ఇదీ... ఎమ్మార్ కేసు పూర్తి కథ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇదీ... ఎమ్మార్ కేసు పూర్తి కథ

ఇదీ... ఎమ్మార్ కేసు పూర్తి కథ

Written By news on Friday, May 18, 2012 | 5/18/2012

ఎమ్మార్ ప్రాపర్టీస్ దుబాయ్‌కి చెందిన మల్టీనేషనల్ కంపెనీ. 2001లో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చింది. దాని ప్రతినిధులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టుకు అవకాశమివ్వాలని కోరారు. ఆ తరవాత... కన్వెన్షన్ సెంటర్, స్టార్‌హోటల్, గోల్ఫ్‌కోర్స్‌తో ఒక ప్రాజెక్టు కట్టాలని చంద్రబాబు తలచారు. 5 కంపెనీలు ముందుకు వచ్చాయి. అందులో మూడింటిని పక్కనబెట్టారు. రెండిటిని షార్ట్‌లిస్ట్ చేశారు. వాటిలో ఎమ్మార్ ఒకటి. మొదట 285 ఎకరాల్లో తలపెట్టిన ఈ ప్రాజెక్టులో విల్లాల్ని చేర్చాలని, మరో 250 ఎకరాలు చేర్చాలని సీఎం హోదాలో చంద్రబాబు స్వయంగా చెప్పారు. దీంతో భూమి 535 ఎకరాలకు పెరిగింది. పోటీ కంపెనీ టెండరు వేయకపోవటంతో ఎమ్మార్ మాత్రమే టెండరు వేసి... దీన్ని దక్కించుకుంది. ఎమ్మార్ డీల్‌లో మధ్యవర్తిగా వ్యవహరించిన కోనేరు ప్రసాద్... బాబు హయాంలో విశాఖలో బాక్సైట్ తవ్వకాల కోసం దుబాల్ అనే మరో దుబాయ్ సంస్థను కూడా రాష్ట్రానికి తెచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం 2002 జూలెలో భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. 2002 డిసెంబర్లో ఎమ్మార్‌కు ఎకరా 29 లక్షలకు భూములు అప్పగించారు. తర్వాత 2003లో ఎమ్మార్ సంస్థ కోనేరు ప్రసాద్‌కు చెందిన స్టైలిష్ హోమ్స్‌తో కొలాబరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు జీవో 359 జారీ చేసింది. దీని ప్రకారం స్టైలిష్ సంస్థ విల్లాల్ని నచ్చిన రేటుకు అమ్ముకోవచ్చు. 

ఇలా చేయటం వల్లే ఏపీఐఐసీకి నష్టం వచ్చిందని సీబీఐ వాదిస్తోంది. ఏపీఐఐసీ వాటా తగ్గటమే కేసులో ప్రధానాంశం. ప్రాజెక్టు అప్పగింత నుంచే అక్రమాలు జరిగాయని, భూములు కేటాయించింది చంద్రబాబే అని రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కోర్టుకు సమర్పించిన నివేదిక 14వ పేజీలో స్పష్టంగా పేర్కొన్నారు. కొలాబరేషన్ అగ్రిమెంటే కుంభకోణానికి కీలకమని కూడా స్పష్టంచేశారు. హైకోర్టు కూడా విజిలెన్స్ నివేదిక ఆధారంగానే దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు పేర్కొంది. చంద్రబాబు ప్రభుత్వం ఎమ్మార్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో... హోటల్, కన్వెన్షన్ సెంటర్ ప్రాజెక్టుల్లో ఏపీఐఐసీకి 49 శాతం, ఎమ్మార్‌కు 51 శాతం వాటాలున్నాయి. 

ఇక 520 ఎకరాలు కేటాయించే విల్లాలు, గోల్ఫ్ క్లబ్‌లలో 26 శాతం, ఎమ్మార్‌కు 74 శాతం వాటా ఉంటుంది. 2004లో వైఎస్ ప్రభుత్వం వచ్చాక మిగతా ప్రాజెక్టులతో పాటు ఎమ్మార్‌నూ సమీక్షించింది. దీన్ని రద్దు చేస్తే విదేశీ ఇన్వెస్టర్ల విశ్వాసం దెబ్బతింటుందని భావించి... ఈ వ్యవహారాన్ని నాటి ఆర్థిక మంత్రి రోశయ్య నేతృత్వంలోని ఉప సంఘానికి అప్పగించారు. 2005 సెప్టెంబర్ రెండో వారంలో రోశయ్య కమిటీ నివేదిక ఇచ్చింది. 

కన్వెన్షన్ సెంటర్, దాంతో పాటు నిర్మించాలనుకున్న హోటల్‌లకు భారీగా ఖర్చవుతుందని, దీన్ని పూర్తి చేయటానికి ఎక్కువ సమయం పడుతుందని, అందుకోసం దీన్లో అదనపు పెట్టుబడి పెట్టేకన్నా దానికి తగ్గట్టుగా వాటా తగ్గించుకోవటం మేలని సూచించింది. దీనిప్రకారం ఏపీఐఐసీ వాటా హోటల్, కన్వెన్షన్ సెంటర్‌లలో 26 శాతానికి తగ్గింది. నిజానికి 49 కూడా మెజారిటీ కాదు. 26కు కూడా ఓటింగ్ హక్కులుంటాయి. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా చేయటం వల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చిందనేది సీబీఐ వాదన.

2002లోనే అక్రమాలు జరిగాయని నిగ్గు తేల్చినా సీబీఐ మాత్రం 2005 కన్నా ముందు ఏం జరిగిందో తనకు అనవసరమని ఎందుకు అంటోంది? 

విచారణ జరపకముందే 2005 కన్నా ముందు ఎలాంటి అక్రమాలూ జరగలేదని ఎలా తేల్చింది? చంద్రబాబునాయుడికి క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం సీబీఐకి ఏమొచ్చింది? కొలాబరేషన్ ఒప్పందం వల్లే నష్టం వచ్చిందని విజిలెన్స్ తేల్చినపుడు దాన్ని కనీసం విచారించాలి కదా? 

ఎమ్మార్‌కు మేలు చేయాలని వైఎస్సార్ భావిస్తే ఆయనే నేరుగా చేసేవారుగా? రోశయ్య కమిటీకి ఎందుకు అప్పగిస్తారు? 

ఎకరా రూ.4 కోట్లు విలువున్న చోట... హైటెక్ సిటీ సమీపంలో ఏకంగా 535 ఎకరాలను ఎకరా రూ.29 లక్షలకే కేటాయిస్తే ఎందుకు పట్టించుకోవటం లేదు? ఇది తప్పని సీబీఐకి ఎందుకు అనిపించటం లేదు? 1999లోనే మాదాపూర్‌లో తన స్థలాన్ని ఎకరా రూ.కోటికి విక్రయించుకున్న బాబు తరువాత మూడేళ్లకు అంటే 2002లో ఆ పక్కనే ఎకరా రూ.29 లక్షలకు ఎలా ఇచ్చారు?

జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి 1990ల నాటి అంశాల్ని కూడా విచారిస్తూ... అవసరమైతే ఎంత వెనక్కయినా వెళతాం... అని చెబుతున్న సీబీఐ... ఈ కేసులో మాత్రం ఎంత తోసినా 2005 కన్నా వెనక్కి ఎందుకు వెళ్లటం లేదు?
Share this article :

0 comments: