బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు రాజీనామా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు రాజీనామా

బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు రాజీనామా

Written By news on Wednesday, May 30, 2012 | 5/30/2012

విజయ నగరం : వైఎస్ జగన్‌కు బాసటగా నిలుస్తానని ప్రకటించిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు బుధవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్టు రంగారావు ప్రకటించారు. అనుచరులు, మద్దతుదారులు, కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు.

బొబ్బిలి రాజవంశానికి చెందిన సుజయ కృష్ణరంగారావు 2004లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో మరోసారి బొబ్బిలి నుంచి విజయం సాధించారు. రంగారావు కుటుంబానికి రాజకీయంగా ఘన చరిత్ర ఉంది. రంగారావు తాత ఆర్ ఎస్ఆర్ కే రంగారావు అవిభక్త మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
Share this article :

0 comments: