రెడ్డి, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు, ఎస్సీ రాష్ట్ర విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్, ఎన్నారై విభాగం కన్వీనర్ మేడపాటి వెంకట్‌తో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
Share this article :

0 comments: