చురుగ్గా ఉండే నేతలందర్నీ లోపలేయండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చురుగ్గా ఉండే నేతలందర్నీ లోపలేయండి

చురుగ్గా ఉండే నేతలందర్నీ లోపలేయండి

Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012

 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను ముందస్తుగా అరెస్టుచేయాలని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు అన్ని జిల్లాల ఎస్పీలకూ మౌఖిక ఆదేశాలు జారీచేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు సైతం చేయనీయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం, పోలీసుశాఖ కలసి కట్టుగా కుట్రలు చేస్తున్న విషయం దీంతో బయటపడింది. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సీబీఐ కోర్టుకు హాజరుకానున్న నేపథ్యంలో అన్ని జిల్లాలోనూ ముందస్తు అరెస్టులకు పోలీసుశాఖ ఆదేశాలు జారీచేసింది. శనివారం రాత్రి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో డీజీపీ దినేష్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎం.మహేందర్‌రెడ్డిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఆదివారం ముందస్తు అరెస్టులు చేపట్టాలని సీఎం ఈ సమావేశంలో స్వయంగా నిర్దేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో.. రాజధాని నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక బస్సును దగ్ధం చేసిన ఘటనను సాకుగా చూపి శనివారం నుంచే అరెస్టుల పర్వానికి పోలీసుశాఖ తెరలేపింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ విచారిస్తున్న నేపథ్యంలో.. అరెస్టుల వదంతులను ఒక పథకం ప్రకారం ఎల్లో మీడియా ప్రచారంలోకి తెస్తోంది. ఆ వార్తలతో ఆందోళన చెందిన కార్యకర్తలు నిరసనలు తెలియజేస్తే దాన్ని చిలువలుపలువలుగా చూపాలనే ప్రణాళిక ప్రకారం అసత్య ప్రచారానికి తెరలేపింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండానే రాజధాని నగరంలో కొన్ని ప్రాంతాలను అష్టదిగ్బంధనం చేసిన పోలీసులు.. జిల్లాల్లోనూ ఆది, సోమవారాల్లో మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. 

ఈ నేపథ్యంలోనే పోలీసు ఉన్నతాధికారుల నుంచి అన్ని జిల్లాలకూ సమాచారం వెళ్లింది. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై గతంలో ఏమైనా కేసులుంటే వాటిని కూడా తిరగదోడాలని, ఆ కేసుల్లో అరెస్టు చేయాలని అధికారులు సూచించారు. కేసులు లేని వారిని ముందస్తు అరెస్టుల పేరుతో రిమాండ్‌కు పంపాలని ఆదేశాలు జారీచేశారు. జిల్లాల నుంచి రాజధాని నగరానికి రాకుండా మరింత కట్టడి చేస్తున్నారు. ప్రధాన పట్టణాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి తనిఖీలను ముమ్మరంచేశారు. 
Share this article :

0 comments: