సర్కారుకు మద్దతివ్వడం సరికాదు: సోలిపేట - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » సర్కారుకు మద్దతివ్వడం సరికాదు: సోలిపేట

సర్కారుకు మద్దతివ్వడం సరికాదు: సోలిపేట

Written By news on Saturday, May 12, 2012 | 5/12/2012

సాక్షిపై దాడి విషయంలో కొన్ని పత్రికలు సర్కారుకు మద్దతివ్వడం సరికాదని టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. శుక్రవారం టీవీ చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. ‘జగన్ కేసు విషయంలో మా ప్రమేయం ఏమీ లేదు.. చట్టం తన పని తాను చేసుకొని పోతుందన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలు.. అనంతరం సాక్షికి ప్రభుత్వం ప్రకటనలు ఆపడాన్ని బట్టి.. కాంగ్రెస్ పార్టీనే ఇదంతా చేయిస్తోందని స్పష్టమయింది. సాక్షిలో వెయ్యిమంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని అనడం సీఎం అవగాహన రాహిత్యాన్ని స్పష్టం చేస్తోంది. అంటే ఇద్దరే ఉంటే చంపేస్తారా? సీబీఐ పలు కేసుల్లో వ్యవహరిస్తున్న తీరుతో దాని ఇజ్జత్ పోతోంది. ఆదిలాబాద్‌లో హేమచంద్రపాండే అనే జర్నలిస్టును కాల్చి చంపడంపై నివేదిక ఇవ్వమంటే ఓ పోలీసు అధికారి రాసినదాన్నే యథాతథంగా ఇచ్చింది. సీబీఐని కాంగ్రెస్ నడుపుతోంది’ అని విమర్శించారు.
Share this article :

0 comments: